iDreamPost
android-app
ios-app

Arvind Swamy: రజినీకే పోటీ.. అరవింద్ స్వామీ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మైండ్ పోవాల్సిందే!

  • Published Nov 13, 2024 | 3:55 PM Updated Updated Nov 13, 2024 | 3:55 PM

Arvind Swamy: 90's లవర్ బాయ్ గా అరవింద్ స్వామి దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తరువాత చాలా కాలం పాటు సినిమాలకు దూరం అయ్యారు.

Arvind Swamy: 90's లవర్ బాయ్ గా అరవింద్ స్వామి దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తరువాత చాలా కాలం పాటు సినిమాలకు దూరం అయ్యారు.

Arvind Swamy: రజినీకే పోటీ.. అరవింద్ స్వామీ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మైండ్ పోవాల్సిందే!

సినిమా ఇండస్ట్రీలో అందం, యాక్టింగ్‌తో అమ్మాయిల హార్ట్ త్రోబ్ గా నిలిచిన అతికొద్ది మంది హీరోల్లో అరవింద్ స్వామి ఒకరు. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి తరువాత సినిమా హీరో అయ్యారు. 90’s లో లవర్ బాయ్ ఇమేజ్ తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొన్నారు. ఆయన నటించిన రోజా సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. దీంతో ఆయనకు తిరుగులేదని అనుకొన్నారు. సూపర్ స్టార్ రజినీకి గట్టి పోటీగా నిలవడం పక్కా అనుకున్నారు అంతా. అలా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే సినిమాలు చేయడం మానేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 ఏళ్లపాటు సినిమా ఇండస్ట్రికి దూరమయ్యారు. ఆ తరువాత తని ఒరువన్, దృవ సినిమాలతో లైట్ లోకి వచ్చారు. ఇటీవల సత్యం సుందరం మూవీతో ఓ రేంజిలో ట్రెండ్ అవుతున్నారు. ఈ సినిమాతో మరోసారి అభిమానుల గుండెల్లో ఒదిగిపోయారు. అయితే ఇంత అందగాడు, పైగా ఇంత యాక్టింగ్ స్కిల్ ఉన్నోడి కెరీర్‌కు ఇంత లాంగ్ గ్యాప్ రావడానికి కారణం ఏమిటి? అసలు ఈ గ్యాప్ లో ఆయన ఏం చేశాడు? అసలు ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ముందుగా అరవింద్ స్వామి బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. ఆయన తండ్రి VD స్వామి ఓ బిజినెస్ మ్యాన్. తల్లి వసంత భరత నాట్యం డాన్సర్. అరవింద్ స్వామి ఫస్ట్ డాక్టర్ కావాలనుకొన్నారు. అయితే చదువుకొనే రోజుల్లో యాడ్స్‌లో యాక్ట్ చేసే వారు. అలా ఓ రోజు యాడ్ చేస్తున్న టైమ్ లో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కంట్లో పడ్డారు. సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ద్వారా మణిరత్నంను కలిశాడు. దాంతో దళపతి మూవీలో ఫస్ట్ టైమ్ యాక్టర్ గా గెస్ట్ రోల్ చేశారు. ఇక ఆ తర్వాత మణిరత్నం తీసిన రోజా మూవీతో హీరోగా అదరగొట్టాడు. దేశవ్యాప్తంగా పాపులారిటిని సంపాదించుకొన్నారు. అమ్మాయిలకు కలల రాజుగా మారిపోయాడు. ఆ తరువాత భారీ ఆఫర్లు వచ్చాయి. అయినా కూడా జాగ్రత్తగా రోల్స్ సెలెక్ట్ చేసుకునేవాడు. హిందీలో కూడా ఆఫర్లు వచ్చేవి. ఇక 10 సంవత్సరాల కాలంలో తమిళ్,హిందీలో కలిపి కేవలం 15 సినిమాల్లోనే నటించారు. అయినా కూడా ఆయన క్రేజ్, డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. ఒక టైంలో రజనీకాంత్‌కు పోటీ అనే ఫీలింగ్ ని కల్పించాడు ఈ హాండ్సమ్ హీరో. అలా 90’s లో ఓ ఊపు ఊపిన అరవింద్ స్వామి 2000 సంవత్సరం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయ్యారు. తన కుటుంబ వారసత్వంగా వచ్చిన వీడీ స్వామి అండ్ కంపెనీ బాధ్యతలు తీసుకున్నారు. ఇంటర్నేషనల్ ట్రేడ్‌లో ప్రవేశించారు. ఇంటర్‌ప్రో గ్లోబల్ సీఈవీ, ప్రో లీస్ ఎండీ, చైర్మన్‌గా చేశారు. అలా తన బిజినెస్ ని బాగా బిల్డ్ చేసుకొని దాదాపు 3300 కోట్లు సంపాదించారు.

మళ్ళీ సినిమాలపై ఆసక్తితో 2006 వ సంవత్సరంలో శాసనం అనే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత మళ్లీ బ్రేక్ తీసుకొని కాదల్ చిత్రం ద్వారా 2013 నుంచి వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన విలన్ గా నటించిన తని ఒరువన్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక తెలుగులో కూడా దృవగా రీమేక్ అయ్యి హిట్ కొట్టింది. అప్పటి నుంచి ఆయనకు ఆఫర్లు వెల్లువెత్తాయి.భోగన్, చెక్క చివాంత వానమ్, కస్టడీ లాంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు ఇంకా చేరవయ్యారు. ఇటీవల ఆయన నటించిన సత్యం సుందరం సినిమాతో ఆకట్టుకోవడమే కాకుండా కంటతడి పెట్టించేలా నటించారు. ప్రస్తుతం ఈ సినిమా సోషల్ మీడియాని తెగ ఊపేస్తుంది. ప్రస్తుతం అరవింద్ స్వామి గాంధీ టాక్స్ అనే సినిమాలో నటిస్తున్నారు. అరవింద్ స్వామి ప్రస్తుతం ఒక్కో సినిమాకి దాదాపు 10 కోట్ల దాకా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. ఇదీ సంగతి. మరి అరవింద్ స్వామి గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.