iDreamPost
android-app
ios-app

కింగ్ నాగ్ కల్ట్ క్లాసిక్ ‘శివ’ రీరిలీజ్ డేట్ ఫిక్స్

  • Published Sep 20, 2025 | 11:27 AM Updated Updated Sep 20, 2025 | 11:28 AM

Nagarjuna Shiva Re Release Date: రామ్ గోపాల్ వర్మ , నాగార్జున కాంబినేషన్ లో 1989లో వచ్చిన సినిమా శివ. అప్పట్లో ఇండస్ట్రీని ఒక ఊపిన సినిమా ఇది. అలాగే నాగార్జున కెరీర్ లో ఎవర్ గ్రీన్ మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోయింది. అప్పటివరకు ఓ ఫ్లో లో వెళ్తున్న ఇండస్ట్రీని సరికొత్త విధంగా ఆలోచించేలా చేసింది. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సంధర్బంగా.. నాగార్జున శివ రీరిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసారు.

  • Published Sep 20, 2025 | 11:27 AMUpdated Sep 20, 2025 | 11:28 AM
కింగ్ నాగ్ కల్ట్ క్లాసిక్ ‘శివ’ రీరిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ గోపాల్ వర్మ , నాగార్జున కాంబినేషన్ లో 1989లో వచ్చిన సినిమా శివ. అప్పట్లో ఇండస్ట్రీని ఒక ఊపిన సినిమా ఇది. అలాగే నాగార్జున కెరీర్ లో ఎవర్ గ్రీన్ మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోయింది. అప్పటివరకు ఓ ఫ్లో లో వెళ్తున్న ఇండస్ట్రీని సరికొత్త విధంగా ఆలోచించేలా చేసింది. దర్శకులు సినిమా తీసే విధానాన్ని, ప్రేక్షకులు సినిమా చూసే విధానాన్ని కంప్లీట్ గా మార్చేసింది. ఇక ఆ సైకిల్ చైన్ ట్రెండ్ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ట్రెండ్ సెట్టర్ సినిమా ఇప్పుడు మరోసారి థియేటర్స్ లో ఎంట్రీ ఇవ్వనుంది.

రీ-రిలీజ్ ట్రెండ్ మొదలైన తర్వాత ఈ సినిమాను 4K ఫార్మేట్ లో రిలీజ్ చేయాలనీ ఎప్పటినుంచో ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అలాగే దీనికి సంబందించిన వార్తలు కూడా అడపా దడపా వస్తూనే ఉన్నాయి. అదిగో ఇదిగో అనడమే తప్ప ఇంతవరకు సరైన అప్డేట్ ఇవ్వలేదు. ఇక ఫ్యాన్స్ కూడా సరే అప్డేట్ ఇచ్చినప్పుడే చూద్దాంలే అన్నట్లుగా లైట్ తీసుకున్నారు. అయితే రీసెంట్ గా అక్కినేని నాగేశ్వరరావు జయంతి సంధర్బంగా.. నాగార్జున శివ రీరిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసారు. రామ్ గోపాల్ వర్మ పాత్ బ్రేకింగ్ మూవీ శివ గ్రాండ్ రీరిలీజ్ నవంబర్ 14 అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సో ఈసారి ఈ డేట్ పక్కా అని ఫిక్స్ అయిపోవచ్చు. గత కొన్ని వారాలుగా అయితే థియేటర్స్ లో రీరిలీజ్ ల హడావిడి తగ్గింది. ఇలాంటి సమయంలో శివ లాంటి కిక్ ఇచ్చే మూవీ వస్తే.. ఫ్యాన్స్ కు పండగే. అసలే శివ సినిమా యాక్షన్ సీన్స్ కు పెట్టింది పేరు. తెలుగు సినిమాలలో యాక్షన్ సీన్స్ ను తీసే తీరును మార్చిన క్రెడిట్ ‘శివ’ సినిమాకు దక్కుతుందని చెప్పడంలో.. ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమా రీరిలీజ్ లో ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.