iDreamPost
android-app
ios-app

రజినీ కాంత్ టీంకి తప్పిన ప్రమాదం.. ఏం జరిగిందంటే..

  • Published Sep 14, 2024 | 6:40 PM Updated Updated Sep 14, 2024 | 6:40 PM

లోకేశ్ కనగరాజ్- సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబోలో వస్తున్న చిత్రం కూలీ. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతుంది. అయితే పెను ప్రమాదం నుండి రజనీకాంత్ టీం తప్పించుకుంది. ఏం జరిగిందంటే..?

లోకేశ్ కనగరాజ్- సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబోలో వస్తున్న చిత్రం కూలీ. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతుంది. అయితే పెను ప్రమాదం నుండి రజనీకాంత్ టీం తప్పించుకుంది. ఏం జరిగిందంటే..?

  • Published Sep 14, 2024 | 6:40 PMUpdated Sep 14, 2024 | 6:40 PM
రజినీ కాంత్ టీంకి తప్పిన ప్రమాదం.. ఏం జరిగిందంటే..

సూపర్ స్టార్ రజినీకాంత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో జోరు పెంచారు. 73 ఏళ్ల వయస్సులో కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు. గత ఏడాది జైలర్ హిట్టుతో మరింత జోష్ పెంచిన ఆయన.. ఇప్పుడు రెండు చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వస్తున్న వెట్టయాన్ మూవీ కంప్లీట్ చేసిన సంగతి విదితమే. అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అంతలోనే మరో మూవీని లైన్లో పెట్టారు తలైవా. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ మూవీ చేస్తున్నారు రజనీ. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం వైజాగ్‌లో జరుపుకుంటుంది. చిత్రీకరణ జరుగుతున్న ప్రదేశానికి దగ్గరలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్ టెర్మినల్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.

గత నెలలో చైనా నుండి లిథియం బ్యాటరీ లోడ్ కంటైనర్ వైజాగ్‌కు వచ్చింది. దీన్ని వైజాగ్ పోర్ట్ ఏరియాలో నిలిపి ఉంచారు. ఇక్కడికి అత్యంత సమీపంగానే కూలీ షూటింగ్ జరుపుకుంటుంది. తొలుత కంటైనర్ నుండి పొగలు రావడాన్ని గుర్తించిన టెర్మినల్ సిబ్బంది.. వెంటనే పోర్ట్ ఫైర్ విభాగానికి సమాచారం అందించడంతో.. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునే లోపే.. అందులో ఉన్న బ్యాటరీలను బయటకు తీసేశారు సిబ్బంది. కొన్ని బ్యాటరీలు దగ్దమయ్యాయి. దీంతో పెను విపత్తు నుండి బయటపడినట్లు అయ్యింది. షూటింగ్ సమయంలోనే ఈ ప్రమాదం జరగడంతో భయానికి గురయ్యారు అక్కడి వారు. పెను ప్రమాదం నుండి రజనీకాంత్ టీం తప్పించుకున్నట్లయ్యింది. అయితే ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఇప్పటికే ఈ సినిమా 70 శాతం పూర్తయినట్లు తెలుస్తుంది.

లియో తర్వాత లోకేశ్ కనగరాజ్ నుండి వస్తున్న చిత్రం కూలీ. ఊహించని కాస్టింగ్ ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. సౌత్ ఇండియన్ స్టార్స్ మొత్తం ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం. మంజుమ్మల్ బాయ్స్‌తో పాన్ ఇండియన్ లెవల్ గుర్తింపు తెచ్చుకున్న మలయాళ స్టార్ సౌబిన్ షాహీర్, తెలుగు స్టార్ హీరో అక్కినేని నాగార్జున, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, సత్యరాజ్ తో పాటు శృతి హాసన్ వంటి స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు లోకేశ్. ఇది కూడా తన యూనివర్శ్ చిత్రాల్లో భాగమా కాదా అని తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişasyabahis girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom