ఇండియాలోనే కాదు జపాన్ మలేషియా లాంటి దేశాల్లోనూ సూపర్ స్టార్ గా తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్న రజినీకాంత్ గురించి సినిమా పరంగా మనకు తెలుసు కానీ ఆయన వ్యక్తిగత జీవితం తొలి రోజుల గురించి అవగాహన తక్కువే. ఓసారి లుక్ వేద్దాం. రజని తల్లితండ్రులు మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన కర్ణాటక వాసులు. 1950 డిసెంబర్ 12న శివాజీరావు గైక్వాడ్ అంటే ఇప్పటి రజనీకాంత్ పుట్టేనాటికి వాళ్లకు ముగ్గురు సంతానం ఉన్నారు. తొమ్మిదేళ్లకే అమ్మను కోల్పోయాడు. పోలీస్ […]
సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం విడుదలైన సూపర్ స్టార్ రజినీకాంత్ బాబా ఎంత పెద్ద డిజాస్టరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విపరీత రేట్లకు కొన్న బయ్యర్లు నిండా మునిగిపోతే రజని తన పారితోషికంలో సగం వెనక్కు ఇచ్చారనే టాక్ అప్పట్లో తమిళ మీడియాను ఊపేసింది. తెలుగులోనూ బాబా తెచ్చిన నష్టాలకు కొదవలేదు. తాను బలంగా నమ్మిన దైవత్వాన్ని కమర్షియల్ గా చెప్పే ప్రయత్నంలో భాగంగా తలైవా స్వంతంగా రాసుకున్న కథ ఇది. నరసింహా లాంటి ఇండస్ట్రీ […]
నవంబర్ 1న అనగా నేడు దివంగత నటుడు పునీత్ రాజ్కుమార్కు కర్ణాటక రత్న అవార్డు ప్రదానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని రాష్ట్ర ప్రభుత్వం నటులు రజనీకాంత్, జూనియర్ ఎన్టీఆర్లను ఆహ్వానించింది. అయితే పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మొదటి సినిమా అప్పుకు రజనీకాంత్ కు, పునీత్ రాజ్ కుమార్ తో యంగ్ టైగర్ ఎన్డీఆర్ కు ప్రత్యేక అనుభంధం, కొంచెం ప్లాష్ బ్యాక్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ తల్లి ఉడిపి జిల్లా కుందాపురకు చెందినవారు […]
తలైవర్ రజినీకాంత్ ని గవర్నర్ పదవి వరించబోతోందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. దేవుడు శాసిస్తే రాజకీయాల్లోకి వస్తానంటూ చాలా కాలం ఊరించి అభిమానులను ఉస్సురనిపించిన సూపర్ స్టార్ మళ్ళీ రాజకీయాల వైపు చూస్తున్నారు. ఇంతకుముందు రజనీకాంత్ ని తమ పార్టీలో చేర్చుకోవాలని ఉవ్విళ్ళూరిన బీజేపీ మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఆరోగ్య కారణాల వల్ల రాజకీయాల్లోకి రావడం లేదని వివరణ ఇచ్చిన రజనీ ఈసారి బీజేపీ ఆఫర్ ని సీరియస్ గానే తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. […]
కన్నడ హీరో రక్షిత్ శెట్టి ఇటీవల ‘777 చార్లీ’ అనే సినిమాతో వచ్చాడు. ఓ కుక్కతో ప్రయాణం ఎలా ఉంది అని కామెడీ, ఎమోషనల్ గా చూపించారు ఈ సినిమాలో. సినిమా రిలీజ్ అయిన దగ్గర్నుంచి చూసిన ప్రతి ఒక్కరు సినిమాని అభినందిస్తున్నారు. కొంతమంది అయితే సినిమా చూసి కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నారు. ఇటీవల 777 చార్లీ సినిమా చూసి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై థియేటర్లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. 777 చార్లీ సినిమాలో సంగీత శ్రింగేరి […]
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకు జైలర్ టైటిల్ ని లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు చిన్న ప్రీ లుక్ పోస్టర్ లాంటిది వదిలారు కూడా. దీని రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి మొదలుకానుంది. ఇందులో చాలా ఆకర్షణలు ఉండబోతున్నాయి. అందులో మొదటిది కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ చేయబోయే పాత్ర. మొదటిసారి ఈ కలయిక జరగనుంది. ఇందులో ఖైదీ క్యారెక్టర్ లో […]
సూపర్ స్టార్ రజనీకాంత్ మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ మరోసారి జోడి కట్టబోతున్నారు. డాక్టర్ తో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకుని బీస్ట్ తో మొదటి ఫ్లాప్ టేస్ట్ చేసిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో ఈ ఇద్దరూ భార్యా భర్తలుగా నటించబోతున్నారు. రోబోలో యాక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్ కోసం ఎందరు ట్రై చేసినా కుదరలేదు. తిరిగి ఇప్పటికి నెల్సన్ వల్ల సాధ్యపడుతోంది. కోలీవుడ్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ […]
1999లో నరసింహ విడుదలైనప్పుడు రేగిన సంచలనం అప్పుడు థియేటర్లలో చూసినవాళ్లు అంత సులభంగా మర్చిపోలేరు. ముఖ్యంగా రజినీకాంత్ రమ్యకృష్ణల హీరో విలన్ కెమిస్ట్రీని అద్భుతంగా ఎంజాయ్ చేశారు. ఇప్పటికీ ఇద్దరి కెరీర్ బెస్ట్ లో ఇది నెంబర్ వన్ అని అభిమానులు చెప్పుకుంటారు. అంతగా దీని ప్రభావం రెండు దశాబ్దాలు దాటిన తర్వాత కూడా ఉంది. టీవీలో వచ్చిన ప్రతిసారి సూపర్ టిఆర్పిని నమోదు చేస్తూనే ఉంది. ఆ మధ్య సన్ టీవీలో ఏడేళ్ల తర్వాత రీ […]
సూపర్ స్టార్ రజినీకాంత్ తన స్థాయి బ్లాక్ బస్టర్ అందుకుని ఏళ్ళు దాటుతోంది కానీ ఆయన మాత్రం సినిమాలు చేసే స్పీడ్ లో తగ్గడం లేదు. ఆ మధ్య వచ్చిన పెద్దన్న ఎంత పెద్ద డిజాస్టరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంలో కనీసం శాటిలైట్ టిఆర్పి రేటింగ్స్ అయినా వచ్చాయి కానీ ఇక్కడ మరీ దారుణం. తెలుగులో మార్కెట్ బాగా డౌన్ అయిపోయిన తలైవా తన రేంజ్ బొమ్మ ఒకటి చేయాలే కానీ దాన్ని సూపర్ హిట్ చేసేందుకు […]
1977 సంవత్సరం. మే 27న విడుదలైన హిందీ సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సంచలన విజయం సాధించి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఏ థియేటర్లో చూసిన జనం జాతర. ఏ రాష్ట్రంలో చూసినా కలెక్షన్ల రికార్డులు. అమితాబ్ బచ్చన్ – వినోద్ ఖన్నా – రిషి కపూర్ ల కాంబోలో దర్శకుడు మన్ మోహన్ దేశాయ్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి బ్రహ్మరథం దక్కింది. చాలా చోట్ల సిల్వర్ జూబ్లీ దాటినా హౌస్ ఫుల్ బోర్డులు పడే […]