Swetha
కూలీ సినిమా వరుస అప్డేట్స్ తో ప్రేక్షకులను రోజు రోజుకి ఊరిస్తూ పోతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని అప్డేట్స్ ఓ రేంజ్ లో సినిమా మీద అంచనాలను పెంచేశాయి. అలా రీసెంట్ గా సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయినా సంగతి తెలిసిందే.
కూలీ సినిమా వరుస అప్డేట్స్ తో ప్రేక్షకులను రోజు రోజుకి ఊరిస్తూ పోతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని అప్డేట్స్ ఓ రేంజ్ లో సినిమా మీద అంచనాలను పెంచేశాయి. అలా రీసెంట్ గా సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయినా సంగతి తెలిసిందే.
Swetha
కూలీ సినిమా వరుస అప్డేట్స్ తో ప్రేక్షకులను రోజు రోజుకి ఊరిస్తూ పోతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని అప్డేట్స్ ఓ రేంజ్ లో సినిమా మీద అంచనాలను పెంచేశాయి. అలా రీసెంట్ గా సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. ట్రైలర్ కట్ లో సినిమా కథ గురించి చెప్పకపోయినా.. క్యారెక్టర్స్ ను మాత్రం పరిచయం చేసేశాడు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు అంతా వెయిట్ చేసేది నాగార్జున విలన్ రోల్ లో ఎలా ఉంటాడా అని. అందరు ఊహించినట్టుగానే నాగార్జున రోల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ట్రైలర్ తో కలిగించాడు లోకేష్.
అయితే రీసెంట్ గా కూలి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా.. నాగార్జున గురించి రజిని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇందులో ఉపేంద్ర , నాగార్జున , సత్య రాజ్ లాంటి స్టార్స్ నటించడం చాలా గొప్ప విషయంగా భావించినట్లు చెప్పుకొచ్చారు. వీరు కాకుండా శ్రుతిహాసన్ , సౌబిన్ , ఆమిర్‌ఖాన్ స్పెషల్ అప్పీరెన్స్ ఉంటుందని చెప్తూ సినిమా మీద హైప్ పెంచేశారు. ఇక ముఖ్యంగా విలన్ పాత్ర అయినా సైమన్ పాత్రలో నాగార్జున నటించారు. ఆ విషయం గురించి “ముఖ్యంగా నాగార్జున ఇందులో విలన్‌గా చేస్తున్నారు. అసలు ‘కూలీ’ సబ్జెక్ట్ విన్న వింటనే సైమన్ పాత్ర నేనే చేయాలన్న ఆసక్తి కలిగింది. ఆ పాత్ర ఎవరు చేస్తారా? అని ఎదురుచూశా. ఎందుకంటే చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఆర్నెళ్ల పాటు వెతికాం’’
ఈ పాత్ర గురించి ఒక నటుడితో ఆరుసార్లు సిటింగ్ అయింది. అయినా ఓకే అవలేదు’ అని లోకేశ్ నాతో అన్నారు. ‘ఎవరు ఆయన’ అని నేను అడిగా. నాగార్జున పేరు చెప్పగానే ఆశ్చర్యపోయా. ఆ తర్వాత ఆయన ఒప్పుకొన్నారని తెలిసి సంతోషంగా అనిపించింది. ఎందుకంటే, డబ్బు కోసం సినిమాలు చేసే వ్యక్తి కాదు. ఆయనకు ఆ అవసరం లేదు. ఎప్పుడూ మంచివాడిగానే చేయాలా? అని ఆయన సైమన్ పాత్రకు ఒప్పుకొని ఉంటారు. మేమిద్దరం 33 ఏళ్ల కిందట ఒక సినిమా చేశాం. అప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పుడూ అలాగే ఉన్నారు. నాకు జుట్టు కూడా ఊడిపోయింది.
నాగార్జునతో పని చేస్తుండగా ‘మీ ఆరోగ్య రహస్యం ఏంటి’ అని అడిగాను. ‘ఏమీ లేదు సర్.. వ్యాయామం, ఈత, కొద్దిగా డైట్. సాయంత్రం 6 గంటలకు డిన్నర్ అయిపోతుంది. మా తండ్రి నుంచి వచ్చిన జీన్స్ కూడా ఒక కారణం. దాంతో పాటు, నా తండ్రి నాకో సలహా ఇచ్చారు. ‘బయట విషయాలు తలలోకి ఎక్కించుకోవద్ద’ని చెప్పారు’ అని నాగార్జున నాతో చెప్పారు. 17 రోజుల షెడ్యూల్ కోసం ఇద్దరం థాయ్‌లాండ్ వెళ్లాం. అది నా జీవితంలో మర్చిపోను. సైమన్ పాత్రలో ఆయన నటన చూస్తుంటే, నాకే ఆశ్చర్యమేసింది. బాషా-ఆంటోనీ ఎలాగో.. కూలీ-సైమన్ అలా ఉంటుంది.” అంటూ చెప్పుకొచ్చారు.