iDreamPost
android-app
ios-app

మౌనం వహిస్తున్న నాగార్జున.. ఇండస్ట్రీ ఏకమయ్యే అవకాశం ఉందా?

  • Published Oct 03, 2024 | 2:46 PM Updated Updated Oct 03, 2024 | 2:46 PM

ప్రస్తుతం ఇండస్ట్రీలో కొండా సురేఖ చైతన్య , సమంత గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. దానిపై సినీ ప్రముఖులు సైతం స్పందిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఈ విషయం ఇక్కడితో అయితే ఆగేలా కనిపించడం లేదు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో కొండా సురేఖ చైతన్య , సమంత గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. దానిపై సినీ ప్రముఖులు సైతం స్పందిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఈ విషయం ఇక్కడితో అయితే ఆగేలా కనిపించడం లేదు.

  • Published Oct 03, 2024 | 2:46 PMUpdated Oct 03, 2024 | 2:46 PM
మౌనం వహిస్తున్న నాగార్జున.. ఇండస్ట్రీ ఏకమయ్యే అవకాశం ఉందా?

సినిమా ఇండస్ట్రీ అంటే అందరికి చిన్న చూపా! లేదా సినీ నటులు డబ్బు కోసం ఏమైనా చేస్తారని భావిస్తారా! ఎందుకు సినిమా వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు? అంటూ సినీ ఇండస్ట్రీ భగ్గుమంటుంది. ప్రస్తుతం మీడియా సోషల్ మీడియాలో మంత్రి కొండా సురేఖ..  నాగ చైతన్య- సమంత గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాలను కుదిపేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తున్నారు. కొండ సురేఖ వ్యాఖ్యలను ఇండస్ట్రీ మొత్తం ఖండిస్తున్నారు. దానికి సంబంధించిన విషయాలు కూడా చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఇండస్ట్రీలోని నటి నటులు స్పందించే విధానం చూస్తుంటే .. ఈ విషయాన్నీ అంత సులభంగా విడిచిపెట్టేలా కనిపించడం లేదు. ఇండస్ట్రీ అంతా ఒకే తాటిపై నిలబడి ఇంకోసారి ఇలాంటివి జరగకుండా ఉండేందుకు.. ఎదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు అనిపిస్తుంది.

రాజకీయాల్లోకి సినిమా వాళ్ళను లాగొద్దని.. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్దం అంటూ అక్కినేని ఫ్యామిలీ స్పందించింది. ఇక ఆ తర్వాత చిరంజీవి, వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్, నాని, అల్లుఅర్జున్, ప్రకాష్ రాజ్, రామ్ గోపాల్ వర్మ, రోజా లాంటి ఎంతో మంది బిగ్ స్టార్స్ ఈ విషయంపై స్పందించారు. అసలు రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని సినీ నటులను, తమ రాజకీయ లబ్ది కోసం ఈ ఉచ్చు లోకి లాగడం అనేది కరెక్ట్ కాదంటూ.. సినీ విశ్లేషకులు , నెటిజన్లు సైతం కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. అయితే దీనిపై మొదటిగా స్పందించిన నాగార్జున.. ఇప్పుడు మీడియాతో మాట్లాడడానికి నిరాకరిస్తున్నారట. చూడబోతుంటే నటీ నటులంతా కలిసి ఎదో స్ట్రాంగ్ గానే ప్లాన్ చేసేలా ఉన్నారు. ఇండస్ట్రీ అంతా ఏకమయ్యి ఏదైనా ప్రెస్ మీట్ పెడతారా? లేదా ఈ విషయంపై ఏదైనా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందా?.. అసలు వారు ఎలాంటి నిర్ణయానికి రానున్నారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సినీ నటులు స్పందించిన తర్వాత ,కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లుగా తెలియజేశారు. సమంతకు క్షమాపణలు చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. అయినా సరే సినీ ప్రముఖులు మాత్రం ఇంకా కూల్ అయినట్లుగా కనిపించడం లేదు. ఇండస్ట్రీలో వాతావరణం వేడి వేడి గానే ఉంది. ఏ క్షణాన ఏం జరుగుతుందా అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా ఈ విషయంలో ఇండస్ట్రీ అంతా ఒకే మాట మీద ఉండడం వారిలోని ఐకమత్యాన్ని తెలియజేస్తుంది. సినిమా కుటుంబం అనేది పరస్పర గౌరవంతో ముందుకు వెళ్తూ ఉంది. అలాంటిది వారికి సంబంధం లేని విషయాల్లో వారి పేరు తీసుకురావడమే కాకుండా.. వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ఇక దీనిపై ఇండస్ట్రీ వర్గాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş