Swetha
ఈ మధ్య కాలంలో దర్శకులు సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేయడంలో కొత్తదనం ప్రదర్శిస్తున్నారు. రీసెంట్ గా శేఖర్ కమ్ముల కుభేర ట్రైలర్ కట్ ను ఏ రేంజ్ లో చూపించాడొ తెలియనిది కాదు. చాలా యూనిక్ గా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇలా ట్రైలర్స్ ద్వారా సగం సినిమా ప్రేక్షకుడికి పరిచయం అవుతుంది. సో ప్రస్తుతం ప్రేక్షకులు రాబోయే నెలలో రిలీజ్ కానున్న వార్ 2 , కూలి ట్రైలర్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో దర్శకులు సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేయడంలో కొత్తదనం ప్రదర్శిస్తున్నారు. రీసెంట్ గా శేఖర్ కమ్ముల కుభేర ట్రైలర్ కట్ ను ఏ రేంజ్ లో చూపించాడొ తెలియనిది కాదు. చాలా యూనిక్ గా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇలా ట్రైలర్స్ ద్వారా సగం సినిమా ప్రేక్షకుడికి పరిచయం అవుతుంది. సో ప్రస్తుతం ప్రేక్షకులు రాబోయే నెలలో రిలీజ్ కానున్న వార్ 2 , కూలి ట్రైలర్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 14 న కూలి సినిమా రాబోతుంది. ఈ సినిమా మీద ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి అప్డేట్స్ వస్తాయా అని వాటి చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే కూలి మూవీ టీం మాత్రం ఈ మ్యాటర్ లో షాకింగ్ నిర్ణయం తీసుకుందట.
కూలి మూవీ నుంచి ఎలాంటి ట్రైలర్ కానీ టీజర్ కూడా బయటకి రావట. నేరుగా థియేటర్ లోనే ప్రేక్షకులు సినిమాను చూడాలనే డెషిషన్ తీసుకున్నారట. ప్రస్తుతం లోకేష్ టీం ఈ డెసిషన్ మీద డిస్కషన్స్ జరుపుతుందట. సినిమాలో రజినీకాంత్, నాగార్జున , అమీర్ ఖాన్ , ఉపేంద్ర లాంటి భారీ తారాగణం ఉన్నప్పుడు స్పెషల్ ప్రమోషన్స్ అవసరం లేదని వారి అభిప్రాయమట. కానీ ఫ్యాన్స్ మాత్రం ఇలాంటి ట్రైలర్స్ కోసం వెయిట్ చేస్తారు. మరి వారి ఎగ్జైట్మెంట్ ని ఏ విధంగా కంట్రోల్ చేస్తారో… ఏ విధంగా వారికి ప్రామిస్ చేసి థియేటర్స్ వరకు రప్పిస్తారో చూడాలి. ఇంకా దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు. త్వరలోనే ఈ విషయం గురించి వారి నిర్ణయాన్ని అనౌన్స్ చేయనున్నారు.
జూలై నెలాఖరున మాత్రం చెన్నై లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనున్నారు. ఒకవేళ అక్కడ ఏమైనా ట్రైలర్ లాంచ్ చేస్తే సరే.. లేదంటే ఇక వారు తీసుకున్న డెసిషన్ ను ఇంప్లిమెంట్ చేసినట్టే అనుకోవచ్చు . నిజానికి ఓ సినిమాకు ట్రైలర్ చాలా హెల్ప్ చేస్తుంది. సినిమా మీద బజ్ పెంచేలా చేస్తుంది. కానీ కూలి విషయంలో మాత్రం ట్రైలర్ , టీజర్ లేకపోయినా హైప్ తగ్గేలా కనిపించడం లేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.