iDreamPost
android-app
ios-app

Rajinikanth: రజినీకాంత్ పై పిచ్చి ప్రేమ.. గిన్నిస్ రికార్డు కొట్టిన నటుడు!

  • Published Sep 09, 2024 | 4:10 PM Updated Updated Sep 09, 2024 | 4:10 PM

Actor Vigneshkanth, Rajinikanth, Guinness World Record: సూపర్ స్టార్ పై ఉన్న అభిమానం నటుడు విఘ్నేశ్ కు గిన్నిస్ రికార్డు సాధించేలా చేసింది. ఇక ఈ విషయం తెలుసుకున్న రజినీ అతడిని అభినందిస్తూ.. ప్రత్యేక మెసేజ్ కూడా చేశాడు.

Actor Vigneshkanth, Rajinikanth, Guinness World Record: సూపర్ స్టార్ పై ఉన్న అభిమానం నటుడు విఘ్నేశ్ కు గిన్నిస్ రికార్డు సాధించేలా చేసింది. ఇక ఈ విషయం తెలుసుకున్న రజినీ అతడిని అభినందిస్తూ.. ప్రత్యేక మెసేజ్ కూడా చేశాడు.

  • Published Sep 09, 2024 | 4:10 PMUpdated Sep 09, 2024 | 4:10 PM
Rajinikanth: రజినీకాంత్ పై పిచ్చి ప్రేమ.. గిన్నిస్ రికార్డు కొట్టిన నటుడు!

హీరోలకు కోట్లలో అభిమానులు ఉంటారు. అయితే తమ అభిమానాన్ని ఫ్యాన్స్ రకరకాలుగా చూపిస్తుంటారు. కొందరు గుడి కడితే.. మరికొందరు బడులు కట్టిస్తుంటారు. ఇంకొందరు ఫౌండేషన్స్ స్థాపించి సాయం చేస్తుంటారు. ఇలా రకరకాలుగా ఫ్యాన్స్ తమ ప్రేమను చాటుకుంటూ ఉంటారు. అయితే.. సూపర్ స్టార్ రజినీకాంత్ పై తనకు ఉన్న ప్రేమను కాస్త వెరైటీగా చూపించాడు ఓ నటుడు. అది కాస్త గిన్నిస్ రికార్డు సాధించింది. సూపర్ స్టార్ పై ఉన్న అభిమానం నటుడు విఘ్నేశ్ కు గిన్నిస్ రికార్డు సాధించేలా చేసింది. ఇక ఈ విషయం తెలుసుకున్న రజినీ అతడిని అభినందిస్తూ.. ప్రత్యేక మెసేజ్ కూడా చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు, ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆయన సినిమాలు ఇండియాలోనే కాదు.. విదేశాల్లో కూడా విడుదలతుంటాయి. దాంతో వరల్డ్ వైడ్ గా రజినీకా ఫ్యాన్స్ ఉన్నారు. సెలబ్రిటీలు సైతం రజినీ స్టైల్ కు ఫిదా అవ్వడం మనకు తెలియనిది కాదు. ఇలాగే ఓ నటుడు కూడా రజినీపై పిచ్చి అభిమానాన్ని పెంచుకున్నాడు. ఇప్పుడు ఆ ప్రేమ కారణంగానే ఏకంగా గిన్నిస్ రికార్డు సాధించాడు. ఈ విషయం కాస్త సూపర్ స్టార్ కు తెలియడంతో అతడిని అభినందిస్తూ.. ఓ మెసేజ్ కూడా పంపాడు. అసలు విషయం ఏంటంటే? నటుడు విఘ్నేశ్ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్స్, నటులు, రజినీ విరాభిమానులతో లైవ్ పాడ్ కాస్ట్ నిర్వహించాడు. ఆగకుండా ఏకధాటిగా 50 గంటలు రజినీకి సంబంధించిన విశేషాలతో ఈ పాడ్ కాస్ట్ జరిగింది.

సెప్టెంబర్ 6న ప్రారంభం అయిన ఈ కార్యక్రమం సెప్టెంబర్ 8, రాత్రి 8 గంటల వరకు సాగింది. ఆగకుండా 50 లైవ్ పాడ్ కాస్ట్ చేసినందుకు విఘ్నేశ్ గిన్నిస్ వరల్డ్ రికార్డుకు ఎక్కాడు. ఈ సర్టిఫికెట్ ను డైరెక్టర్ శశికుమార్ అందజేశాడు. ఓ అభిమాని తనపై ఉన్నపిచ్చి ప్రేమతో ఇలా రికార్డు సాధించడంపై రజినీ స్వయంగా స్పందించాడు. ఈ మేరకు విఘ్నేశ్ కు వాయిస్ నోట్ పంపాడు. అందులో..” విఘ్నేశ్ మీ అభిమానానికి మాటలు రావడం లేదు. మిమ్మల్ని ఎలా ప్రశంసించాలో కూడా తెలీడం లేదు. 50 గంటలు ఇంటర్వ్యూ చేయడం చిన్న విషయం కాదు. హ్యాట్సాఫ్ టు యూ. మీ ప్రేమకు ప్రతి ఫలంగా ఏం ఇవ్వాలో అర్థం కాట్లేదు. మీరు ఎప్పటికీ నా గుండెల్లో ఉంటారు. లవ్ యూ” అంటూ సంతోషంతో అభినందనలు తెలిపాడు.

ఇక రజినీ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వెట్టయాన్'(తెలుగులో వేటగాడు)గా రాబోతోంది. అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్, రానా, అమితాబ్ లాంటి బిగ్ స్టార్స్ నటిస్తున్నారు. అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ చేస్తున్నాడు. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహీర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి రజినీపై ఉన్న అభిమానంతో గిన్నిస్ రికార్డు సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş