iDreamPost
android-app
ios-app

కమల్ హాసన్, రజినీకాంత్ తో లోకేష్ ?

  • Published Aug 19, 2025 | 12:13 PM Updated Updated Aug 19, 2025 | 12:13 PM

భారీ అంచనాల మధ్యన లోకేష్ కనగరాజ్ రజినీకాంత్ కాంబినేషన్ లో కూలీ సినిమా రిలీజ్ అయింది . మొదటి రోజు సినిమాకు మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. దానికి కారణం సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకోడమే. ఎందుకంటే గతంలో వచ్చిన లోకేష్ సినిమాలు సెట్ చేసిన మార్క్ అలాంటిది.

భారీ అంచనాల మధ్యన లోకేష్ కనగరాజ్ రజినీకాంత్ కాంబినేషన్ లో కూలీ సినిమా రిలీజ్ అయింది . మొదటి రోజు సినిమాకు మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. దానికి కారణం సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకోడమే. ఎందుకంటే గతంలో వచ్చిన లోకేష్ సినిమాలు సెట్ చేసిన మార్క్ అలాంటిది.

  • Published Aug 19, 2025 | 12:13 PMUpdated Aug 19, 2025 | 12:13 PM
కమల్ హాసన్, రజినీకాంత్  తో లోకేష్ ?

భారీ అంచనాల మధ్యన లోకేష్ కనగరాజ్ రజినీకాంత్ కాంబినేషన్ లో కూలీ సినిమా రిలీజ్ అయింది . మొదటి రోజు సినిమాకు మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. దానికి కారణం సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకోడమే. ఎందుకంటే గతంలో వచ్చిన లోకేష్ సినిమాలు సెట్ చేసిన మార్క్ అలాంటిది. కానీ కూలీ సినిమా అలాంటి జోనర్ కాదు. మొదటి రోజు అలాంటి అంచనాలు పెట్టుకుని వెళ్లడం వలన ప్రేక్షకులు పూర్తిగా శాటిస్ఫై కాలేకపోయారు. కానీ తర్వాత తరవాత సినిమాకు మంచి టాక్ లభించింది. సరే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

సూపర్ స్టార్ రజినీకాంత్ , లోకనాయకుడు కమల్ హాసన్ ఈ ఇద్దరు తమిళంతో పాటు తెలుగులో కూడా.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నవారే. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి కూడా ఇద్దరు పోటా పోటీగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నారు. ఇద్దరికీ ఇద్దరు తమకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నారు. అయితే ఇప్పటివరకు ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి కానీ.. వీరిద్దరూ కలిసి నటించింది లేదు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరి నుంచి ఓ సినిమా రాబోతుందనే వార్తలు ఇండస్ట్రీలో గుప్పుమంటున్నాయి. పైగా ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయబోతున్నాడట.

కానీ కూలీ ప్రమోషన్స్ లో లోకేష్ చెప్పిన మాటలు వింటే మాత్రం కొత్త అనుమానాలు రాక మానవు. ఎందుకంటే ఆ ఈవెంట్ లో లోకేష్ కూలీ అయిన వెంటనే ఖైదీ 2 మొదలు పెడతానని డైరెక్ట్ గా చెప్పకపోయినా చూచాయగా చెప్పాడు. మరి ఇప్పుడు ఖైదీ 2 ప్లేస్ లో సడెన్ గా ఈ మల్టీస్టారర్ ఎందుకు వచ్చింది అనేది లోకేష్ కె తెలియాలి. కూలీ టాక్ సరిగా లేదు కాబట్టి ఫ్యాన్స్ లో ఆ హై ని నిలబెట్టడానికి ఈ న్యూస్ బయటకు చెప్పారా అని అనుకుంటున్నారు అంతా. ఒకవేళ నిజంగా కమల్ , రజిని కాంబినేషన్ కనుక నిజంగానే వర్క్ అవుట్ అయితే అంతకంటే బెస్ట్ ప్రాజెక్ట్ మరొకటి ఉండదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.