iDreamPost
android-app
ios-app

Tollywood: దూసుకుపోతున్న పుష్ప 2.. టెన్షన్ లో గేమ్ చేంజర్?

  • Published Nov 18, 2024 | 4:58 PM Updated Updated Nov 18, 2024 | 4:58 PM

Tollywood: మొత్తానికి పుష్ప 2 ట్రైలర్ విడుదల అయ్యింది. భారీ అంచనాలు పెంచేసింది.

Tollywood: మొత్తానికి పుష్ప 2 ట్రైలర్ విడుదల అయ్యింది. భారీ అంచనాలు పెంచేసింది.

  • Published Nov 18, 2024 | 4:58 PMUpdated Nov 18, 2024 | 4:58 PM
Tollywood: దూసుకుపోతున్న పుష్ప 2.. టెన్షన్ లో గేమ్ చేంజర్?

పుష్ప 2 ట్రైలర్ వచ్చి రికార్డుల తాండవం చేస్తుంది. యూట్యూబ్ ని శాసిస్తుంది. నెట్టింటిని తగలబెట్టేస్తుంది. పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఓ రేంజ్ లో సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇక పుష్ప 2 ఫీవర్ ఇప్పుడల్లా తగ్గేలా లేదు. రోజు రోజుకో రైజ్ అవుతుంది. ఈ రైజ్ ఇంకొక నెల దాకా రూల్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక నుంచి సినిమా రిలీజ్ అయ్యేదాక ప్రమోషన్స్ మామూలుగా ఉండవని తెలుస్తుంది. రిలీజయ్యాక జస్ట్ యావరేజ్ టాక్ వచ్చినా చాలు థియేటర్లు తగలబడటం ఖాయం అనే కామెంట్స్ విపిస్తున్నాయి. కచ్చితంగా వైల్డ్ ఫైర్ చేస్తాం అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పోతే పుష్ప రాజ్ సెగ ఇప్పుడు గేమ్ చేంజర్ కి తగులుతుంది. ఈ సెగ గేమ్ చేంజర్ కి భారీ టార్గెట్ ని ఫిక్స్ చేసింది. రామ్ చరణ్ కి బాధ్యత పెంచేసింది. అయితే ఉన్నంతలో ఎలాంటి లోటు పాటు లేకుండా నిర్మాత దిల్ రాజు బాగానే ప్లాన్ చేశాడు. కానీ పుష్ప 2కి ఏదైతే హంగామా, బజ్ క్రియేట్ అయ్యిందో అది గేమ్ ఛేంజర్ విషయంలో అంత ఎక్కువగా కనిపించలేదన్నది వాస్తవం. రెండు పెద్ద పాన్ ఇండియా సినిమాలు అయినా కానీ పుష్ప 2 కంటే గేమ్ చేంజర్ ఎందుకో కొంచెం వెనకబడినట్లు అనిపిస్తుంది. అయితే దానికి కారణాలు కూడా లేకపోలేదు.

బడ్జెట్ పరంగా, స్టార్ వాల్యు పరంగా చూసుకుంటే పుష్ప 2, గేమ్ ఛేంజర్ రెండూ కూడా తోపే అని చెప్పాలి. కానీ చరణ్ మూవీకి గతంలో ఎదురైన కొన్ని సమస్యలు ఇప్పుడు దాని బజ్ ని పుష్ప 2 కంటే కొంచెం తగ్గించేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కారణాలు ఏవైనా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది కాబట్టి సో హైప్ తేవాల్సిన బాధ్యత కచ్చితంగా ఉంది. సినిమా పడిపోతుంది రా అనుకునే టైమ్ కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేపి మళ్ళీ టాప్ రేసులో నిలబెట్టాడానే చెప్పాలి. రీసెంట్ గా విడుదల అయిన టీజర్ అంచనాలు పెంచేసింది. విడుదల చేసిన రెండు పాటల్లో ఒకటి సోసో అనిపించినా మరొకటి మాత్రం చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఆ పాట, టీజర్ రెండూ కూడా ఆకట్టుకోవడంతో ఇక గేమ్ చేంజర్ కి తిరుగు ఉండదులే అనే విషయంలో క్లారిటీ వచ్చింది. కానీ పుష్ప 2 ట్రైలర్ విడుదల అయ్యాక గేమ్ చేంజర్ పై బాధ్యత ఇంకా ఎక్కువ అయ్యింది. అందుకే మళ్ళీ సోషల్ మీడియాలో హంగామా షురూ చేయడానికి ఈ నెల 20న మరో సాంగ్ లాంచ్ చేయబోతున్నారు.

ఇదొక మెలోడీ డ్యూయెట్. తమన్ ఈ పాట గురించి ఇప్పటికే పలుమార్లు తెగ ఊరించాడు. అందువల్ల ఫ్యాన్స్ అంచనాలు పెట్టేసుకున్నారు. ఇక ఈ పాట విజువల్ వండర్ గా నిలిచి శ్రోతలను ఆకట్టుకుందంటే ఇక గేమ్ చేంజర్ వెనక్కి చూసుకునే పనిలేదు. విపరీతంగా బజ్ డబుల్ అవ్వడం పక్కా.. కానీ ఎంత భారీ బజ్ ఉన్నా కానీ చివరికి కంటెంటే సినిమాని నిలబెట్టేలా చేస్తుంది. పుష్ప 2, గేమ్ చేంజర్ ఎంత పెద్ద పాన్ ఇండియా సినిమాలు అయినా విడుదల అయ్యాకే వాటి సత్తా ఏంటో తెలుస్తుంది. మరి చూడాలి ఈ రెండు సిమిమలు రిలీజ్ అయ్యాకా ఏ విధంగా సత్తా చాటుతాయి అనేది. ఇదీ సంగతి మరి వీటి గురించి మీరేమి అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetJojobetMadridbetjojobetJojobetjojobetJojobetcasibomcasibomcasibomcasibomcasibomcasibomcasibomcasibom girişchild pornbetciobetciobetcioGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetjojobet