iDreamPost
android-app
ios-app

జపాన్ లో ‘మనం’ సినిమా..

  • Published Aug 02, 2025 | 12:10 PM Updated Updated Aug 02, 2025 | 12:12 PM

Manam Movie: అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు.. అభిమానులకు కూడా ఎప్పటికి గుర్తుండిపోయే మూవీ ఏదైనా ఉందంటే అది మనం సినిమానే. డైరెక్టర్ విక్రమ్ కుమార్ తీసిన బెస్ట్ మూవీస్ లో ఇది చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. అంతే కాకుండా అక్కినేని మూడు తరాల హీరోలకు ఈ సినిమా ఓ స్వీట్ మెమరి అని చెప్పి తీరాలి.

Manam Movie: అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు.. అభిమానులకు కూడా ఎప్పటికి గుర్తుండిపోయే మూవీ ఏదైనా ఉందంటే అది మనం సినిమానే. డైరెక్టర్ విక్రమ్ కుమార్ తీసిన బెస్ట్ మూవీస్ లో ఇది చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. అంతే కాకుండా అక్కినేని మూడు తరాల హీరోలకు ఈ సినిమా ఓ స్వీట్ మెమరి అని చెప్పి తీరాలి.

  • Published Aug 02, 2025 | 12:10 PMUpdated Aug 02, 2025 | 12:12 PM
జపాన్ లో ‘మనం’ సినిమా..

అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు.. అభిమానులకు కూడా ఎప్పటికి గుర్తుండిపోయే మూవీ ఏదైనా ఉందంటే అది మనం సినిమానే. డైరెక్టర్ విక్రమ్ కుమార్ తీసిన బెస్ట్ మూవీస్ లో ఇది చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. అంతే కాకుండా అక్కినేని మూడు తరాల హీరోలకు ఈ సినిమా ఓ స్వీట్ మెమరి అని చెప్పి తీరాలి. 2014 మే 23 న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఆ సమయంలో మనం మూవీ ఓ సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హిట్ టాక్ తో పాటు భారీ వసూళ్లను కూడా సంపాదించిపెట్టింది. ఇక ఇప్పుడు ఈ మూవీ మరోసారి రిలీజ్ కాబోతుంది.

అయితే ఇది రీరిలీజ్ ట్రెండ్ లో భాగంగా తెలుగులో రిలీజ్ అవ్వడం లేదు. జపాన్ లో ఈ సినిమాను రీరిలీజ్ చేయాలనీ నిర్ణయించుకున్నారట మేకర్స్. జపాన్ లో తెలుగు సినిమాలకు అభిమానులు ఏ విధంగా పెరుగుతున్నారో తెలియనిది కాదు. ఈ మధ్య కాలంలో అక్కడి ప్రేక్షకులు తెలుగు హీరోలను బాగా అభిమానిస్తున్నారు కూడా. ఈ సంధర్బంగా నాగార్జున అక్కడి అభిమానులతో వర్చ్యువల్ గా సమావేశం అవ్వాలని డిసైడ్ అయ్యారట. దానికోసం ఓ థియేటర్ ను వెన్యూగా ఎంచుకున్నట్లు సమాచారం.

అంటే అక్కడ మనం షో ను ప్రదర్శించే సమయంలో నాగ్ వారితో వర్చువల్ గా కనెక్ట్ అయ్యి ఇంట్రాక్ట్ అవ్వబోతున్నారన్నమాట. మనం సినిమాను ఆగష్టు 8 న జపాన్ రీరిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను ఇప్పుడు తెలుగు రీరిలీజ్ చేసిన అంతే రెస్పాన్స్ రావడం ఖాయం. కానీ జపాన్ లో కూడా తెలుగు సినిమాలకు ఇలాంటి క్రేజ్ ఉండడం విశేషం. పైగా జపాన్ లో నాగార్జునకు ఉండే ఫ్యాన్ బేస్ ఉండనే ఉన్నారు. వారందరికీ ఈ రీరిలీజ్ ఫుల్ జోష్ ను ఇస్తుందని చెప్పొచ్చు. ఇక జపాన్ లో చేయబోతున్న ఈ రీరిలీజ్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.