iDreamPost
android-app
ios-app

ఎన్నో ఆశలతో అమెరికాకు.. గమ్యం చేరేలోపే సజీవ దహనం

ఎన్నో ఆశలతో, ఆశయాలతో అమెరికాకు వెళ్లారు. ఒక్కొక్కరికి ఒక్కో కల. ఈ నలుగురు ఓ చోటుకు పయనం అయ్యారు. కానీ గమ్యం చేరేలోపే సజీవ దహనానికి గురయ్యారు. వీరి మరణవార్త ఇండియాలోని కుటుంబ సభ్యులకు తెలిసి కన్నీరుమున్నీరు అవుతున్నారు.

ఎన్నో ఆశలతో, ఆశయాలతో అమెరికాకు వెళ్లారు. ఒక్కొక్కరికి ఒక్కో కల. ఈ నలుగురు ఓ చోటుకు పయనం అయ్యారు. కానీ గమ్యం చేరేలోపే సజీవ దహనానికి గురయ్యారు. వీరి మరణవార్త ఇండియాలోని కుటుంబ సభ్యులకు తెలిసి కన్నీరుమున్నీరు అవుతున్నారు.

ఎన్నో ఆశలతో అమెరికాకు.. గమ్యం చేరేలోపే సజీవ దహనం

ఉన్నత చదువులు, ఉద్యోగాలు అంటూ అమెరికా వెళుతున్నారు ఇండియన్స్. కానీ ఊహించని విధంగా ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా యుఎస్‌లోని టెక్సాస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువతితో సహా నలుగురు దుర్మరణం చెందారు. ఇందులో ముగ్గురు హైదరాబాద్ వాసులు కావడం విచారకరం. కార్ పూలింగ్ యాప్ ద్వారా కారులో ఈ నలుగురు ప్రయాణిస్తుండగా ఈ యాక్సిడెంట్ సంభవించింది. శుక్రవారం అర్కాన్సాస్‌లోని బెంటన్‌విల్లేకు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే వారు ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. దీంతో సజీవ దహనం అయ్యారు ఈ నలుగురు. మృతులను తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్, ఆర్యన్ రఘునాథ్, ఫరూక్ షేక్, లోకేష్ పాలచర్లగా గుర్తించారు.

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్న మాక్స్ అగ్రి జెనెటిక్స్ లిమిటెడ్ సంస్థ యజమాని సుభాష్ చంద్ర రెడ్డి కుమారుడే ఆర్యన్ రఘనాథ్. వీరి స్వస్థలం కర్ణాటకలోని రాయచూర్ కాగా.. హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడింది వీరి కుటుంబం. ఆర్యన్ కోయంబత్తూరులోని అమృత విశ్వ విద్యా పీఠ్‌లో ఇంజనీరింగ్ చేసి, ఈ ఏడాది మేలోనే టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేసేందుకు వెళ్లాడు. అతని స్నేహితుడు ఫరూఖ్‌తో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్నారు. లోకేశ్ పాలచర్ల తన భార్యను కలిసేందుకు బెంటన్ విల్లేకే వెళుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో గ్రాడ్యుయేట్ చేస్తున్న దర్శిని వాసుదేవన్ బెంటన్‌విల్లేలో ఉన్న తన మామ వద్దకు వెళ్లేందుకు కారు ఎక్కింది. అంతలో జరిగిన ప్రమాదంలో ఈ నలుగుర్ని బలి తీసుకుంది.

ఎంఎస్ అయ్యాక తిరిగి వచ్చేయాలని ఆర్యన్ పేరెంట్స్ కోరితే.. రెండేళ్లు ఉద్యోగం చేసి వస్తానని చెప్పాడు. కానీ ఇంతలోనే విగత జీవిగా మారడంతో కన్నీరుమున్నీరు అవుతున్నారు తల్లిదండ్రులు. ఐదు వాహనాలు ఒకదానితో ఒకటి అతివేగంగా ఢీకొన్నట్లు తెలుస్తుంది. వీరు ప్రయాణిస్తున్న కారును ట్రక్కు బలంగా ఢీ కొట్టడంతో మంటలు చెలరేగి ప్రయాణీకులంతా సజీవ దహనం అయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంగా కాలిపోగా.. కార్ పూలింగ్ యాప్ ద్వారా వీరి వివరాలు సేకరించారు స్థానిక పోలీసులు. ఇక దర్శిని వాసుదేవన్ తల్లిదండ్రులు.. కారు ప్రమాదానికి గురి కావడానికి కొన్ని నిమిషాల ముందే కూతురితో మాట్లాడారు. అంతలోనే ఆమె మరణవార్త ఇంటికి చేరింది. మృతదేహాలను ఇండియాకు రప్పించేందుకు సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు మృతుల పేరెంట్స్.