iDreamPost
android-app
ios-app

Nagarjuna: నాగార్జున కోర్టుకు హాజరు కావాలంటూ నాంపల్లి కోర్టు ఆదేశాలు..

Nagarjuna To Attend Nampally Court: అక్కినేని నాగార్జున మంగళవాలం నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. కొండా సురేఖ మీద వేసిన పరువునష్టం దావాకు సంబంధించి నాగార్జున కోర్టుకు రావాలని ధర్మాసనం ఆదేశించింది.

Nagarjuna To Attend Nampally Court: అక్కినేని నాగార్జున మంగళవాలం నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. కొండా సురేఖ మీద వేసిన పరువునష్టం దావాకు సంబంధించి నాగార్జున కోర్టుకు రావాలని ధర్మాసనం ఆదేశించింది.

Nagarjuna: నాగార్జున కోర్టుకు హాజరు కావాలంటూ నాంపల్లి కోర్టు ఆదేశాలు..

మంత్రి కొండా సురేఖా వర్సెస్ నాగార్జున ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను నాగార్జున కుటుంబమే కాకుండా.. టాలీవుడ్ మొత్తం తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. ఆవిడ తన మాటలను వెనక్కి కూడా తీసుకున్నారు. అయితే నాగార్జున మాత్రం ఆ విషయంలో చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కొండా సురేఖ మీద పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. నాంపల్లి కోర్టులో నాగార్జున ఈ పిటిషన్ ఫైల్ చేశారు. ఈ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. అయితే నాగార్జున కోర్టుకు రావాలని ఆదేశించింది. ఆయన వర్షన్ ను కోర్టుకు వచ్చిన నేరుగా చెప్పాలి అంటూ కోర్టు ఆదేశించింది. విచారణనను రేపు అనగా.. అక్టోబర్ 8వ తారీఖుకు వాయిదా వేశారు.

కొండా సురేఖ వర్సెస్ నాగార్జున కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. రాజకీయంగా ఒకరిని టార్గెట్ చేసేందుకు తమ కుటుంబంపై బురదచల్లారు అంటూ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. కొండా సురేఖపై పరువు నష్టం దావా ఫైల్ చేశారు. ఒకవైపు రాష్ట్ర మంత్రి.. మరోవైపు కొన్ని దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కీలకంగా ఉన్న కుటుంబం. ఈ నేపథ్యంలోనే కోర్టు కూడా మీడియా ట్రయల్స్ ని ప్రామాణికంగా తీసుకోమని చెప్పినట్లు తెలుస్తోంది. స్వయంగా కోర్టుకు వచ్చి నాగార్జున తమ వాదనను వినిపించాలని వెల్లడించింది. నాగార్జున నేరుగా వచ్చి తమ స్టేట్మెంట్ రికార్డు చేయాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.

అలాగే నాగార్జునతో సహా సాక్షుల స్టేట్మెంట్స్ కూడా రికార్డు చేస్తారు. మరో ఇద్దరిని సాక్షులుగా వారి స్టేట్మెంట్స్ కూడా రికార్డు చేసే ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే నాగార్జున ఫైల్ చేసిన పరువునష్టం దావాలో పూర్తి వివరాలు వెల్లడించారు. కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించిన ట్వీట్స్, వీడియోలు అన్నీ కూడా పిటిషన్ లో అటాచ్ చేశారు. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందంటే.. కొండా సురేఖ మీడియా ముఖంగా నాగ చైతన్య- సమంత విడాకుల గురించి ప్రస్తావించారు. మాజీ మంత్రి కేటీఆర్ వల్లే నాగచైతన్య- సమంత విడిపోయారు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వీడియో వైరల్ అవ్వగానే నాగార్జున ట్విట్టర్ వేదికగా స్పందించారు. కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు.

ఆ తర్వాత మొత్తం టాలీవుడ్ ఈ విషయంలో స్పందించింది. అందరూ అలాంటి ఆరోపణలు, విమర్శలు చేయడం తగదు అని హితవు పలికారు. సినిమావాళ్లు అనగానే ఇలాంటి మాటలు అనేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా సురేఖ తన మాటలను ఉపసంహరించుకున్నారు. సమంతకు క్షమాపణలు కూడా చెప్పారు. అయితే ఈ విషయంలో మాత్రం నాగార్జున పరువు నష్టం దావా వేశారు. ఇప్పుడు ఈ కేసు విచారణకు రాగా.. నాగార్జున నేరుగా కోర్టుకు రావాలి అని ఆదేశాలు జారీ చేశారు. నేరుగా వచ్చి తన స్టేట్మెంట్ రికార్డు చేయాలని సూచించారు. మరి.. నాగార్జున కోర్టుకు రావాలి అనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.