Swetha
కూలి సినిమా మీద ప్రస్తుతం ఎలాంటి బజ్ క్రియేట్ అయిందో చూస్తూనే ఉన్నాము. సినిమా నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ అంతకంతకు సినిమా మీద భారీ బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ క్రమంలో కూలి టీం కూడా ప్రమోషన్స్ ను చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు .
కూలి సినిమా మీద ప్రస్తుతం ఎలాంటి బజ్ క్రియేట్ అయిందో చూస్తూనే ఉన్నాము. సినిమా నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ అంతకంతకు సినిమా మీద భారీ బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ క్రమంలో కూలి టీం కూడా ప్రమోషన్స్ ను చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు .
Swetha
కూలి సినిమా మీద ప్రస్తుతం ఎలాంటి బజ్ క్రియేట్ అయిందో చూస్తూనే ఉన్నాము. సినిమా నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ అంతకంతకు సినిమా మీద భారీ బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ క్రమంలో కూలి టీం కూడా ప్రమోషన్స్ ను చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు . ముఖ్యంగా అదే రోజున వార్ 2 సినిమా కూడా రిలీజ్ కానుండడంతో ఆ సినిమాను గట్టి పోటీ ఇస్తుంది కూలి మూవీ. ఈ క్రమంలో జూలై 22 న మరో సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. అది కూడా హైదరాబాద్ లో ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేసి అక్కడ ఈ సాంగ్ ను లాంచ్ చేయనున్నారు.
అనిరుధ్ మొదటి సారి హైదరాబాద్ లో లైవ్ కాన్సర్ట్ చేయనున్నాడు. దీనితో భారీ ఎత్తున అభిమానులు ఈ ఈవెంట్ కు తరలి వస్తారని భావిస్తున్నారు. దానికోసం తగిన ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. మోస్ట్ పవర్ ఫుల్ వెపన్ ను కూలి ఇప్పుడు యూజ్ చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు సినిమా నుంచి సాంగ్స్ రిలీజ్ అంటే ప్రీరిలీజ్ ఈవెంట్ కానీ.. లేదా సోషల్ మీడియా వేదికగా గాని రిలీజ్ చేసేవారు. అయితే కూలి విషయంలో మాత్రం మొదటి సారి లైవ్ కాన్సర్ట్ ను ఏర్పాటు చేసి రిలీజ్ చేయనున్నారు. సో పబ్లిసిటీకి ఈ ఈవెంట్ ఇప్పుడు కీలకం కానుంది. అనిరుధ్ లైవ్ కాన్సర్ట్ కోసం ఎప్పటినుంచో అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సాధారణంగా అనిరుష్ ఇలాంటి డబ్బింగ్ వెర్షన్స్ లైవ్ కు ఒప్పుకోడు. కానీ రజిని సినిమా కావడంతో ఈ ఈవెంట్ ను చేస్తున్నట్లు సమాచారం.
ఇక రీసెంట్ గా కూలి నుంచి వచ్చిన మోనిక సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలియనిది కాదు. దీనితో ఊహించినట్టుగానే సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్ కావడంతో.. అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంతా బలంగా నమ్ముతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటె ఇక ట్రైలర్ వచ్చిన తర్వాత మూవీ ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.