iDreamPost
android-app
ios-app

మనీ , మైండ్ , మాస్టర్ ప్లాన్.. ‘కుభేర’ గేమ్ బిగిన్స్

  • Published Jun 16, 2025 | 9:00 AM Updated Updated Jun 16, 2025 | 9:56 AM

Kubera Trailer : జూన్ 20 ఈ తేదీ కోసం ఇప్పటివరకు ఎంతమంది వెయిట్ చేసారో తెలీదు కానీ.. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దాని అంతటికి కారణం రీసెంట్ గా రిలీజ్ అయినా కుభేర ట్రైలర్. ట్రైలర్ చూస్తూనే ఒక్కొక్కరికి ఎన్నో ప్రశ్నలు పుట్టుకొచ్చేస్తున్నాయి. మరి వాటి అన్నిటికి సమాధానం దొరికేది జూన్ 20 న థియేటర్స్ లో మాత్రమే.

Kubera Trailer : జూన్ 20 ఈ తేదీ కోసం ఇప్పటివరకు ఎంతమంది వెయిట్ చేసారో తెలీదు కానీ.. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దాని అంతటికి కారణం రీసెంట్ గా రిలీజ్ అయినా కుభేర ట్రైలర్. ట్రైలర్ చూస్తూనే ఒక్కొక్కరికి ఎన్నో ప్రశ్నలు పుట్టుకొచ్చేస్తున్నాయి. మరి వాటి అన్నిటికి సమాధానం దొరికేది జూన్ 20 న థియేటర్స్ లో మాత్రమే.

  • Published Jun 16, 2025 | 9:00 AMUpdated Jun 16, 2025 | 9:56 AM
మనీ , మైండ్ , మాస్టర్ ప్లాన్.. ‘కుభేర’ గేమ్ బిగిన్స్

జూన్ 20 ఈ తేదీ కోసం ఇప్పటివరకు ఎంతమంది వెయిట్ చేసారో తెలీదు కానీ.. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దాని అంతటికి కారణం రీసెంట్ గా రిలీజ్ అయినా కుభేర ట్రైలర్. ట్రైలర్ చూస్తూనే ఒక్కొక్కరికి ఎన్నో ప్రశ్నలు పుట్టుకొచ్చేస్తున్నాయి. మరి వాటి అన్నిటికి సమాధానం దొరికేది జూన్ 20 న థియేటర్స్ లో మాత్రమే. కుభేర ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి ఈసారి డబ్బే కథనా ?  మెదడే ఆయుధామా ? కుభేర మాస్టర్ మైండ్ గేమ్ ప్లాన్ ఏంటి ? ఇలా ఎన్నో ప్రశ్నలు… ట్విస్ట్ లు , సందేహాలు తలెత్తాయి.

పైగా శేఖర్ కమ్ముల, నాగార్జున , ధనుష్ , రష్మిక ఈ కాంబినేషన్ లో రానున్న కథ ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ మరోవైపు. అలాగే బిజినెస్ పరంగా కూడా ఈ సినిమా మంచి హైప్ తెచ్చుకుంది. రావడానికి కాస్త ఆలస్యం అయినా కూడా క్వాలిటీ , కంటెంట్ విషయంలో ఏ మాత్రం రాజి పడకుండా శేఖర్ కమ్ముల దీనిని రూపొందించారు. ట్రైలర్ లో కూడా స్టోరీ ఎక్కువగా దాచకుండా చెప్పకనే చెప్పేశారు. గవర్నమెంట్ ఆఫీసర్ పదవిలో ఉన్న నాగార్జున తన లక్ష్యం కోసం.. బిచ్చగాడైన ధనుష్ ను చేరదీయడం , అతని కారణంగా నాగార్జున వందల కోట్ల రిస్క్ లో పడడం.. ఈ కారణంగా వీరిద్దరి మధ్య యుద్ధం మొదలుకావడం.. ఇలా కథ కొనసాగుతూ ఉంటుంది. అసలు దాని వెనుక కారణం ఏంటి ? ఈ యుద్ధంలో గెలిచేది ఎవరు ? గెలిపించేది ఎవరు ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

శేఖర్ కమ్ముల నుంచి ఈ రేంజ్ మిక్సెడ్ డ్రామా ఎవరు ఊహించి ఉండరు. శేఖర్ కమ్ముల అంటే అందరికి తెలిసింది ఓ సాఫ్ట్ డైరెక్టర్.. లవ్ , ఎమోషనల్ డ్రామాస్ మాత్రమే తీస్తారని. కానీ ఈసారి శేఖర్ కూడా వెర్షన్ మార్చారు. మనీ క్రైమ్ తో ఉండే సీరియస్ నేరేషన్ తో వస్తున్నాడు. పైగా ప్రతి పాత్రకు ప్రాధాన్యత దక్కేలా రూపొందించారు. సో ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు మూవీ పక్కా పైసా వసూల్ అనే అనుకుంటున్నారు. నిజంగా మూవీ ఇదే రేంజ్ లో ఎంగేజింగ్ గా ఉంటే కనీసం ఈ మూవీతో అయినా బాక్స్ ఆఫీస్ ఊపందుకుంటుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobetjojobet girişJojobet Casino Sitesicasibomjojobetmarsbahismarsbahis güncel girişjojobet giriş adresi