iDreamPost
android-app
ios-app

Konda Surekha: కొండా సురేఖ పండుకో అనలేదు.. లాయర్ సంచలన వ్యాఖ్యలు!

  • Published Oct 09, 2024 | 11:59 AM Updated Updated Oct 09, 2024 | 11:59 AM

Konda Surekha Lawyer On Nagarjuna Defamation Case: నాగార్జున- కొండా సురేఖ మధ్య వివాహం ప్రస్తుతం కోర్టులో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాగార్జున కుటుంబం స్టేట్మెంట్స్ రికార్డ్ చేసింది. ఈ సమయంలో సురేఖ తరఫున లీగల్ టీమ్ లోని న్యాయవాది చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Konda Surekha Lawyer On Nagarjuna Defamation Case: నాగార్జున- కొండా సురేఖ మధ్య వివాహం ప్రస్తుతం కోర్టులో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాగార్జున కుటుంబం స్టేట్మెంట్స్ రికార్డ్ చేసింది. ఈ సమయంలో సురేఖ తరఫున లీగల్ టీమ్ లోని న్యాయవాది చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

  • Published Oct 09, 2024 | 11:59 AMUpdated Oct 09, 2024 | 11:59 AM
Konda Surekha: కొండా సురేఖ పండుకో అనలేదు.. లాయర్ సంచలన వ్యాఖ్యలు!

అక్కినేని నాగార్జున వర్సెస్ కొండా సురేఖ వివాదం కోర్టులో ఉన్న విషయం తెలిసిందే. కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసు విచారణ కొనసాగుతోంది. తమ కుటుంబం పరువుకు భంగం కలిగించేలా సురేఖ వ్యాఖ్యలు చేశారని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. మంగళవారం స్వయంగా నాంపల్లి కోర్టుకు వెళ్లి నాగార్జున కుటుంబం తమ స్టేట్మెంట్స్ ని కూడా రికార్డు చేసింది. ఇప్పుడు కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రొసీడింగ్స్ ప్రకారం.. ఇప్పుడు కొండా సురేఖకు న్యాయస్థానం తమ వాదన వినిపించే అవకాశం ఇస్తుంది. సురేఖ స్వయంగా కోర్టుకు హాజరయ్యి తమ స్టేట్మెంట్ రికార్డు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే కోర్టు ఈ కేసుకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తుంది. ఈ నేపథ్యంలో సురేఖ తరఫు లీగల్ టీమ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సురేఖ ఎక్కడా నాగార్జున కుటుంబం పరువు పోయేలా వ్యాఖ్యలు చేయలేదు అంటూ న్యాయవాది సంచలన వ్యాఖ్యలు చేశారు.

సురేఖ తరఫు లీగల్ టీమ్ లో న్యాయవాది మాట్లాడుతూ.. “ఈ కేసులో ఎక్కడా కూడా డిఫమేటరీ లేదు. పండుకో అన్నారా? అసభ్యకర పదజాలం వాడలేదు. ఎక్కడా కూడా ఇన్సల్ట్ చేయలేదు. వాళ్లకి ఇన్సల్ట్ చేసినట్లు అనిపించడం కూడా జోకింగ్ గా ఉంది. చాలా నవ్వులాటగా ఉంది మాకు కూడా. డిఫమేటరీ స్టేట్మెంట్ అట్రాక్ట్ అయితేనే డిఫమేటరీ అవుతుంది. ఆమె ఎక్కడా కూడా చెడ్డ మాటలు అనేదే లేదు. సమంత ఏదో ట్వీట్ చేశారు ట్విట్టర్లో. ఆమె ఎందుకు ఫీలైందో అని క్షమాపణ చెప్పడం జరిగింది. ఆమె సలబ్రిటీ కదా.. అని ఆమె పేరు తీసుకున్నందుకు ఆమె ఈగో హర్ట్ అయ్యిందేమో అని క్షమాపణ చెప్పడం తప్పిదే వేరే ఏం కాదు.

కేటీఆర్ ఇదంతా చేస్తున్నారు అనే కోపంతో మాట్లాడారు తప్పితే వేరే విధంగా ఏమీ లేదు. ఎక్కడా కూడా డిఫమేటరీ లేదు. కొండా సురేఖ అక్విట్ అయిపోతారు. అక్కడ అసలు తప్పుబట్టే వ్యాఖ్యలు చేయలేదు. వీళ్లంతా వాటిని వక్రీకరించి.. మానిప్యులేట్ చేసి హంగామా చేశారు. టాలీవుడ్ మొత్తం దిగి భయంకరమైన స్టేట్మెంట్స్ ఇచ్చారు. 24 క్రాఫ్ట్స్ అంటే అందరికీ తెలిసిందే. హీరో- హీరోయిన్ అంటే అందరికీ తెలిసిందే. దీనిని ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. 24 క్రాఫ్ట్స్ లో వన్ ఆఫ్ ది క్రాఫ్ట్ కూడా తెలుసు అందరికీ.

మొదట వాళ్లే ఆవిడను ప్రొవేక్ చేశారు. ఆవిడ ఏంటో మాట్లాడారు. దానిని వక్రీకరించి.. తిట్టిపించి ఇంకా పది మందితో అనిపించారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ట్రోల్స్ చేశారు. నిజానికి మేము వాళ్ల మీద క్రిమినల్ కంప్లైంట్ చేయాలి. ఆమె అసలు అలాంటి మాటలు మాట్లాడలేదు. ఆమె కేవలం విన్న మాటలను మాత్రమే మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు డిఫమేషన్ కేసు నిలబడదు. ఈ కేసు కచ్చితంగా నిలబడదు” అంటూ కొండా సురేఖ తరఫు లీగల్ టీమ్ లోని న్యాయవాది వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి.. కొండా సురేఖ తరఫు న్యాయవాది చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş