రజిని కాకుండా నాగార్జున , ఉపేంద్ర , అమీర్ ఖాన్ , శృతిహాసన్, సత్యరాజ్ క్యామియోలు కూలీ కి స్పెషల్ హైప్ క్రియేట్ చేసిన పాయింట్స్. ఇక అనిరుధ్ మ్యూజిక్ వీటికి యాడ్ ఆన్ అనుకోవచ్చు. మరి వీరంతా కలిసి సృష్టించిన కూలీ ప్రేక్షకులకు మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూసేద్దాం.
రజిని కాకుండా నాగార్జున , ఉపేంద్ర , అమీర్ ఖాన్ , శృతిహాసన్, సత్యరాజ్ క్యామియోలు కూలీ కి స్పెషల్ హైప్ క్రియేట్ చేసిన పాయింట్స్. ఇక అనిరుధ్ మ్యూజిక్ వీటికి యాడ్ ఆన్ అనుకోవచ్చు. మరి వీరంతా కలిసి సృష్టించిన కూలీ ప్రేక్షకులకు మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూసేద్దాం.
Swetha
లోకేష్ కనగరాజ్ , రజినీకాంత్ కాంబినేషన్ లో కూలీ సినిమా అనౌన్స్ చేసినప్పటినుంచే సినిమా మీద విపరీతమైన బజ్ పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత రిలీజ్ ముందు వరకు వచ్చిన ప్రతి అప్డేట్ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసింది. లోకేష్, రజిని కాకుండా నాగార్జున , ఉపేంద్ర , అమీర్ ఖాన్ , శృతిహాసన్, సత్యరాజ్ క్యామియోలు కూలీ కి స్పెషల్ హైప్ క్రియేట్ చేసిన పాయింట్స్. ఇక అనిరుధ్ మ్యూజిక్ వీటికి యాడ్ ఆన్ అనుకోవచ్చు. మరి వీరంతా కలిసి సృష్టించిన కూలీ ప్రేక్షకులకు మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూసేద్దాం.
కథ :
సైమన్ (నాగార్జున) వైజాగ్‌లో కింగ్‌పిన్ అనే షిప్యార్డ్ని లీజ్‌కి తీసుకొని అక్కడ గోల్డ్ వాచ్‌లు, ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాలు స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. ఈ వ్యాపారం అంతటిని దయాళ్ (సౌబిన్ షాహిర్) చూసుకుంటూ ఉంటాడు. అతను అసలు జాలి దయ లాంటిది లేకుండా అరాచకం సృష్టిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో రాజశేఖర్ (సత్యరాజ్) తో ఓ డీల్ ను కుదుర్చుకుంటాడు సైమన్. ఆ డీల్ చేయకపోతే అతని ముగ్గురు కూతుళ్లను చంపేస్తాం అని చెప్పడంతో రాజశేఖర్ ఒప్పుకుంటాడు. అతని కూతురు ప్రీతి (శ్రుతి హాసన్)తో కలిసి ఈ పని చేస్తూ ఉంటాడు. మరోవైపు చెన్నైలో ఒక లాడ్జ్ నడుపుతూ ఒంటరిగా బతుకుతూ ఉంటాడు దేవా (రజినీకాంత్). రాజశేఖర్ , దేవా ప్రాణమిత్రులు. ఉన్నట్టుండి ఓ రోజు రాజశేఖర్ చనిపోయాడన్న వార్తా అతనికి తెలిసి అక్కడికి వస్తాడు. అయితే రాజశేఖర్‌ది సహజ మరణం కాదని హత్య అని గుర్తించి సైమన్ పోర్ట్ లకు అడుగుపెడతాడు. రాజశేఖర్ హత్య వెనుక ఉన్నది ఎవరు? వాళ్లని దేవా పట్టుకున్నాడా? అసలు దేవా ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఇంతకీ దాహా (ఆమిర్ ఖాన్), ఖలీషా (ఉపేంద్ర) క్యారెక్టర్స్ ఏంటి ? అనేది తెరపై చూడాల్సిన కథ.
