ప్రేమించుకున్నారు. పెళ్లి చేసేందుకు పెద్దలు అంగీకరించలేదు. సహజీవనం చేశారు. అమ్మాయి మూడు నెలల గర్భిణి కావడంతో.. ఇరు కుటుంబాల పెద్దలు రాజీకి వచ్చి ఇద్దరికీ పెళ్లి చేశారు. కానీ విధి ఆ జంటను చూడలేకపోయింది. ఈర్ష్యతో పెళ్లికొడుకుని పెళ్లైన రాత్రే మృత్యువు కబళించింది. ఈ హృదయ విదారక ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. ఎల్ ఎన్ పేట మండలం పెద్దకొల్లివలస గ్రామానికి చెందిన జమ్మాన పవన్ కుమార్ (20) తాపీమేస్త్రి. అదే గ్రామానికి చెందిన బలగ యోగీశ్వరితో […]
ఏపీలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. ఒడిశాలోని చిన్నపల్లి నుంచి విజయవాడకు వెళ్తున్న సంగీత ట్రావెల్స్ కు చెందిన బస్సు చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు భద్రాచలం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో […]
చేపల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దాంతో లారీలో ఉన్న చేపలన్నీ రోడ్డుపై పడ్డాయి. ఇది చూసిన చుట్టుపక్కల ప్రజలు అరగంటలో చేపలన్నింటినీ ఎత్తుకుపోయారు. ఈ ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఏపీ నుంచి మహారాష్ట్రలోని నాగపూర్ వైపు చేపల లోడుతో వెళ్తున్న లారీ.. జిల్లాలోని బూర్గంపాడు మండలం ఐటీసీ క్రాస్ రోడ్డు వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలవ్వగా.. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. […]
ఉత్తర ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లాక్డౌన్ వల్ల ఉపాధి లేక రాజస్తాన్ నుంచి ఉత్తర ప్రదేశ్కు వలసకూలీలు నడకన బయలుదేరారు. మధ్యలో ఓ ట్రక్కు డ్రైవర్ వీరికి సహాయం చేశారు. వలసకూలీలు ప్రయాణిస్తున్న ట్రక్కు ఉత్తరప్రదేశ్ ఔరాయ జాతీయ రహదారిపై వేగంగా వెళుతు ఎదురుగా వస్తున్న మరో ట్రక్కును ఈ రోజు శనివారం తెల్లవారుజామున ఢీకొట్టింది. ఈ ఘటనలో 24 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది క్షతగాత్రులయ్యారు. వీరిని పోలీసులు […]