iDreamPost
android-app
ios-app

కింగ్ నాగ్ , RGV లను కలిసే ఛాన్స్.. ఎలా అంటే ?

  • Published Sep 23, 2025 | 4:28 PM Updated Updated Sep 23, 2025 | 4:30 PM

Shiva 4K ReRelease Contest : శివ సినిమాను నవంబర్ 14న 4K డాల్బీ అట్మాస్ క్వాలిటీతో రీ రిలీజ్ చేయనున్నట్లు రీసెంట్ గా నాగార్జున అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సంధర్బంగా అన్నపూర్ణ స్టూడియోస్ ఓ స్పెషల్ కాంటెస్ట్ ను నిర్వహిస్తుంది. ఈ కాంటెంస్ట్ లో విన్ అయినా లక్కీ పర్సన్స్ నాగార్జునను , రామ్ గోపాల్ వర్మ ను కలిసే స్పెషల్ ఛాన్స్ లభిస్తుంది.

  • Published Sep 23, 2025 | 4:28 PMUpdated Sep 23, 2025 | 4:30 PM
కింగ్ నాగ్ , RGV లను కలిసే ఛాన్స్.. ఎలా అంటే ?

కింగ్ నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో 1989లో వచ్చిన కల్ట్ క్లాసిక్ మూవీ శివ. ఈ సినిమాను నవంబర్ 14న 4K డాల్బీ అట్మాస్ క్వాలిటీతో రీ రిలీజ్ చేయనున్నట్లు రీసెంట్ గా నాగార్జున అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సంధర్బంగా అన్నపూర్ణ స్టూడియోస్ ఓ స్పెషల్ కాంటెస్ట్ ను నిర్వహిస్తుంది. ఈ కాంటెంస్ట్ లో విన్ అయినా లక్కీ పర్సన్స్ కు నాగార్జునను , రామ్ గోపాల్ వర్మ ను కలిసే స్పెషల్ ఛాన్స్ లభిస్తుంది. ఈ కాంపిటీషన్ కు సంబంధించిన ఇన్విటేషన్ ను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.

దానికి  సంబంధించిన ఎంట్రీలను వచ్చే నెల అక్టోబర్ 20వ తేదీ లోపు పంపాలని.. మీ క్రియేటివిటీకి పదునుపెట్టండని అన్నపూర్ణ స్టూడియోస్ అనౌన్స్ చేసింది. అసలు కాంపిటీషన్ ఏంటంటే.. కల్ట్-క్లాసిక్ శివ మూవీకి సంబంధించిన ట్రైలర్లు, పోస్టర్లలను తమ సొంత వెర్షన్‌లతో తయారు చేయాలి. శివకి సంబంధించి ఈ ఎడిటింగ్స్ చేసిన తర్వాత .. #Shiva4KContest ద్వారా ట్విట్టర్ లేదా ఇంస్టాగ్రామ్ లో అన్నపూర్ణ స్టూడియోస్‌ను ట్యాగ్ చేసి అప్‌లోడ్ చేయవచ్చని ప్రకటించారు.

ఇలా ఈ కాంపిటీషన్ లో విన్ అయినా మొదటి ముగ్గురు విన్నర్స్.. నాగార్జున , ఆర్జివి లను కలవచ్చు. సో క్రియేటివ్ పీపుల్ ఈ ఛాన్స్ ను అసలు మిస్ కాకండి. సెప్టెంబర్ 20 ANR 101వ జయంతి సంధర్బంగా.. నాగార్జున శివ 4K రీరిలీజ్ ను అనౌన్స్ చేశారు. సో ఈలోగా ఈ కాంపిటీషన్ ను నిర్వహించి ఓ కొత్త ఆలోచన చేశారు టీం. మరి ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.