iDreamPost
android-app
ios-app

దీపక్ గా మెప్పించాడు.. మరి సైమన్ గా !

  • Published Aug 14, 2025 | 10:11 AM Updated Updated Aug 14, 2025 | 10:11 AM

సౌత్ లో కూలి సినిమా మీద ఇంత హైప్ రావడానికి రజినీకాంత్ మీద ఉన్న అభిమానంతో పాటు.. నాగార్జున ఫ్యాన్ బేస్ కూడా ఓ రీజన్. అసలు నాగ్ తనే సెకండ్ ఇన్నింగ్స్ లో ఇలాంటి క్యారెక్టర్స్ ను ఎంచుకుంటారని ఎవరు ఊహించలేదు. రీసెంట్ గా శేఖర్ కమ్ముల కుభేర సినిమాలో దీపక్ గా క్యారెక్టర్ తో నాగ్ ఏంటో అందరికి అర్థమైపోయింది

సౌత్ లో కూలి సినిమా మీద ఇంత హైప్ రావడానికి రజినీకాంత్ మీద ఉన్న అభిమానంతో పాటు.. నాగార్జున ఫ్యాన్ బేస్ కూడా ఓ రీజన్. అసలు నాగ్ తనే సెకండ్ ఇన్నింగ్స్ లో ఇలాంటి క్యారెక్టర్స్ ను ఎంచుకుంటారని ఎవరు ఊహించలేదు. రీసెంట్ గా శేఖర్ కమ్ముల కుభేర సినిమాలో దీపక్ గా క్యారెక్టర్ తో నాగ్ ఏంటో అందరికి అర్థమైపోయింది

  • Published Aug 14, 2025 | 10:11 AMUpdated Aug 14, 2025 | 10:11 AM
దీపక్ గా మెప్పించాడు.. మరి సైమన్ గా !

సౌత్ లో కూలి సినిమా మీద ఇంత హైప్ రావడానికి రజినీకాంత్ మీద ఉన్న అభిమానంతో పాటు.. నాగార్జున ఫ్యాన్ బేస్ కూడా ఓ రీజన్. అసలు నాగ్ తనే సెకండ్ ఇన్నింగ్స్ లో ఇలాంటి క్యారెక్టర్స్ ను ఎంచుకుంటారని ఎవరు ఊహించలేదు. రీసెంట్ గా శేఖర్ కమ్ముల కుభేర సినిమాలో దీపక్ గా క్యారెక్టర్ తో నాగ్ ఏంటో అందరికి అర్థమైపోయింది. ఇప్పటివరకు నాగార్జున చేసిన క్యారెక్టర్స్ ఒకెత్తు ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ ఒకెత్తు. కంప్లీట్ గా తన పరిధిని దాటి బయటకు వచ్చి చేస్తున్న క్యారెక్టర్స్ ఇవి. కుభేరల్లో దీపక్ గా అయితే నాగ్ మెప్పించాడు. మరి ఇప్పుడు సైమన్ గా ఎలాంటి టాక్ సంపాదించుకుంటాడా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

మొదటి నుంచి కూలీ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్టే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో టికెట్స్ బాగానే తెగాయి. ప్రస్తుతానికైతే మొదటి షో తర్వాత సినిమా గురించి టాక్ బాగానే వినిపిస్తుంది. ముఖ్యంగా నాగార్జున ఈ సినిమాకు బిగ్ అసెట్ అని అంతా అంటున్నారు. ఎందుకంటే మొదటిసారి నాగార్జున విలన్ రోల్ లో నటించారు. కుభేరలో దీపక్ రోల్ మొదట్లో నెగెటివ్ అయినా సరే ఎండ్ కి వచ్చేసరికి అది పాజిటివ్ గానే టర్న్ అవుతుంది. కాబట్టి అది ఓకే. కానీ సైమన్ క్యారెక్టర్ అలా కాదు పూర్తిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర.

అది చాలా భయంకరంగా ఉంటుందని.. నిజ జీవితంలో వ్యక్తులు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారా అని తాను ఆశ్చర్యపోయానని.. స్వయంగా నాగార్జుననే గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. దాన్ని బట్టి అర్థంచేసుకోవచ్చు.. సైమన్ క్యారెక్టర్ ఎంత వయొలెంట్‌గా ఉంటుందో . ఒకవేళ ఎండ్ అఫ్ ది డే కి నాగార్జున క్యారెక్టర్ విషయంలో ఫుల్ మార్క్స్ పడ్డాయంటే ఇక నాగ్ గెలిచినట్టే. మరిన్ని అవకాశాలు నాగ్ డోర్ తట్టే అవకాశాలు లేకపోలేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.