iDreamPost
android-app
ios-app

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసి వస్తూ..మార్గం మధ్యలో వివాహిత..!

Vikarabad District: గ్రూప్-1 ఉద్యోగం సాధించే క్రమంలో ఓ వివాహిత ఇంట విషాదం చోటుచేసుకుంది. భర్తకు, కుటుంబ సభ్యులకు అన్యాయం చేస్తూ...ఇంట్లో విషాదం నింపింది.

Vikarabad District: గ్రూప్-1 ఉద్యోగం సాధించే క్రమంలో ఓ వివాహిత ఇంట విషాదం చోటుచేసుకుంది. భర్తకు, కుటుంబ సభ్యులకు అన్యాయం చేస్తూ...ఇంట్లో విషాదం నింపింది.

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసి వస్తూ..మార్గం మధ్యలో వివాహిత..!

ప్రతి ఒక్కరికి జీవితంపై ఎంతో ఆశ ఉంటుంది. తాము ఏదో ఒకటి  సాధించాలనే తపనతో చాలా మంది పని చేస్తుంటారు. అందుకే రేయింబవళ్లు కష్టపడి వివిధ రకాల ఉద్యోగాలు సాధిస్తుంటారు. మరికొందరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి..ప్రజలకు సేవ  చేయాలని భావిస్తుంటారు. ఇలా వారు లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో విధి చిన్న చూపు చూస్తుంది. దీంతో అప్పటి వరకు ఎంతో వెలుగుగా కనిపించిన వారి జీవితం అందకారంలోకి వెళ్తుంది. అలానే గ్రూప్-1 ఉద్యోగం సాధించే క్రమంలో ఓ వివాహిత ఇంట విషాదం చోటుచేసుకుంది. భర్తకు, పిల్లలకు అన్యాయం చేస్తూ…ఇంట్లో విషాదం నింపింది. మరి.. అసలు ఏం జరిగిందో, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం….

ఆదివారం తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేంద్రాల్లో ఈ పరీక్షలను అధికారులు నిర్వహించారు. నిమిషం ఆలస్యమైన ఎంట్రీకి అనుమతించడలేదు.  మొత్తంగా ఈ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఎక్కడ విమర్శళకు తావు లేకుండా పటిష్టంగా ఈ పరిక్షలను టీఎస్పీఎస్సీ నిర్వహించింది. ఇది ఇలా ఉంటే.. ఓ వివాహిత, ప్రభుత్వ ఉద్యోగిని గ్రూప్ -1 పరీక్ష రాసి..తిరిగి వస్తుండగా ఘోర ప్రమాదానికి గురైంది. దీంతో ఆమె ఆశలు ఛిద్రమై..తిరిగి రాని లోకాలకు వెళ్లింది. దీంతో ఆమె కుటుంబంలో విషాదం నిండింది. ఆ మహిళ ఒకటి తలిస్తే.. విధి మరోకటి తల్చింది.

వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలం బోరబండ తంజడాకు చెందిన సుమిత్ర(28) పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుంది. తన విధుల్లో ఎంతో బాధ్యతగా ఉంటూ స్థానికంగా సుమిత్ర మంచి పేరు తెచ్చుకుంది. ఇక పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం రావడంతో తన పరిధిలో ప్రజలకు మెరుగైన సేవ చేస్తుంది. అలానే గ్రూప్-1 ఉద్యోగం సాధించాలని సుమిత్ర ఎన్నో కలలు కన్నది. అందుకు తగినట్లుగానే పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూనే గ్రూప్-1 పరీక్షకు ప్రిపేర్ అయ్యింది. ఈక్రమంలో ఆదివారం ఈ పరీక్షలు జరిగాయి. వీటికి సుమిత్ర సైతం హాజరైంది. అలా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఘోరం చోటుచేసుకుంది. ఆమె ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి కింద పడి మృతి చెందింది.

ఆదివారం సుమిత్ర తన భర్త నెహ్రూనాయక్ తో కలిసి వికారాబాద్ జిల్లా కేంద్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసింది. తిరిగి వారిద్దరు బైక్ పై వెళ్తుండగా ధారూర్ మండలం దోర్నాల వద్దకు రాగానే అదుపు తప్పి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో సుమిత్రకు తీవ్రంగా గాయాలయ్యాయి.  ఈ  సంఘటనను గమనించిన స్థానికులు గాయపడిన సుమిత్రను వెంటనే తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ సుమిత్ర మృతి చెందింది.  భర్త నెహ్రూ నాయక్ కు స్వల్ప గాయాలు అయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మొత్తంగా గ్రూప్-1 పరీక్ష రాసి..ఆఫీస్  అవుతుందని ఆశలు పెట్టుకుంటే..తమకు కన్నీరు మిగిల్చిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి