iDreamPost
android-app
ios-app

Rajinikanth: అప్పుడు ‘కావాలయ్య’.. ఇప్పుడు ‘మనసిలాయో’.. రజినీ సినిమాలకు శుభారంభాన్నిస్తున్న సెలబ్రేషన్ సాంగ్స్!

  • Published Sep 18, 2024 | 4:16 PM Updated Updated Sep 18, 2024 | 4:16 PM

Vettaiyan: సూపర్ స్టార్ రజినీకాంత్ 'వేట్టైయాన్' సినిమాతో త్వరలో అభిమానుల ముందుకు రాబోతున్నాడు. మంజు వారియర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా నుంచి 'మనసిలాయో' పాట విడుదల అయ్యింది.

Vettaiyan: సూపర్ స్టార్ రజినీకాంత్ 'వేట్టైయాన్' సినిమాతో త్వరలో అభిమానుల ముందుకు రాబోతున్నాడు. మంజు వారియర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా నుంచి 'మనసిలాయో' పాట విడుదల అయ్యింది.

  • Published Sep 18, 2024 | 4:16 PMUpdated Sep 18, 2024 | 4:16 PM
Rajinikanth: అప్పుడు ‘కావాలయ్య’.. ఇప్పుడు ‘మనసిలాయో’.. రజినీ సినిమాలకు శుభారంభాన్నిస్తున్న సెలబ్రేషన్ సాంగ్స్!

తమిళ స్టార్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రజినీ రూటే సపరేటు. వెండితెరపై ఆయన కనిపిస్తే చాలు అభిమానులకు కనుల పండగే అని చెప్పాలి. ఆయనకి రికార్డులు కొత్త కావు. ఎంత మంది కొత్త స్టార్ హీరోలు వచ్చినా జనాల్లో రజినీ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గదు. ఇక గతేడాది ‘జైలర్’ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారు రజిని. ఈ సినిమా 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రజినీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా అంత పెద్ద విజయం కావడంలో పాటలు కూడా ముఖ్య పాత్ర పోషించాయి. అనిరుద్ రవి చందర్ కంపోజ్ చేసిన పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పటికీ కూడా శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి.

జైలర్ సినిమా నుంచి ఫస్ట్ రిలీజ్ అయిన సాంగ్ ‘కావాలయ్య’. ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పాటలో తమన్నా గ్లామర్, డ్యాన్స్ ఇంకా రజినీ స్వాగ్ అదిరిపోయాయనే చెప్పాలి. ఇప్పటికి కూడా ఈ పాట ఆకట్టుకుంటుంది. యూ ట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టిన ఈ పాట జైలర్ సినిమాకి ఫస్ట్ ఇంప్రెషన్ గా మారింది. సినిమాపై బజ్ ని క్రియేట్ చేసింది. సినిమా విడుదల అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి లాంగ్ రన్ అయిపోయేదాకా ఈ పాట మారుమొగిపోయింది. ఇలా ఈ సాంగ్ ఈ సినిమాకి మంచి శుభారంభాన్ని ఇచ్చింది. సినిమా హిట్ అవడంలో ఒక ముఖ్య భాగం అయ్యింది.

ఇక రజినీ ‘వేట్టైయాన్’ సినిమాతో త్వరలో అభిమానుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి టీ.జే. జ్ఞానవేల్ దర్శకుడు. మంజు వారియర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ‘మనసిలాయో’ పాట విడుదల అయ్యింది. యూ ట్యూబ్ లో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈ పాట ఇన్స్టా రీల్స్ లో తెగ ట్రెండ్ అవుతుంది. ఈ పాటలో మంజు వారియర్ డ్యాన్స్, ఎక్స్ ప్రెషన్స్ కి యూత్ ఫిదా అయిపోతున్నారు. ఇప్పటిదాకా ఈ సాంగ్ 20 మిలియన్ పైగా వ్యూస్ రాబట్టింది. ఇంకా ఈ పాట మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాకి సూపర్ బజ్ ని తెచ్చిపెట్టింది. అప్పుడు జైలర్ సినిమాకి కావాలయ్య ఏ విధంగా ఫస్ట్ ఇంప్రెషన్ గా నిలిచిందో ఇప్పుడు మనసిలాయో సాంగ్ వేట్టైయాన్ కి అదే విధంగా ఫస్ట్ ఇంప్రెషన్ అయ్యింది. ఈ సినిమాకి కూడా అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక బాగా ట్రెండ్ అవుతున్న ఈ సాంగ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbankobet girişgrandpashabet