నటి నటుల పని తీరు :
ఈ సినిమాలో నటించిన క్యామియోలు అంతా కూడా ఎవరి పాత్రకు వారు పూర్తి న్యాయం చేసారని చెప్పొచ్చు. రజినీకాంత్ ఎప్పటిలానే తన పాత్రలో పూర్తిగా లీనమైపోయారు. కొన్ని యాంగిల్స్ లో వింటేజ్ రజినికాంత్ ను చూడొచ్చు. ఇక తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సైమన్ క్యారెక్టర్ విషయానికొస్తే.. అసలు కింగ్ నాగ్ విలన్ పాత్రలో చించేసాడని అనే టాక్ వినిపిస్తుంది. చాలా సునాయాసంగా నాగ్ సైమన్ పాత్రకు న్యాయం చేసాడు. ఇక షౌబిన్ షాహిర్ స్క్రీన్ మీద ఉన్నంత సేపు అదరగొట్టేసాడు. అమీర్ ఖాన్ , ఉపేంద్ర , సత్య రాజ్ లు ఉన్నది కాసేపే అయినా ఇంపాక్ట్ ఉండే రోల్స్ లోనే కనిపించారు. ఇక శృతిహాసన్ విషయానికొస్తే.. ఆమె గతంలో ఇలాంటి క్యారెక్టర్స్ ఎన్నో చేసింది. ఆలా ఎప్పటిలానే ఈసారి కూడా అదరగొట్టేసింది. షాకింగ్ ట్విస్ట్ లన్ని ఆమె చుట్టూనే తిరుగుతుంటాయి. ఇక మిగిలిన వారు కూడా వారి పరిధి మేర వారి పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నీకల్ విభాగం పని తీరు :
కూలీతో లోకేష్ మార్క్ ఏంటో మరోసారి క్లియర్ గా కనిపించింది. ఇక సినిమాలో చాలా మంది హీరోలు ఉన్న మాట నిజమే కానీ తెర వెనుక ఉండి ముందుకు నడిపించిన హీరో మాత్రం అనిరుద్ ఏ. అసలు ఒక్కో సీన్ ను ఎలివేట్ చేసిన విధానమే హైలెట్ అనుకుంటే.. దానికి యాడ్ అయిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకాస్తా పుష్ ఇచ్చింది. ఇక సినిమాటోగ్రఫీ చాలా ప్లెజెంట్ గా సాగిపోతూ ఉంటుంది. ఆర్టిస్ట్ ల క్యాస్టింగ్ , ప్లేసెమెంట్ అంతా బాగా కుదిరింది. కానీ సినిమా రన్ టైమ్ కాస్త ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. VFX విషయంలో , ఎడిటింగ్ విషయంలో కొంచెం కేర్ తీసుకుంటే బాగుండేదనే ఫీల్ కలుగుతుంది. ఓవరాల్ గా టెక్నీకల్ టీం తమ టాలెంట్ ను నిరూపించుకున్నారు.
విశ్లేషణ :
తమిళం నుంచి రజినీకాంత్ , తెలుగు నుంచి నాగార్జున , మలయాళం నుంచి సౌబిన్ షాహిర్ , హిందీ నుంచి అమీర్ ఖాన్ , కన్నడ నుంచి ఉపేంద్ర ఇలా ఐదు బాషల కలయికలో కూలి రూపుదిద్దుకుంది. ఇంతమంది స్టార్స్ ఒకే సినిమాలో నటిస్తున్నారు అంటే అంచనాలు పీక్స్ లో ఉండడం చాలా సహజం. కానీ ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్లిన వారిని మాత్రం కూలి అప్సెట్ చేయొచ్చు. ఎందుకంటే ఇదివరకు సినిమాలల కాకుండా లోకేష్ ఈసారి ఓ సింపుల్ కథను ప్రేక్షకులకు చూపించాలని అనుకున్నాడు. అనుకోని విధంగా మరణించిన తన స్నేహితుడి కోసం.. ఓ మాజీ కూలి నాయకుడు మొదలుపెట్టిన ప్రయాణం కూలి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొన్ని ప్రశ్నలు , సందేహాలు.. కొంచెం కన్ఫ్యూజన్.. సెకండ్ హాఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ తో సాగిపోతూ ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ ఓ హై ఫీలింగ్ ఇస్తుంది.
ఇక సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి అప్పుడు అసలు సినిమా కాన్ఫ్లిక్ట్ ఏంటి అనేది అర్ధమౌతుంది. కానీ మరీ ఊహించినంత ట్విస్ట్ లు ఏమి ఉండవు. క్యారెక్టర్స్ ముందే రివీల్ చేశారు కాబట్టి కొంచెం గెస్ చేసేలానే ఉన్నాయి. కాకపోతే ఆ క్యారెక్టర్స్ ఎంట్రీ , ప్లేసెమెంట్ మాత్రం కాస్త హై ఫీల్ ఇస్తుంది. ఉపేంద్ర , అమీర్ ఖాన్ కు ఉన్న కాసేపు కూడా మంచి షాట్స్ పడ్డాయి. అలా చివరి అరగంట ఎంగేజింగ్ గా సాగిపోతూ ఉంటుంది. తన స్నేహితుడిని చంపినా వాడి మీద రజిని రివెంజ్ తీసుకున్నాడా లేదా అనేది చూపించి ఎండ్ చేసేస్తారు.
ప్లస్ లు :
నటీనటులు
సినిమాటోగ్రఫి
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
మైనస్ లు:
ఫస్ట్ హాఫ్ (కొన్ని సీన్స్)
సేమ్ టెంప్లెట్ ఉండే సీన్స్ (కొన్ని)
రేటింగ్ : 2.75/5
చివరిగా : ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే మాత్రం రజిని రివెంజ్ డ్రామాను ఎంజాయ్ చేయొచ్చు