iDreamPost
android-app
ios-app

తండ్రికి ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి వెళుతుంటే.. అతడి కళ్లెదుటే

తండ్రికి కూతరంటే విపరీతమైన ఇష్టం. కూతురికి కూడా నాన్న అంటే వల్లమాలిన ప్రేమ. తండ్రి అనారోగ్యంతో బాధపడుతుంటే.. ఆసుపత్రికి తీసుకు వెళ్లేందుకు అతడి వెంట నడిచింది. ఇదే ఆమెకు శాపమైంది.

తండ్రికి కూతరంటే విపరీతమైన ఇష్టం. కూతురికి కూడా నాన్న అంటే వల్లమాలిన ప్రేమ. తండ్రి అనారోగ్యంతో బాధపడుతుంటే.. ఆసుపత్రికి తీసుకు వెళ్లేందుకు అతడి వెంట నడిచింది. ఇదే ఆమెకు శాపమైంది.

తండ్రికి ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి వెళుతుంటే.. అతడి కళ్లెదుటే

కొడుక్కి తల్లి మీద ప్రేమ ఉంటే.. కూతురికి తండ్రితో ఎఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. తండ్రి పట్ల గౌరవం, భయం కలిగి ఉన్నప్పటికీ.. ప్రతి విషయాన్ని షేర్ చేసుకుని అతడ్ని స్నేహితుడిలా ఫీల్ అవుతుంటుంది. అతడు పని నుండి తొందరగా రాకపోయినా లేదంటే ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చిన తల్లడిల్లిపోతుంది కూతురు. అమ్మలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇదిగో ఈ కూతురు కూడా తండ్రికి తల్లిలా మారింది. నాన్నకు బాగోలేదని తెలిసి.. ఆసుపత్రికి తీసుకెళ్లింది. తండ్రిగా తోడుగా వెళ్లినందుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. తండ్రి కళ్లెదుటే కన్న కూతురు దుర్మరణానికి గురైంది. ఈ హృదయ విదారక ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెంగిచెర్లకు చెందిన మేడా శంకర్‌రావు స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్నాడు. ఆయనకు ప్రసన్న అనే కూతురు ఉంది. ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో సోమవారం సోమాజిగూడలోని ఏషియన్‌ గ్యాస్ట్రో ఆసుపత్రిలో ఎండోస్కోపీ చేయించుకునేందుకు శంకర్‌రావు బయలు దేరాడు. కూతురు కూడా వెంట వస్తానంటే తీసుకెళ్లాడు. ఇదే ఆమె పాలిట శాపమైంది. తన కూతురు ప్రసన్నను తీసుకుని బైక్‌పై బయలు దేరగా.. ఉదయం 7:45 ప్రాంతంలో గ్రీన్‌ల్యాండ్స్‌ కూడలి వద్దకు చేరుకోగానే వీరి వాహనాన్ని వెనుక నుండి అతి వేగంగా వచ్చిన టెంపో వాహనం బలంగా ఢీ కొట్టింది. దీంతో శంకర్‌రావు, ప్రసన్న ఇద్దరూ వాహనం మీద నుండి కింద పడిపోయారు.

శంకర్ రావు హెల్మెట్ ధరించడంతో స్వల్పగాయాలయ్యాయి. అయితే కూతురు ప్రసన్నకు మాత్రం తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే కన్నుమూసింది. తండ్రి కళ్లెదుటే కూతురు ప్రసన్న మృతి చెందింది. కూతుర్ని అలా చూసి తండ్రి కన్నీరుమున్నీరు అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. డ్రైవర్‌ సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మహబూబ్‌నగర్‌ జిల్లా, కొల్లాపూర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రికి తండ్రి తీసుకెళ్లేందుకు వెళ్లిన కూతురు విగత జీవిగా తిరిగి రావడంతో శోక సంద్రంలో మునిగి పోయింది ప్రసన్న కుటుంబం.