భారీ అంచనాలతో బాలీవుడ్ నుంచి రాబోతున్న ప్యాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర. హిందీతో పాటు తెలుగు తమిళ మలయాళం కన్నడ ఇలా ఇతర భాషల్లోనూ భారీ ఎత్తున సెప్టెంబర్ 9న విడుదల చేయబోతున్నారు. ఇటీవలే నిజ జీవితంలో భార్యాభర్తలైన రన్బీర్ కపూర్, అలియా భట్ లు హీరో హీరోయిన్లు కావడం దీనికి ప్రధాన ఆకర్షణ. అమితాబ్ బచ్చన్ తో పాటు అక్కినేని నాగార్జున ఇందులో కీలక పాత్రలు పోషించారు. తెలుగు వెర్షన్ కి ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవితో […]
స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీస్ లో తండ్రి కొడుకులు కలిసి నటించడం పెద్ద విశేషం కాదనుకుంటాం కానీ ఇక్కడా అంచనాల బరువును మోయాల్సి ఉంటుంది. ఈ కారణంగానే చిరంజీవి, రామ్ చరణ్ లు కలిసి ఫుల్ లెన్త్ రోల్ చేయడానికి పదిహేనేళ్ళు పట్టింది. ఎన్టీఆర్ బాలయ్యలకు ఈ ఇబ్బంది రాలేదు. కారణం బాలకృష్ణ కెరీర్ ప్రారంభంలోనే నాన్నతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు కాబట్టి. స్టార్ ఇమేజ్ వచ్చాక బ్రహ్మర్షి విశ్వామిత్రలో కలిసి నటిస్తే వర్కౌట్ […]
రెండు పెద్ద సినిమా కుటుంబాల హీరోలు కలిసి నటించడం టాలీవుడ్ లో అరుదు. అందుకే ఆర్ఆర్ఆర్ మీద జనంలో అంత ఆసక్తి. రాజమౌళి తీస్తున్న గ్రాండియర్ అనే దానికన్నా అసలు చూడగలమాని ఆలోచించిన కొణిదెల నందమూరి కాంబినేషన్ సాధ్యమయ్యింది కాబట్టే అభిమానుల్లో అంత చర్చ జరిగింది. ఒకప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లు తమకు ఎంత కోట్లాది ఫాలోయింగ్ ఉన్నా ఎన్ని అంచనాలు మోస్తున్నా బ్లాక్ అండ్ వైట్ నుండి కలర్ జమానా దాకా 14 సినిమాల్లో కలిసి […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డిస్నీ హాట్ స్టార్ ఓటిటికి అఫీషియల్ బ్రాండ్ అంబాసడర్ గా ఫిక్సవ్వడం ఆలస్యం అప్పుడే ఓ రేంజ్ లో వాడకం మొదలుపెట్టారు. ఇప్పటికే దాని తాలూకు యాడ్ టీవీలో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుండగా నిన్న బిగ్ బాస్ 5 హౌస్ లోకి తీసుకొచ్చి ఈవెంట్ ని కలర్ ఫుల్ గా మార్చేశారు. దీనికి సంబంధించి ముందు నుంచే పబ్లిసిటీ చేయడంతో అభిమానులతో పాటు రెగ్యులర్ ఆడియన్స్ కు సైతం […]
స్టార్ హీరోలకు మాస్ లో ఒక పట్టు దొరకాలంటే కెరీర్ లో మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ ఎంటర్ టైనర్స్ చాలా అవసరం. ఇవి క్లాసు మాస్ తేడా లేకుండా అందరినీ దగ్గర చేస్తాయి.చిరంజీవికి మొదటి బ్రేక్ ‘ఖైదీ’ దాదాపుగా పల్లెటూరిలో సాగే కథే. బాలకృష్ణకు తిరుగులేని ఇమేజ్ తీసుకొచ్చిన ‘మంగమ్మ గారి మనవడు’లో అసలు నగరం ఊసే ఉండదు. వెంకటేష్ ‘చంటి’ గురించి చెప్పేదేముంది. నాగార్జున సైతం మొదట్లో ‘జానకి రాముడు’ లాంటివి చేసినప్పటికీ ఈ […]
