iDreamPost
android-app
ios-app

కూలీ ట్రైలర్ వచ్చేసింది.. బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే

  • Published Aug 02, 2025 | 7:33 PM Updated Updated Aug 02, 2025 | 7:41 PM

కూలి సినిమా అనౌన్స్ చేసినప్పటినుంచి హైప్ మాములుగా లేదు. ఇక ఆ తర్వాత వస్తున్న ఒక్కో అప్డేట్ ఫ్యాన్స్ లో విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడెప్పుడు లోకేష్ చేసిన మ్యాజిక్ స్క్రీన్ మీద చూద్దామా అని ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ కు కేవలం కొద్దీ రోజులు మాత్రమే ఉంది.

కూలి సినిమా అనౌన్స్ చేసినప్పటినుంచి హైప్ మాములుగా లేదు. ఇక ఆ తర్వాత వస్తున్న ఒక్కో అప్డేట్ ఫ్యాన్స్ లో విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడెప్పుడు లోకేష్ చేసిన మ్యాజిక్ స్క్రీన్ మీద చూద్దామా అని ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ కు కేవలం కొద్దీ రోజులు మాత్రమే ఉంది.

  • Published Aug 02, 2025 | 7:33 PMUpdated Aug 02, 2025 | 7:41 PM
కూలీ ట్రైలర్ వచ్చేసింది..  బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే

కూలి సినిమా అనౌన్స్ చేసినప్పటినుంచి హైప్ మాములుగా లేదు. ఇక ఆ తర్వాత వస్తున్న ఒక్కో అప్డేట్ ఫ్యాన్స్ లో విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడెప్పుడు లోకేష్ చేసిన మ్యాజిక్ స్క్రీన్ మీద చూద్దామా అని ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ కు కేవలం కొద్దీ రోజులు మాత్రమే ఉంది. దీనితో మూవీ మేకర్స్ రెండు రోజుల నుంచి సినిమా ట్రైలర్ రిలీజ్ మీద ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. ఫైనల్ గా అనుకున్న టైం కి కూలీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ ట్రైలర్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది. ఈ సినిమాకు రజినీకాంత్ , లోకేష్ తో పాటు.. అనిరుధ్ కూడా మెయిన్ పిల్లర్ లా మారాడు.

ట్రైలర్ ను గమనిస్తే ఒక్కో షాట్ ఒక్కో విజువల్ లో లోకేష్ మార్క్ క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే రజిని విజువల్స్ అయితే పీక్స్ అని చెప్పాల్సిందే. పవర్ హౌస్ బ్లాస్ట్ అయ్యే పెర్ఫామెన్స్ ఇది అని ప్రతి ఒక్కరు అనాల్సిందే. ఇక మెయిన్ గా అంతా వెయిట్ చేస్తుంది కింగ్ నాగ్ కోసం. నాగార్జున ఈ సినిమాలో విలన్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. నాగ్ లుక్స్ అయితే మాములుగా లేవు. ఆ రేంజ్ లో ట్రైలర్ ప్రేక్షకులకు కిక్ ఇచ్చింది.

దీనికే ఇలా ఉంటె ఇక సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుందో.. అందరు ఊహించవచ్చు. ఇప్పటికే సినిమా మీద బజ్ విపరీతంగా ఉంది. ఇక ఇప్పుడు ట్రైలర్ తర్వాత అసలు ఈ హైప్ ను ఎవరు మ్యాచ్ చేయలేరనే రేంజ్ కు వెళ్ళిపోయింది. చూడబోతుంటే ఆగస్టు 14 న థియేటర్స్ దద్దరిల్లిపోతాయని అనిపిస్తుంది. సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఎలాంటి సందేహాలు లేకుండా చెప్పేయొచ్చు. ఇక ప్రీరిలీజ్ ఈవెంట్స్ , ఇంటర్వూస్ లో సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటకు వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.