P Krishna
Road Accident: ప్రపంచంలో ఎక్కడ చూసినా పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం కొన్నైతే.. అనుకోకుండా జరిగే ప్రమాదాలు మరికొన్ని.
Road Accident: ప్రపంచంలో ఎక్కడ చూసినా పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం కొన్నైతే.. అనుకోకుండా జరిగే ప్రమాదాలు మరికొన్ని.
P Krishna
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతున్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎంతోమంది అనాథలుగా మిగిలిపోతున్నారు. అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, అవగాహ లేకుండా వాహనాలు డ్రైవ్ చేయడం ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రతిరోజు పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇతర దేశాల్లో భారత సంతతికి చెందినవారు రోడ్డు ప్రమాదాల్లో కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా మరో విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
అమెరికాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టెక్సాస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. తల్లిదండ్రులు తమ కొడుకును డల్లాస్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయానికి వదిలి రావడానికి కారులో బయలుదేరారు. ఆ సయయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దంపతులు అరవింద్ మణి (45), అతని భార్య ప్రదీపా అరవింద్ (40), కుమారుడు ఆండ్రిల్ అరవింద్ (17) దుర్మరణంపాలయ్యారు.
ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదం గురించి పోలీసులు మాట్లాడుతు.. కారులో ముగ్గురు వెళ్తున్న సమయంలో కారు టైర్ పేలిపోయింది. దీంతో వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి మరో కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే కన్నుమూసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దంపతులకు ఆదిర్యాన్ అరవింద్ అనే చిన్న కొడుకు ఉన్నాడు. ఐనవాళ్లందరినీ కోల్పోయి ఆదిర్యాన్ ఒంటరివాడై దిగులుగా చూస్తుంటే అక్కడ ఉన్నవాళ్లంతా కంటతడి పెట్టుకున్నారు.
Three members of an Indian-origin family — Arvind Mani, 45, his wife Pradeepa Arvind, 40, and their child Andril Arvind, 17 — were killed in a car crash in Texas, US. The car crash took place when a 2004 Cadillac travelling southbound experienced a rear tyre blowout, causing it… pic.twitter.com/AMmI0f8YZE
— IndiaToday (@IndiaToday) August 16, 2024