iDreamPost

విషాదం.. అలకనంద నదిలో పడిపోయిన టెంపో.. 12 మంది మృతి

ఈ రోజుల్లో ఇంట్లో నుండి కాలు తీసి బయటపెడితే.. తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకుంటామో లేదో చెప్పడం కష్టంగా మారింది. ఎందుకంటే.. రోజు రోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలే అందుకు నిదర్శనం.

ఈ రోజుల్లో ఇంట్లో నుండి కాలు తీసి బయటపెడితే.. తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకుంటామో లేదో చెప్పడం కష్టంగా మారింది. ఎందుకంటే.. రోజు రోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలే అందుకు నిదర్శనం.

విషాదం.. అలకనంద నదిలో పడిపోయిన టెంపో.. 12 మంది మృతి

ప్రతి రోజు ఎక్కడో ఒక్క చోట రో రక్తమోడుతూ ఉంటాయి. అనారోగ్య సమస్యలతో మరణించే వారి కన్నా ఈ యాక్సిడెంట్ల కారణంగా మృతి చెందే వారి సంఖ్యే ఎక్కువ. అతివేగం, నిద్రలేమీ, రాంగ్ రూట్ అండ్ రాష్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం, వాహనంపై నియంత్రణ కోల్పోవడం వంటి కారణాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. పనుల మీద బయటకు వెళుతూ, దైవ దర్శనకు వెళుతూ నవ దంపతుల నుండి వృద్ధుల వరకు రోడ్డు ప్రమాదాలకు గురై తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతున్నారు.  కుటుంబాలకు కుటుంబాలను పొట్టనపెట్టుకుంటున్నాయి ఈ యాక్సిడెంట్స్. తాజాగా మరో రోడ్డు ప్రమాదం డజను మందిని బలితీసుకుంది. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోరం చోటుచేసుకుంది. రుద్రప్రయాగ్ జిల్లా రైటోలిలోని లోయలో నుండి అలకనంద నదిలో టెంపో కారు పడి 12 మంది మరణించగా.. 14 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించారు. వీరిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరణించిన వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. ఈ ఘటన రిషీకేశ్-బద్రీనాథ్ హైవేపై శనివారం చోటుచేసుకుంది. ఈ టెంపో వాహనంలో మొత్తం 23 నుండి 26 మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోంది. హర్యానా రిజిస్ట్రేషన్ నంబర్ గల ఈ వాహనం శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఢిల్లీ నుంచి చోప్తా, ఉఖిమత్‌కు వెళ్తోంది. చార్ ధామ్ యాత్రలో ఉన్న యాత్రికులా లేక పర్యాటకులా అన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

కాగా, అక్కడ సహాయక చర్యలు జరుగుతున్నాయి. రాష్ట్ర విపత్తు ప్రతి స్పందన దళం, పోలీసులు ఈ సహాక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ యాక్సిడెంట్ వెనుక కారణాన్ని అన్వేషిస్తున్నారు పోలీసులు. కాగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి సీఎం పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ధామి జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ.. బాధితుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ముమ్మురంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని  పోలీసులు, ఉన్నతాధికారులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి