iDreamPost
android-app
ios-app

బీర్లతో వెళ్తున్న లారీ బోల్తా.. పండగ చేసుకున్న మందుబాబులు! ఎక్కడంటే..?

నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. బుధవారం బీర్ బాటిళ్ల లోడ్ తో వెళ్తున్న లారీ ప్రమాదానికి గురైంది. రోడ్డుపై మద్యం బాటిళ్లు పడిపోయాయి. దీంతో వాటిని దక్కించుకునేందుకు మందుబాబు ఎగబడ్డారు.

నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. బుధవారం బీర్ బాటిళ్ల లోడ్ తో వెళ్తున్న లారీ ప్రమాదానికి గురైంది. రోడ్డుపై మద్యం బాటిళ్లు పడిపోయాయి. దీంతో వాటిని దక్కించుకునేందుకు మందుబాబు ఎగబడ్డారు.

బీర్లతో వెళ్తున్న లారీ బోల్తా.. పండగ చేసుకున్న మందుబాబులు! ఎక్కడంటే..?

నిత్యం ఏదో ఒక ప్రాతంలో ప్రమాదాలు అనేవి జరుగుతుంటాయి. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, మద్యం మత్తులో వాహనం నడపడం వంటి కారణాలతో ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది అమాయకులు ప్రాణాలు  కోల్పోతుంటారు. మరెందరో తీవ్రంగా గాయపడి నరకయాతన అనుభవిస్తారు. అలానే మరికొన్ని ఘటనల్లో వివిధ సరకులతో వెళ్తున్న వాహనాలు  ప్రమాదానికి గురవుతుంటాయి. దీంతో స్థానికంగా ఉండే జనాలు వాటి కోసం ఎగబడుతుంటారు. తాజాగా ఓ బీర్ల బాటిళ్లతో వెళ్తున్న లారీ ప్రమాదానికి గురైంది. దీంతో నడిరోడ్డుపై సీసాలు పడిపోయాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే…

యాదాద్రి భువనగిరి జిల్లాలో బీరు బాటిళ్లతో వెళ్తున్న లారీ ఘోర రోడ్డు ప్రమాదాని గురైంది. చౌటుప్పల్ మున్సిపల్ లోని లక్కారం స్టేజి దగ్గర విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఓ లారీ ఆగి ఉంది. ఈ క్రమంలోనే  వేగంగా మరో లారీ వచ్చి.. ఈ ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక్కరు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. ఇక ఈ రెండు లారీల్లో ఒకదాంట్లో ఉల్లిగడ్డ లోడు… మరో దాంట్లో బీర్లతో కూడిన  ఉన్నాయి. ఇక ఈ ప్రమాదం జరగడంతో రెండు లారీల్లోని సరుకంతా రోడ్డు పాలైంది.

ఇక రోడ్డుపై బీర్ల బాటిళ్లు, ఉల్లిగడ్డలు పడిపోయిన సమాచారం స్థానిక ప్రజలకు తెలిసింది. దీంతో వాటిని తీసుకునేందుకు జనం భారీగా ఎగబడ్డారు. ఇక మందుబాబులు అయితే బీరు బాటిళ్లను తీసుకునేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే ఆ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.  అక్కడ చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ జాం ను క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. మొత్తంగా ఇలా వివిధ రకాల సరుకులతో వెళ్తున్న వాహనాలు ప్రమాదానికి గురైనప్పుడు చాలా మంది జనం ఎగబడుతున్నారు.

కొన్ని సార్లు పెట్రోల్, డీజిల్ వంటివాటి కోసం ఎగబడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. గతంలో ఓ ప్రాంతంలో పెట్రోల్ ట్యాంకర్ ప్రమాదానికి గురైంది. ఈ సమయంలో అందులోని పెట్రోల్ ను తీసుకెళ్లేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే అక్కడ మంటలు చెలరేగి..దాదాపు 150 మంది చనిపోయారు. అలానే మరో ప్రాంతంలో డిజిల్ ట్యాంకర్ బోల్తా పడి..జరిగిన ప్రమాదాంలో 42 మంది చనిపోయారు. ఇది ఇలాంటే ఏదైమా ప్రమాదాం జరిగినప్పుడు సాయం చేయడం  మానేసి.. అక్కడ పడిపోయిన సరుకుల కోసం కొందరు ఎగబడటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.