iDreamPost
android-app
ios-app

The Goat Movie: దళపతి విజయ్ అరుదైన ఘనత.. రజినీకాంత్ తర్వాత ఆ రికార్డు.. 

  • Published Sep 04, 2024 | 12:28 PM Updated Updated Sep 04, 2024 | 12:28 PM

Thalapathy Vijay, The Goat movie, ParkQwik Company: ది గోట్ మూవీతో దళపతి విజయ్ అరుదైన ఘనతను సొంతం చేసుకోనున్నాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు రజినీకే దక్కింది. ఇప్పుడు విజయ్ సూపర్ స్టార్ సరసన చేరనున్నాడు.

Thalapathy Vijay, The Goat movie, ParkQwik Company: ది గోట్ మూవీతో దళపతి విజయ్ అరుదైన ఘనతను సొంతం చేసుకోనున్నాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు రజినీకే దక్కింది. ఇప్పుడు విజయ్ సూపర్ స్టార్ సరసన చేరనున్నాడు.

  • Published Sep 04, 2024 | 12:28 PMUpdated Sep 04, 2024 | 12:28 PM
The Goat Movie: దళపతి విజయ్ అరుదైన ఘనత.. రజినీకాంత్ తర్వాత ఆ రికార్డు.. 

సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన స్టైల్ కు సెలబ్రిటీలే ఫ్యాన్స్ గా మారుతుంటారు. ఇక తమిళంలో రజినీ తర్వాత మళ్లీ అంతటి ఫాలోయింగ్ ఉన్నది దళపతి విజయ్ కే. ఇక విజయ్ నటించిన ‘ది గోట్’ మూవీ రేపు(సెప్టెంబర్ 5న) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. దళపతి మూవీ వస్తుందంటే చాలు.. ఫ్యాన్స్ కు పెద్ద పండగే. తమిళంలో అయితే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ది గోట్ మూవీతో ఆ ఘనత సాధించిన హీరోగా విజయ్ నిలవనున్నాడు.

దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ ‘ది గోట్’. స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ పార్కింగ్ కంపెనీ తమ ఉద్యోగులకు ది గోట్ విడుదల సందర్భంగా సెలవు ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ”విజయ్ పై ఉన్న ప్రత్యేక అభిమానానికి, మా ఉద్యోగుల్లో ఉన్న ఉత్సాహానికి గుర్తుగా ది గోట్ మూవీ రిలీజ్ సందర్భంగా కంపెనీ ఉద్యోగులకు సెలవు ప్రకటిస్తున్నాం. అలాగే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావాలని ఆకాంక్షిస్తున్నాం. అలాగే ఉద్యోగులకు కాంప్లిమెంటరీ టికెట్లను అందించబోతున్నాం” అని పార్క్విక్ సీఈవో అరుణ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశాడు.

సాధారణంగా తమిళ్ లో రజినీకాంత్ సినిమా వస్తుందంటే చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవుతో పాటుగా టికెట్లను స్పాన్సర్ చేస్తాయి. ఆ ఘనత ఇప్పటి వరకు ఒక్క రజినీకే దక్కింది. కానీ తాజాగా ది గోట్ మూవీతో విజయ్ దళపతి సైతం ఈ అరుదైన ఘనతను చేరుకున్నాడు. కాగా.. ది గోట్ మూవీలో విజయ్ డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నాడు. మీనాక్షి చౌదరి, స్నేహ, ప్రభుదేవ, ప్రశాంత్, వైభవ్, కన్నడ సూపర్ స్టార్ కిచ్చ సుదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి దళపతి మూవీ విడుదల సందర్భంగా ఉద్యోగులకు సెలవు ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş