iDreamPost
android-app
ios-app

అలాంటి వాళ్లు దేవర కచ్చితంగా చూడాల్సిందే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్

  • Published Sep 27, 2024 | 11:42 AM Updated Updated Sep 27, 2024 | 11:42 AM

Devara Movie: ఎట్టాకేలకు భారీ అంచనాల నడుమ నేడు ఎన్టీఆర్‌ నటించిన 'దేవర' మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇప్పటికే ఎక్కడ చూసిన దేవర మోత మోగిపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దేవర మూవీ చూసిన అభిమానులు ఒక్కొక్కరూ ఒక్కో స్టైల్ లో రివ్యూ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాంటి వాళ్లు దేవర సినిమా కచ్చితంగా చూడాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Devara Movie: ఎట్టాకేలకు భారీ అంచనాల నడుమ నేడు ఎన్టీఆర్‌ నటించిన 'దేవర' మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇప్పటికే ఎక్కడ చూసిన దేవర మోత మోగిపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దేవర మూవీ చూసిన అభిమానులు ఒక్కొక్కరూ ఒక్కో స్టైల్ లో రివ్యూ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాంటి వాళ్లు దేవర సినిమా కచ్చితంగా చూడాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

  • Published Sep 27, 2024 | 11:42 AMUpdated Sep 27, 2024 | 11:42 AM
అలాంటి వాళ్లు దేవర  కచ్చితంగా చూడాల్సిందే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన దేవర జాతరే కొనసాగుతుంది. గత ఆరేళ్లుగాఫ్యాన్స్ ఎదురు చూపులకు ఎట్టాకేలకు నేడు ఫుల్ స్టాప్ పడింది. ఎన్నో రోజులుగా ఊరిస్తూ మూవీపై పెంచిన హైప్ కి ఏమాత్రం తగ్గకుండా.. నేడు (శుక్రవారం సెప్టెంబర్ 27వ తేదీన) వరల్డ్ వైడ్ గా రిలీజైన దేవర మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ముఖ్యంగా అర్థ‌రాత్రి 1 గంటకే ప్రత్యేక షోస్ స్టార్ట్ అయిపోవడంతో.. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ సందడి మాములుగా లేదు. అంతేకాకుండా.. ఎక్కడ చూసిన దేవర ఫీవరే నడుస్తోంది. పైగా ఈ ఫస్ట్ డే ఫస్ట్ షో కలెక్షన్స్ కు అప్పుడే ఊచకోత మొదలపోయింది. ఇక ఈ సినిమా చూసిన ఫ్యాన్స్, నెటిజన్స్ ఒక్కొక్కరూ ఒక్కో విధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మాత్రం దేవర మూవీ అలాంటోళ్లు కచ్చితంగా చూడాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.

ఎట్టాకేలకు భారీ అంచనాల నడుమ నేడు ఎన్టీఆర్‌ నటించిన ‘దేవర’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇప్పటికే ఎక్కడ చూసిన దేవర మోత మోగిపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దేవర మూవీ చూసిన అభిమానులు ఒక్కొక్కరూ ఒక్కో స్టైల్ లో రివ్యూ ఇస్తున్నారు. అయితే ఎక్కువ శాతం దేవరకు పాజిటివ్ టాక్ వస్తుంది. కానీ,ఇలాంటి సమయంలో కొంతమంది దేవర మూవీపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా.. సోషల్ మీడియాలో కూడా దేవర పై నెగిటివ్ పోస్ట్ లు చేస్తున్నారు. ఇక అలాంటి వారిని ఉద్దేశించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే దేవర మూవీ రిలీజ్ కు ముందు నెగిటివ్ టాక్ ప్రచారం చేశారో.. అలాంటి వారందరూ కచ్చితంగా దేవర మూవీ కచ్చితంగా చూడాలని, ముఖ్యంగా దేవర మూవీలో ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్ చూసి గూజ్ బంప్స్ రావాలని పేర్కొన్నారు.

ఇసారి ఎన్టీఆర్ దేవర రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే దేవరతో ఎన్టీఆర్ రికార్డ్స్ ను తిరగరాయడం పక్కా అని, దీని దెబ్బతో ఇండస్ట్రీలన్నీ షేక్ అవ్వాల్సిందే అంటూ ఫ్యాన్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే తెలుగు  రాష్ట్రాంలోని ఇప్పటికే అన్నీ మల్టీప్లెక్స్ లో దేవర తప్ప మరే సినిమా ఆడే పరిస్థితి లేదు. ముఖ్యంగా హైదరాబాద్‌ లోని ప్రసాద్స్‌ మల్టీప్లెక్స్ లో నేడు దేవర కి ఏకంగా 42 షో లు వేయబోతున్నారు.  అయితే ఇప్పటి వరకు ప్రసాద్‌ మల్టీప్లెక్స్ లో ఒక రోజు ఒక సినిమాకి ఇన్ని షోలు పడిందే లేదు. ఈ అరుదైన రికార్డ్‌ ను దేవర సొంతం చేసుకుంది. ఈ ఆల్‌ టైమ్ రికార్డ్‌ తో పాటు ప్రసాద్స్‌ మల్టీప్లెక్స్ లో మొదటి రోజు అత్యధిక వసూళ్లు సైతం నమోదు అవ్వబోతున్నాయి.

కేవలం ప్రసాద్స్‌ మల్టీప్లెక్స్ లో అనే కాకుండా మొత్తం తెలుగు రాష్ట్రాల మల్టీప్లెక్స్ ల్లోనూ దేవర జోరు కనిపిస్తుంది. పైగా మూవీ మంచి పాజిటివ్ టాక్ రావడతో.. అన్నీ థియేటర్స్ హోస్ ఫుల్ అయిపోయాయి. కేవలం మొదటి రోజు మాత్రమే కాకుండా.. వీకెండ్స్ లో శని, ఆది వారాల్లోనూ సినిమా కు ఇదే స్థాయిలో షో లు పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. దేవర మూవీలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తో పాటు సైఫ్ అలీ ఖాన్ , శృతి మారతే , ప్రకాష్ రాజ్ , శ్రీకాంత్ , నరైన్ , అజయ్ తదితర నటీ, నటులు కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించగా, కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మించారు. మరి, దేవర మూవీ పై ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetpuan girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş