iDreamPost
android-app
ios-app

Thalapathy Vijay: హీరో నుంచి దేవుడిగా.. దళపతి విజయ్​కే ఇది ఎలా సాధ్యం?

  • Published Sep 09, 2024 | 5:10 PM Updated Updated Sep 09, 2024 | 5:10 PM

Thalapathy Vijay Hero To Demi God: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ క్రేేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే తమిళనాడులో అదొ పెద్ద పండగ. మరి మిగతా నటులను దాటుకుని హీరో స్థాయి నుంచి దేవుడి స్థాయికి విజయ్ ఎలా ఎదిగాడు? అతడికే ఇది ఎలా సాధ్యం అయ్యింది.

Thalapathy Vijay Hero To Demi God: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ క్రేేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే తమిళనాడులో అదొ పెద్ద పండగ. మరి మిగతా నటులను దాటుకుని హీరో స్థాయి నుంచి దేవుడి స్థాయికి విజయ్ ఎలా ఎదిగాడు? అతడికే ఇది ఎలా సాధ్యం అయ్యింది.

Thalapathy Vijay: హీరో నుంచి దేవుడిగా.. దళపతి విజయ్​కే ఇది ఎలా సాధ్యం?

జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్.. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. తమిళనాడులో ఇప్పుడు విజయ్ దేవుడితో సమానం. అతన్ని హీరోగా చూడటం అక్కడి ప్రేక్షకులు ఎప్పుడో మర్చిపోయారు. విజయ్ కనిపిస్తే దండాలు పెట్టేస్తున్నారు. హారతులు ఇచ్చేస్తున్నారు. తమ ఇష్ట దైవాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభూతికి లోనవుతున్నారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, అమితాబ్, రజనీకాంత్, చిరంజీవి, షారూఖ్, ప్రభాస్.. వీళ్లంతా విపరీతమైన స్టార్ స్టేటస్ అనుభవించారు, అనుభవిస్తున్నారు. అయితే.. వీరి సినిమాలు బాగుంటేనే హిట్ అవుతాయి. ఒకవేళ మూవీ బాగా లేకుంటే.. నిర్మాతలకి నష్టం తప్పదు. నిజానికి ఇందుకు ఏ ఒక్క హీరో కూడా అతీతం కాదు. కానీ.., ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో విజయ్ ఒక్కడే ఆ బ్యారియర్ ని దాటాడు. 2014లో రిలీజ్ అయిన కత్తి తరువాత విజయ్ ఏ సినిమా కూడా కంటెంట్ పరంగా.. అంతే స్థాయిలో మెప్పించలేదు. కానీ.., 2016 నుండి ఇప్పటి వరకు విజయ్ సినిమాలన్నీ హిట్ అనిపించుకున్నాయి. ఇది నిజంగా ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. ఇది ఎలా సాధ్యం అవుతుంది అని ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి.

ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. విజయ్ నటించిన లియో మూవీ ప్రేక్షకులను మెప్పించే స్థాయిలో ఉండదు. జస్ట్ ఓకే కంటెంట్ అంతే. ఆ సినిమా ఏకంగా రూ. 600 కోట్లు కలెక్ట్ చేసిందంటే మీరు నమ్ముతారా? పోయిన వారం రిలీజైన The GOAT మూవీ కూడా ఇంతే. మొదటి రోజే డిజాస్టర్ టాక్ వచ్చింది. కానీ.., కలెక్షన్స్ మాత్రం వేరే రేంజ్ లో ఉన్నాయి. 4 రోజుల్లో.. ఈ మూవీ రూ. 250 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇంకా రన్ కొనసాగుతూనే ఉంది. ఇదంతా ఎలా సాధ్యం అంటే.. విజయ్ తమిళ మార్కెట్ వల్లే. ఎందుకంటే.. కోలీవుడ్ లో కాకుండా మిగతా ఎక్కడ కూడా విజయ్ కి భారీ మార్కెట్ లేదు. అతను జస్ట్ రీజనల్ స్టార్ అంతే. అయినా.. ఇన్ని వందల కోట్లు ఎలా వస్తున్నాయి అంటే..? అదే విజయ్ ఫ్యాన్స్ మహిమ. ఇళయ దళపతి సినిమా ఎంత బాగాలేకుంటే.. తమిళలు అంత ఎక్కువ సార్లు ఆ సినిమాని చూస్తున్నారు. ఆదరిస్తున్నారు. విజయ్ ని గుండెల్లో పెట్టుకుంటున్నారు.

విజయ్ కొత్త సినిమాలకి మాత్రమే ఇలాంటి కలెక్షన్స్ రావడం లేదు. రీ- రిలీజెస్ లో కూడా ఇదే ట్రెండ్. మన ఇండస్ట్రీలో రీ- రిలీజెస్ కి ప్రెస్ మీట్ లు పెట్టుకుని మరీ రిలీజ్ చేస్తే.. 5 నుండి 7 కోట్లు రావడం గగనం అయిపోతుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్ ఇలా వీరందరిది ఇదే రేంజ్. కానీ.. విజయ్ గిల్లీ మూవీ రీ- రిలీజ్ కి 30 కోట్లపైన కలెక్షన్స్ వచ్చాయి. 30 కోట్లు అంటే.. ఓ టైర్ 2 హీరో కొత్త సినిమా కలెక్షన్స్. కోలీవుడ్ లో విజయ్ క్రేజ్ ఎలా ఉందొ చెప్పుకోవడానికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. ఇంతలా విజయ్ అక్కడ ప్రజల గుండెల్లోకి వెళ్లిపోవడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. కెరీర్ లో విజయ్ చాలా లవ్ స్టోరీస్ చేశాడు. ఫ్యామిలీ మూవీస్ చేశాడు. కానీ.., 2003లో రమణ అనే ఓ కొత్త డైరెక్టర్.. విజయ్ తో “తిరుమలై” అనే సినిమా చేశాడు. ఆ మూవీ విజయ్ కి విపరీతమైన ఫ్యాన్ బేస్ తెచ్చి పెట్టింది. అప్పటి వరకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండటం, అలాంటి హీరోకి సూపర్ మాస్ హిట్ పడటంతో కల్లెక్షన్స్ విపరీతంగా వచ్చాయి. ఇక 2004లో విడుదలైన గిల్లీ అక్కడ ఇండస్ట్రీ రికార్డ్స్ సృష్టించింది. ఇది మన ఒక్కడు సినిమాకి రీమేక్. ఆ తరువాత పొక్కిరి సూపర్ హిట్. మధ్యలో మళ్ళీ కొన్ని కూల్ హిట్స్. ఇలా విజయ్ తన గ్రాఫ్ పెంచుకుంటూ పోయాడు.

సరిగ్గా.. ఇక్కడే విజయ్ కి మురగదాస్ తోడయ్యాడు. “తుపాకీ, కత్తి, సర్కార్” లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. మధ్యలో “జిల్లా” సెన్సేషన్ హిట్. ఈ గ్యాప్ లో అట్లీ వచ్చి చేరాడు. తేరి, మెర్సల్, బిగిల్ సెన్సేషన్ హిట్స్. ఇక వీటికి బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. అనిరుధ్, విజయ్ కి వరంలా దొరికాడు. ఇక్కడే విజయ్ కెరీర్ పీక్స్ కి వెళ్లిపోయింది. అప్పట్లో రజనీకాంత్ కి వచ్చిన క్రేజ్ ని దాటి విజయ్ ఎదిగిపోయాడు. ఇక మాస్టర్ దగ్గర నుండి విజయ్ కి తిరుగు లేకుండా పోయింది. సరిగ్గా.. విజయ్ ఇలా ఎదుగుతూ వస్తున్న సమయంలోనే పక్కన తనకి అజిత్ రూపంలో గట్టి పోటీ ఉంటూ వచ్చింది. కానీ.., అజిత్ సినిమాల్ని లైట్ తీసుకున్నాడు. పోటీ నుంచి తప్పుకున్నాడు. ఇక విజయ్ కి పోటీగా నిలిచే ఒక్క స్టార్ కూడా లేకుండా పోయాడు. రజనీ కాంత్ ఉన్నా.. ఆయన ఏజ్ రీత్యా సీనియర్ అయిపోయాడు. సో.. యూత్ అంతా విజయ్ వైపు మళ్ళారు. ఇలా విజయ్ తమిళనాడులో హీరో స్థాయి నుంచి దేవుడు అనిపించుకునే స్థితి వెళ్ళిపోయాడు. ఇంత క్రేజ్ ఉన్న విజయ్ .. ఇప్పుడు తమిళ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. మరి.. ఆయన రాజకీయాల్లో ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.

ఇదికూడా చదవండి: Sundeep Kishan: దళపతి విజయ్ కొడుకు డైరెక్టర్.. సందీప్ కిషన్ హీరో? వాటే కాంబినేషన్..