Krishna Kowshik
చదువుల కోసమని బెంగళూరు వెళ్లింది యువతి. పుట్టిన రోజు కావడంతో తన ఇంట్లో, తన పెరేంట్స్ మధ్య వేడుకలు నిర్వహించుకోవాలని భావించింది. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పింది. కారులో బయలు దేరగా.
చదువుల కోసమని బెంగళూరు వెళ్లింది యువతి. పుట్టిన రోజు కావడంతో తన ఇంట్లో, తన పెరేంట్స్ మధ్య వేడుకలు నిర్వహించుకోవాలని భావించింది. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పింది. కారులో బయలు దేరగా.
Krishna Kowshik
తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు ఎంతో సంతోషంగా తన ఇంటికి బయలు దేరింది రక్షిత. చదువుల నిమిత్తం తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న ఆమె..బర్త్ డే రోజు మాత్రం ఠంచనుగా ఇంటికి వచ్చేస్తుంది. కూతురు వచ్చేస్తుందని పేరెంట్స్ కూడా స్వీట్స్, సర్ ప్రైజెస్ సిద్ధం చేశారు. కాలేజీలో ఫ్రెండ్ విషెస్ చెప్పాక.. కారులో బయలుదేరింది రక్షిత. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు కూడా చెప్పింది. అయితే ఎంత సేపటికి ఇంటికి రాలేదు. కాసేపటికి పోలీసుల నుండి ఫోన్ వచ్చింది.. మీ కూతురు రోడ్డు ప్రమాదంలో మరణించింది అని. ఒక్కసారిగా షాక్ తిన్నారు పేరెంట్స్. హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకుని కూతుర్ని నిర్జీవంగా చూసి కన్నీరుమున్నీరయ్యారు.
పుట్టిన రోజు నాడే.. కూతురు గిట్టడంతో తట్టుకోలేని వేదన చవిచూస్తున్నారు పేరెంట్స్. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిక్కబళ్లాపూర్ తాలూకాలోని హోన్నెనహళ్లి గ్రామానికి చెందిన రక్షిత బెంగళూరులోని నిట్టే మీనాక్షి కాలేజీలో బీకామ్ చదువుతోంది. అక్కడే హాస్టల్లో ఉంటూ చదువును కొనసాగిస్తుంది. ఈ క్రమంలో ఆమె పుట్టిన రోజు వచ్చింది. ప్రతి ఏడాదిలాగానే ఈ సంవత్సరం కూడా తన తల్లిదండ్రులతో కలిసి బర్త్ డే వేడుకలు చేసుకోవాలని భావించింది. కూతురి రాకకోసం పేరెంట్స్ కూడా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఓ కారు మాట్లాడుకుని ఇంటికి బయలు దేరింది. కానీ ఆమెను అదే కారు యమపాశమై కాటేసింది.
ఇంటికి వస్తుండగా.. నాగార్జున కాలేజ్ సమీపంలో కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఎడమ వైపు ఈ ప్రమాదం జరిగింది. కారులో లెఫ్ట్ సైడ్ కూర్చున్న విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే కారు డ్రైవర్ కు ఏం కాలేదు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రక్షితను ఆసుపత్రి తీసుకెళ్లలేదు కారు డ్రైవర్. వెంటనే భయంతో అక్కడ నుండి పరారయ్యాడు. దీంతో యువతి అక్కడిక్కడే మృతి చెందింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఆధారాలను బట్టి బాధితురాలు రక్షిత అని గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కాగా, కారు డ్రైవర్ నిశ్వంత్ అని గుర్తించారు. చిక్కబళ్లాపూర్ తాలూకాలోని నంది పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుడు నిశ్వాంత్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పుట్టిన రోజు నాడే కూతురు చనిపోవడంతో ఆ ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి.