iDreamPost
android-app
ios-app

ఆమె ఆశలన్ని ఆవిరయ్యాయి.. బంగారు భవిష్యత్తు కోసం అమెరికా వెళ్తే..

  • Published Jul 22, 2024 | 8:55 AM Updated Updated Jul 22, 2024 | 8:55 AM

AP Tenali Doctor Dead In USA Road Accident: బంగారు భవిష్యత్తు, మంచి జీవితం గురించి ఎన్నో కలలు కని.. అమెరికా వెళ్లిన ఆమె ఆశలన్ని ఆవిరయ్యాయి. ఆ వివరాలు..

AP Tenali Doctor Dead In USA Road Accident: బంగారు భవిష్యత్తు, మంచి జీవితం గురించి ఎన్నో కలలు కని.. అమెరికా వెళ్లిన ఆమె ఆశలన్ని ఆవిరయ్యాయి. ఆ వివరాలు..

  • Published Jul 22, 2024 | 8:55 AMUpdated Jul 22, 2024 | 8:55 AM
ఆమె ఆశలన్ని ఆవిరయ్యాయి.. బంగారు భవిష్యత్తు కోసం అమెరికా వెళ్తే..

మన దేశంలో చాలా మంది యువతకు ఉండే కల.. విదేశాల్లో మరీ ముఖ్యంగా అమెరికా వెళ్లి ఉన్నత విద్య అభ్యసించాలని.. అక్కడే మంచి ఉద్యోగం సంపాదించి.. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలని భావించే వారే అధికం. అందుకోసం అప్పు చేసి మరీ విదేశాలకు వెళ్లే వారి సంఖ్య విపరీతంగా ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో విదేశాల్లో ఉంటున్న భారతీయ విద్యార్థులపై దాడులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. అలానే విదేశాల్లో మృత్యువాత పడుతున్న ఇండియన్‌ విద్యార్థుల సంఖ్య కూడా బాగా పెరుగుతుంది. ప్రమాదాలు, దాడులు కారణాలు ఏవైనా సరే.. బంగారు భవిష్యత్తు గురించి కలలు కని.. విదేశాలకు వెళ్లే విద్యార్థులు.. ఇలా దుర్మరణం పాలవ్వడం తల్లిదండ్రులను కలవరపెడుతుంది. వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతుంది. తాజాగా అమెరికాలో మరో దారుణం చోటు చేసుకుంది. బంగారు భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన తెలుగు యువతి కలలన్ని కల్లలయ్యాయి. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డాక్టర్‌ జెట్టి హారిక(25) ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. బిడ్డ జీవితం బాగుంటుందని ఆశించిన ఆమె తల్లిదండ్రులు ఆశలన్ని ఆవిరయ్యాయి. ఉన్నత విద్య కోసం అగ్రరాజ్యం అమెరికా వెళ్లిన హారిక(25) అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. దాంతో, ఆమె స్వస్థలం గుంటూరు జిల్లాలో విషాదఛాయలు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు హారిక మృతదేహం కోసం భారత రాయబార కార్యాలయం వద్ద కన్నీటితో ఎదురు చూస్తున్నారు.

వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా, తెనాలికి చెందిన జెట్టి శ్రీనివాసరావు, నాగమణిల కుమార్తె అయిన హారిక..  వెటర్నరీ డాక్టర్‌ విద్య పూర్తి చేసింది. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం.. ఏడాదిన్నర క్రితం అమెరికా వెళ్లింది. త్వరలో చదువు పూర్తి చేసుకుని.. తిరిగి స్వదేశం వస్తుందని భావించిన ఆమె తల్లిదండ్రుల ఆశలు ఆవివరయ్యాయి. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన జెట్టి హారిక.. కొన్ని రోజుల క్రితం అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. అమెరికాలోని ఓక్లహోమా స్టేట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో హారిక మృతి చెందినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే విద్య పూర్తి చేసుకుని.. ఇండియాకు తిరిగి వస్తుంది అనుకుంటే.. ఇంతలోనే ఇలా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఇక, హారిక తండ్రి జెట్టి శ్రీనివాస్‌ దేవాదాయ శాఖ ఉద్యోగిగా పని చేస్తున్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుని.. ఇండియాకు తిరిగి వస్తుందని భావించిన బిడ్డ.. చనిపోవడంతో.. ఇప్పుడు ఆమె మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు. హారిక మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.