iDreamPost
android-app
ios-app

అప్పుడే మరో కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రజిని

  • Published Aug 12, 2025 | 11:47 AM Updated Updated Aug 12, 2025 | 11:47 AM

మిగిలిన హీరోల సంగతి ఏమో కానీ.. రజిని సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాయి. అసలు ఈ ఏజ్ లో కూడా ఇంత ఎనర్జిటిక్ గా సినిమాలు చేయడం కేవలం రజినికే సాధ్యం ఏమో అని అనిపిస్తుంది. సరిగ్గా ఇంకో రెండు వారాల్లో రజినీకాంత్ కూలీ సినిమా రిలీజ్ కాబోతుంది.

మిగిలిన హీరోల సంగతి ఏమో కానీ.. రజిని సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాయి. అసలు ఈ ఏజ్ లో కూడా ఇంత ఎనర్జిటిక్ గా సినిమాలు చేయడం కేవలం రజినికే సాధ్యం ఏమో అని అనిపిస్తుంది. సరిగ్గా ఇంకో రెండు వారాల్లో రజినీకాంత్ కూలీ సినిమా రిలీజ్ కాబోతుంది.

  • Published Aug 12, 2025 | 11:47 AMUpdated Aug 12, 2025 | 11:47 AM
అప్పుడే మరో కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రజిని

మిగిలిన హీరోల సంగతి ఏమో కానీ.. రజిని సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాయి. అసలు ఈ ఏజ్ లో కూడా ఇంత ఎనర్జిటిక్ గా సినిమాలు చేయడం కేవలం రజినికే సాధ్యం ఏమో అని అనిపిస్తుంది. సరిగ్గా ఇంకో రెండు వారాల్లో రజినీకాంత్ కూలీ సినిమా రిలీజ్ కాబోతుంది. అసలు ఈ సినిమా హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన ఒక్కో అప్డేట్ విధ్వంసం సృష్టించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రజిని కూడా చాలా ఎనర్జీటిక్ గా ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు.

సో మరో రెండు రోజుల్లో కూలీ రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఇలా కూలీ ప్రమోషన్స్ చేస్తూనే మరో వైపు ఇంకొక కొత్త సినిమాను సెట్ చేసుకునే ప్లాన్ లో ఉన్నారు రజిని. ఇంకో వైపు జైలర్ 2 షూటింగ్ జరుగుతూనే ఉంది. దానితో పాటే రీసెంట్ గా రజిని మరో కొత్త కథను విన్నారట. డైరెక్టర్ ఎం. శశి కుమార్ రజినికి కథ చెప్పారట. ఆ కథకు రజిని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. సో జైలర్ 2 తర్వాత అన్ని బావుంటే రజిని చేసే సినిమా శశి కుమార్ దే అవ్వొచ్చు. శశికుమార్ ఈ మధ్య టూరిస్ట్ ఫ్యామిలీ అనే సినిమాలో మెయిన్ లీడ్ గా చేసిన సంగతి తెలిసిందే. ఆయన నటుడిగా చేస్తూనే అప్పుడప్పుడు ఇలా సినిమాలను కూడా డైరెక్ట్ చేస్తూ ఉంటాడు.

రజిని కోసం ఓ సినిమా డైరెక్ట్ చేయాలన్నది ఆయన కల అట. అందుకోసమే ఆయన పనులన్నీ మానుకుని ఇప్పుడు రజిని కోసం కథను చేశారట. టూరిస్ట్ ఫ్యామిలీ తర్వాత ఆయనకు వచ్చిన అవకాశాలను కూడా దీనికోసం వదులుకున్నారట శశికుమార్. రజిని కోసం చాలానే కథలు లైన్ లో ఉన్నాయట. అన్ని బావుంటే జైలర్ తర్వాత ముందు తీసేది శశికుమార్ తోనే అవ్వొచ్చు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.