iDreamPost
android-app
ios-app

భర్త కోసం వెయిట్ చేస్తోంది.. వచ్చేలోపే అంతా జరిగిపోయింది

బిడ్డలతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లింది శారదా. మరుసటి రోజు తన ఇంటికి బస్సులో బయలు దేరింది. గమ్యస్థానానికి చేరుకుంది. అంతలో భర్తకు ఫోన్ చేసింది. బస్సు దిగాం రా అని. ఇదిగో వచ్చేస్తున్నా అని చెప్పడంతో..

బిడ్డలతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లింది శారదా. మరుసటి రోజు తన ఇంటికి బస్సులో బయలు దేరింది. గమ్యస్థానానికి చేరుకుంది. అంతలో భర్తకు ఫోన్ చేసింది. బస్సు దిగాం రా అని. ఇదిగో వచ్చేస్తున్నా అని చెప్పడంతో..

భర్త కోసం వెయిట్ చేస్తోంది.. వచ్చేలోపే అంతా జరిగిపోయింది

మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పడం చాలా కష్టం. పొంచి ఉన్న ఆపదను ఎవ్వరూ కనిపెట్టలేరు. ముంచుకొస్తున్న ప్రమాదం నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు కొన్ని సార్లు. ఊహించని హఠాత్ పరిణామాలకు కుటుంబాలకు కుటుంబాలు మృత్యు ఒడికి చేరుకుంటున్నాయి.  ఇంటి నుండి బయటకు వెళితే.. తిరిగి వస్తున్నామన్న నమ్మకం లేకుండా పోతుంది ఈ రోజుల్లో. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకు బిడ్డల్ని దూరం చేస్తుంటే.. మరికొన్ని సందర్భాల్లో పిల్లలకు పేరెంట్స్ దూరం అవుతున్నారు. కానీ ఈ ఘటనలో భార్యను, బిడ్డను పొగొట్టుకున్నాడో వ్యక్తి. ఇదిగో వచ్చేస్తున్నా వెయిట్ చేయ్.. అని చెప్పిన  కాసేపటికే.. లారీ రూపంలో కబళించింది మృత్యువు.

పిల్లలతో సహా బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చిన మహిళ.. బస్సు దిగి రోడ్డుపై భర్త కోసం వెయిట్ చేస్తుండగా… లారీ ఢీ కొనడంతో మృతి చెందింది. ఈ ఘటనలో అభం, శుభం తెలియని చిన్నారి చక్రాల కింద నలిగిపోయింది. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లా ఏర్పేడు-వెంకటగిరి ప్రధాన రహదారిపై అముడూరు వద్ద చోటు చేసుకుంది. సీఐ శ్రీరామ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సీకాలనికి చెందిన శారద దంపతులకు గురు కార్తీక్ (4), గురు వైష్ణవి (2) పిల్లలున్నారు. శనివారం బంధువుల ఇంటికి పిల్లల్ని తీసుకుని వెళ్లింది శారద. ఆదివారం తన ఇంటికి బయలు దేరింది. రామానుజ పల్లి క్రాస్ రోడ్డు వద్ద  ఈ ముగ్గురు బస్సు దిగారు. పిల్లలో కలిసి రోడ్డు పక్కన నిలబడగా.. భర్తకు ఫోన్ చేసి బస్సు దిగామని తర్వగా రావాలని కోరింది.

భర్త రావడానికి టైం పడుతున్న నేపథ్యంలో పిల్లలతో కలిసి రహదారి పక్కన కూర్చోగా.. విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తున్న లారీ అదుపుతప్పి ఆ ముగ్గురిపైకి దూసుకొచ్చింది. చిన్నారి గురువైష్ణవి అక్కడికక్కడే మృతి చెందగా శారద లారీ చక్రాల మధ్యలో ఇరుక్కుపోయింది. గురుకార్తీక్‌ గాయపడ్డాడు. భార్య చెప్పిన ప్రాంతానికి భర్త అక్కడికి వచ్చి చూసి షాక్ తిన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అంతలో సమీపంలోని టోల్‌ప్లాజా సిబ్బంది వచ్చి జాకీలతో లారీ టైర్లు పైకిలేపి శారదను బయటకు తీశారు. తీవ్ర గాయాలతో బయటపడిన శారదను చికిత్స కోసం శ్రీకాళహస్తికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. గురుకార్తీక్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ప్రమాదంలో బిడ్డ, భార్యను పొగొట్టుకుని కన్నీరుమున్నీరు భర్త, ఆమె తరుఫు బంధువులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి