iDreamPost
android-app
ios-app

Puri Jagannath: అక్కినేని హీరోలతో డాషింగ్ డైరెక్టర్ మూవీ.. అసలు విషయం ఏమిటంటే?

  • Published Oct 17, 2024 | 2:38 PM Updated Updated Oct 17, 2024 | 2:38 PM

Puri Jagannath: డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ప్రస్తుతం స్ట్రాంగ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో అక్కినేని కాంపౌండ్ నుంచి ఆయనకి ఆఫర్ వచ్చింది.

Puri Jagannath: డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ప్రస్తుతం స్ట్రాంగ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో అక్కినేని కాంపౌండ్ నుంచి ఆయనకి ఆఫర్ వచ్చింది.

Puri Jagannath: అక్కినేని హీరోలతో డాషింగ్ డైరెక్టర్ మూవీ.. అసలు విషయం ఏమిటంటే?

 

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు పూరీ జగన్నాథ్. చాలా తక్కువ టైమ్ లోనే టాప్ డైరెక్టర్లలో ఒకడిగా నిలిచారు. తన సినిమాలతో యూత్ కి ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ గా మారిపోయారు. టాలీవుడ్ లో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. పూరీ జగన్నాథ్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇప్పటికీ ఆయన సినిమాలంటే చాలు పడి చచ్చేవారు చాలామంది ఉన్నారు. స్టార్ హీరోతో సమానంగా ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లతో రికార్డులు సృష్టించారు పూరీ జగన్నాథ్. కానీ ఏమైందో ఏమో గాని గత కొంత కాలం నుంచి తన మార్క్ హిట్ ని ఇవ్వలేకపోతున్నారు. ఆయనకు వరసగా ఫ్లాప్ లు ఎదురవడంతో ఆయన అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు.

గత పది సంవత్సరాల నుంచి డజన్ సినిమాలు చేశారు. కానీ అందులో హిట్లు కంటే ఫ్లాపులే ఎక్కువగా ఉన్నాయి. మధ్యలో టెంపర్, ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలతో తన మార్క్ చూపించినా ఆ తరువాత ఆ స్థాయిలో హిట్లు కొట్టలేకపోయారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న లైగర్ సినిమా డిజాస్టర్ అయింది. మళ్ళీ ఈ ఏడాది డబుల్ ఇస్మార్ట్ తో వచ్చారు. ఈ సినిమా కూడా నిరాశపరించింది. ఇన్ని ఫ్లాపులు ఉన్నా కానీ పూరీ జగన్నాథ్ కి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. ఇప్పటికీ ఫ్యాన్స్ ఆయన స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని బలంగా నమ్ముతున్నారు. పోకిరి, గోలీమార్, బిజినెస్ మ్యాన్, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలు ఆయనకి స్ట్రాంగ్ క్యామ్ బ్యాక్ హిట్లే. ఆ రేంజిలో పూరీ జగన్నాథ్ కం బ్యాక్ హిట్ ఇస్తారని ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమాకు సిద్ధమవుతున్నారు పూరి జగన్నాథ్. తన నెక్స్ట్ సినిమా కోసం హీరోని వెతికే పనిలో పడ్డ ఆయనకి తాజాగా అక్కినేని కాంపౌండ్ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తుంది.

అక్కినేని హీరోలు కూడా ప్రస్తుతం తమ రేంజికి తగ్గ హిట్లని అందుకోలేకపోతున్నారు. నాగార్జున నా సామీరంగాతో సంక్రాంతికి మంచి హిట్ అందుకున్నారు. కానీ నాగ చైతన్య, అఖిల్ మాత్రం వరుస పరాజయలు ఎదురుకుంటున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ లాగానే స్ట్రాంగ్ కం బ్యాక్ బ్లాక్ బస్టర్ కొట్టడానికి ఆకలి మీద ఉన్న పులీలా ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో పూరీ జగన్నాథ్ తో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ వీరి ముగ్గురిలో ఎవరికైనా కానీ సెట్ అయ్యే కథ రాస్తే ఆ సినిమా చేయడానికి వారు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. పూరీ జగన్నాథ్ అక్కినేని కాంపౌండ్ కోసం రికార్డులు బద్ధలయ్యే స్టోరీ రాసేందుకు రెఢీ అవుతున్నట్లు తెలుస్తుంది. వారి కోసం మంచి కథ రాసేందుకు పూరీ వారితో టచ్ లో ఉండబోతున్నట్లు టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ నుంచి తెలుస్తుంది. ఈ విషయం తెలియగానే అక్కినేని ఫ్యాన్స్ చాలా సంతోషిస్తున్నారు. సినిమా సెట్ అయ్యి రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంటే రికార్డులు బద్ధలవడం ఖాయం అని కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ కాంబో నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో.. ఇక పూరీ జగన్నాథ్, అక్కినేని కాంపౌండ్ కాంబినేషన్ గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş