iDreamPost
android-app
ios-app

AP: పరీక్ష రాయడానికి పుట్టింటికి వచ్చిన వివాహిత.. ఇంతలోనే దారుణం

  • Published Jun 22, 2024 | 10:54 AM Updated Updated Jun 22, 2024 | 10:54 AM

రెండేళ్ల క్రితం ఆమెకు వివాహమైంది. అర్థం చేసుకునే భర్త.. తల్లిదండ్రుల మాదిరి ప్రేమగా చూసుకునే అత్తామామలున్నారు. పరీక్షలు రాయడం కోసం ఆ మహిళ పుట్టింటికి వచ్చింది. ఇంతలోనే దారుణం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

రెండేళ్ల క్రితం ఆమెకు వివాహమైంది. అర్థం చేసుకునే భర్త.. తల్లిదండ్రుల మాదిరి ప్రేమగా చూసుకునే అత్తామామలున్నారు. పరీక్షలు రాయడం కోసం ఆ మహిళ పుట్టింటికి వచ్చింది. ఇంతలోనే దారుణం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

  • Published Jun 22, 2024 | 10:54 AMUpdated Jun 22, 2024 | 10:54 AM
AP: పరీక్ష రాయడానికి పుట్టింటికి వచ్చిన వివాహిత.. ఇంతలోనే దారుణం

మృత్యువు ఎప్పుడు.. ఏ రూపంలో ఎవరిని పలకరిస్తుందో చెప్పడం కష్టం. అప్పటి వరకు ఎంతో బాగా ఉన్న వారు.. క్షణాల వ్యవధిలోనే కన్ను మూస్తున్నారు. ఇక ప్రమాదాల కారణంగా మృత్యువాత పడే వారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా.. సరే.. ఎదుటి వారి నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య భారీగా ఉంటుంది. రోడ్డు ప్రమాదం అంటే ఒక వ్యక్తి చనిపోవడం కాదు.. కుటుంబం రోడ్డున పడటం అవుతుంది. ఇక మరి కొందరేమో అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్ప కూలుతున్నారు. ఇక కొందరేమో క్షణికావేశంలో.. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్య చేసుకుని.. కుటుంబంలో తీరని విషాదం నింపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పరీక్ష రాయడానికి పుట్టింటికి వచ్చిన ఓ మహిళ.. అనూహ్య రీతిలో మృత్యువాత పడింది. ఆ వివరాలు..

ఈ సంఘటన ఆంద్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పరీక్ష రాయడం కోసం పుట్టింటికి వచ్చిన ఓ మహిళ.. అనూహ్య రీతిలో మృతి చెందింది. దాంతో ఆమె పుట్టిల్లు, మెట్టినింటిలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా.. పెనుగొండ రోడ్డులోని నెగ్గిపూడి లాకుల సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవగానుగుల గీతావాణి(23) మృతి చెందింది. మార్టేరు శివరావుపేటకు చెందిన గీతావాణి పరీక్షలు రాసేందుకు పుట్టింటికి వచ్చింది. ఎగ్జామ్‌ రాయడం కోసం స్కూటర్‌పై పెనుగొండ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటర్‌పై వెళ్తోన్న గీతావాణిని.. లారీ ఢీకొనడంతో దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది

ఈ ప్రమాదంలో మృతి చెందిన గీతావాణికి.. రెండేళ్ల క్రితం వేలివెన్నుకు చెందిన వెంకటేశ్వరరావుతో వివాహమైంది. ఎంబీఏ చదువుతున్న గీతావాణి పరీక్షలు రాసేందుకు వారం రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. పెనుగొండ ఎస్వీకేపీ కళాశాలలో పరీక్షలు రాస్తోంది గీతావాణి. ఎగ్జామ్స్‌ రాయడానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుని ఆమె మృతి చెందింది. ఇక ఈ ఘటనపై గీతావాణి భర్త వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఐ రజనీ కుమార్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్లు పెనుమంట్ర ఇన్‌చార్జి ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. పరీక్షలు రాయడానికి వచ్చిన కుమార్తె.. ఇలా మృత్యువాత పడటంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.