నలుగురు సీనియర్ మోస్ట్ స్టార్ హీరోల్లో ఒకరైన అక్కినేని నాగార్జున గట్టిగా చెప్పుకునే హిట్టు కొట్టి అయిదేళ్ళు దాటింది. సోగ్గాడే చిన్ని నాయన బ్లాక్ బస్టర్ కాగా ఊపిరి డీసెంట్ గా బయట పడింది. దాని తర్వాత నిర్మలా కాన్వెంట్, ఓం నమో వెంకటేశాయ, రాజు గారి గది 2, ఆఫీసర్, దేవదాస్, మన్మథుడు 2, వైల్డ్ డాగ్ ఇలా ఒకదాన్ని మించి మరొకటి బాక్సాఫీస్ వద్ద టపా కట్టేశాయి. కొన్ని మరీ దారుణంగా మిడిల్ రేంజ్ […]
ఇతర భాషల నుంచి వ్యాపార పరంగా ఎలాంటి మంచి విషయాలు చూసినా వెంటనే వాటిని అడాప్ట్ చేసుకోవడం తెలుగు దర్శక నిర్మాతల శైలి. కానీ బిగ్ బాస్ షో విషయంలో మాత్రం ఎండిమోల్ అనే సంస్థ రంగంలోకి దిగి హిందీ బిగ్ బాస్ పోలి ఉన్నట్లుగానే తెలుగు బిగ్ బాస్ షో ని కూడా రూపకల్పన చేసింది . ఇప్పటికే విజయవంతంగా నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఐదవ సీజన్ కూడా నిన్న అట్టహాసంగా […]
భారీ అంచనాల మధ్య అట్టహాసంగా నిన్న సాయంత్రం బిగ్ బాస్ 5 ఈవెంట్ గ్రాండ్ లాంచ్ జరిగింది. నాలుగున్నర గంటల పాటు జరిగిన ఈ ఎపిసోడ్ కొన్ని ముందు వచ్చిన లీకులను నిజం చేయడంతో పాటు ఊహించని ట్విస్టులు కూడా ఇచ్చింది. గత సీజన్లకు వచ్చిన కామెంట్లు దృష్టిలో పెట్టుకున్నారు కాబోలు ఈసారి బోరింగ్ ఉండదని ముందే హామీ ఇచ్చేశారు. నాగార్జున ఎంట్రీ చాలా లావిష్ గా జరిగింది. బిగ్ బాస్ గొంతు చేసిన విన్నపం మేరకు […]
ఇవాళ బిగ్ బాస్ సీజన్ 5 మొదలుకాబోతోంది. ఈసారి స్టార్ మా గట్టిగానే ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది కానీ అసలు గేమ్ స్టార్ట్ అయితే తప్ప ఇది ఏ స్థాయిలో ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయో చెప్పలేని పరిస్థితి. హిందీతో పోలిస్తే మన దగ్గర ఈ ఆటకు వస్తున్న స్పందన తక్కువే. అక్కడ సల్మాన్ ఖాన్ ఒంటిచేత్తో 13 సీజన్లు నెట్టుకొచ్చి ఇప్పటికీ రేటింగ్ తగ్గకుండా చూసుకుంటున్నాడు. కానీ మనదగ్గర మాత్రం ఆల్రెడీ ముగ్గురు హోస్టులు మారారు. జూనియర్ […]
మాములుగా కమర్షియల్ సినిమాల్లో హీరో ఊరికే విలన్ మీద తిరగబడడు. తనకో కుటుంబానికో లేక సమాజంలో ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడో అతనిలోని కథానాయకుడు బయటికి వచ్చి దుర్మార్గుల అంతం చూస్తాడు. ఇది ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న ఫార్ములానే. ముఖ్యంగా అడవిరాముడు టైం నుంచి వీటి తాకిడి ఎక్కువయ్యింది. దాదాపు అందరు హీరోలకు ఈ సూత్రం సంజీవినిలా పని చేసి వాళ్ళను మాస్ కు మరింత దగ్గర చేసింది. నాగార్జునకు అలా ఉపయోగపడిన సినిమా విక్కీ దాదా. […]