iDreamPost
android-app
ios-app

Rajinikanth: రజినీపై డైరెక్టర్ ఆరోపణలు.. సెకండాఫ్ మొత్తం మార్చేశారంటూ..

  • Published Oct 07, 2024 | 5:29 PM Updated Updated Oct 07, 2024 | 5:29 PM

Director Sensational Comments On Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ పై స్టార్ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. రజినీ వల్లే తాను చేసిన చిత్రం ఘోరంగా విఫలమైంది అంటూ ఆరోపించారు. కథలో వేలు పెట్టడమే కాకుండా.. క్లయిమ్యాక్స్ కూడా మార్చేశారు అంటూ విమర్శించారు.

Director Sensational Comments On Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ పై స్టార్ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. రజినీ వల్లే తాను చేసిన చిత్రం ఘోరంగా విఫలమైంది అంటూ ఆరోపించారు. కథలో వేలు పెట్టడమే కాకుండా.. క్లయిమ్యాక్స్ కూడా మార్చేశారు అంటూ విమర్శించారు.

  • Published Oct 07, 2024 | 5:29 PMUpdated Oct 07, 2024 | 5:29 PM
Rajinikanth: రజినీపై డైరెక్టర్ ఆరోపణలు.. సెకండాఫ్ మొత్తం మార్చేశారంటూ..

సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ పేరు వినగానే సినిమా ప్రేక్షకుల్లో తెలియని ఉత్సాహం వస్తుంది. 73 సంవత్సరాల వయసులో కూడా యాక్షన్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. రజినీకాంత్ మూవీ వస్తోంది అంటే కొన్ని స్టేట్స్ ఆఫీసులకు సెలవులు కూడా ఇచ్చేస్తుంటాయి. ఇంక ప్యాన్ ఇండియా లెవల్లో రజినీ మూవీస్ కి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్నేళ్ల తన కెరీర్ లో ఎప్పుడూ రజినీకాంత్ పై విమర్శలు వచ్చింది లేదు. రజినీతో వర్క్ చేసిన ఏ డైరెక్టర్ కూడా ఆయనపై ఆరోపణలు చేసింది లేదు. కానీ, ఇప్పుడు ఒక డైరెక్టర్ సూపర్ స్టార్ పై పెదవి విరుస్తున్నాడు. తాను చేసిన చిత్రం దారుణంగా విఫలమవ్వడానికి రజినీకాంతే కారుణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. రజినీకాంత్ కథలో వేలు పెట్టబట్టే తమ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది అంటూ విమర్శలు కురింపించాడు. మరి.. ఆ డైరెక్టర్ ఎవరు? అసలు అంత డిజాస్టర్ గా మారిన చిత్రం ఏది? ఇప్పుడు ఎందుకు ఆ చిత్రం గురించి చర్చ జరుగుతోందో తెలుసుకుందాం….

రజినీకాంత్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అక్టోబర్ 10న ఆయన నటించిన వేట్టయన్ చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే ఆ మూవీ నుంచి రిలీజైన పాటలు, ట్రైలర్ అన్నింటికి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇలాంటి తరుణంలో ఒక డైరెక్టర్ రజినీకాంత్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రజినీకాంత్ హీరోగా ఆయన చేసిన చిత్రిం తలైవా వల్లే విఫలమైంది అంటున్నాడు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. కేఎస్ రవికుమార్. అవును.. కేఎస్ రవికుమారే ఇప్పుడు రజినీకాంత్ పై ఆరోపణలు చేస్తోంది. రజినీతో కలిసి ముత్తు, నరసింహా వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన రికార్డు ఈయనకు ఉంది. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు రజినీకాంత్ గురించి ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది.

ముత్తు, నరసింహ తర్వాత కేఎస్ రవికుమార్- రజినీ కాంబోలో వచ్చిన చిత్రం ‘లింగ’. ఈ మూవీ అదిరిపోయే కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించింది. కానీ, కథ పరంగా మాత్రం విఫలమైంది. అలా జరగడానికి కారణం రజినీకాంత్ అంటూ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ ఆరోపిస్తున్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సెకండాఫ్ మొత్తాన్ని రజినీ మార్చేశారని చెబుతున్నారు. అనుష్కతో ఒక పాట, క్లైమ్యాక్స్ ట్విస్టును రజినీ మార్చేశారని చెబుతున్నారు. క్లయిమ్యాక్స్ లో కృత్రిమంగా, అసహజంగా ఉన్న బెలూన్ సీన్ ని రజినీకాంత్ చెప్పిందంటున్నారు. అంతేకాకుండా.. రజినీకాంత్ సరైన వీఎవ్ఎక్స్ చేయించే సమయం కూడా ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఎడిటింగ్ విషయంలో కూడా జోక్యం చేసుకున్నారని తెలిపారు.

క్లయిమ్యాక్స్ లో ఉండే ట్విస్టును తొలగించారు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇన్నేళ్ల రజినీకాంత్ కెరీర్లో ఇలాంటి ఆరోపణలు ఎప్పుడూ వచ్చింది లేదు. కానీ, కేఎస్ రవికుమార్ మాత్రం లింగ విఫలమవ్వడానికి రజినీనే కారణం అంటూ చెప్పేస్తున్నారు. అప్పట్లో సినిమా విడుదల తర్వాత ప్రెస్ మీట్ లో లింగ ఫలితం గురించి డైరెక్టర్ స్పందించారు. వాళ్ల మూవీ వరల్డ్ వైడ్ గా 150 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని వెల్లడించారు. అది అంత చిన్న విషయం కాదు అని గొప్పగా చెప్పారు. ఇప్పుడు మాత్రం లింగ విఫలమవ్వడానికి రజినీనే కారణం అంటూ విమర్శలు చేస్తున్నారు. మరి.. రజినీని కేఎస్ రవికమార్ విమర్శించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomfixbetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet