iDreamPost
android-app
ios-app

వీడియో: సజ్జనార్ సీరియస్.. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలు తీస్తారా అంటూ..

  • Published Jul 02, 2024 | 9:14 PM Updated Updated Jul 02, 2024 | 9:14 PM

Road Accident Vide: ఇటీవల దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. కేవలం డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

Road Accident Vide: ఇటీవల దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. కేవలం డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

వీడియో: సజ్జనార్ సీరియస్.. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలు తీస్తారా అంటూ..

దేశంలో ప్రతి నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు పదుల సంఖ్యల్లో జరుగుతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లినవారు క్షేమంగా ఇంటికి చేరుతారన్న నమ్మకం లేకుండా పోతుంది. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అతి వేగం, నిద్రలేమి, అవగాహన లేమి, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినం చేస్తున్నా.. ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. తాజాగా నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తున్న వారిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియో షేర్ చేశారు. వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జనార్ షేర్ చేసిన వీడియోలో రోడ్డు పై వెళ్తున్న పాదాచుడిపై వేగంగా కారు దూసుకు వచ్చి ఢీ కొట్టింది. అలా ఢీ కొట్టి కనీసం మానవత్వం లేకుండా తనకేం పట్టనట్టుగా వెళ్లిపాయాడు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఇవాళ జరిగిన ఈ ప్రమాదంలో ఒక వృద్దుడు మృతి చెందాడు. రోడ్లపైకి వాహనాలతో వచ్చి ఇష్టనుసారంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి అమాయకుల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? ఇది ఎంత వరకు సమంజసం? అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన రహదారుల్లో పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని చెబుతున్నా కొంతమంది డ్రైవర్లు ఆ నిబంధనలు తుంగలో తొక్కేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్లు విధిస్తున్నారు. అయినప్పకీ వాహనదారుల్లో మార్పు రావడం లేదు. తాజాగా ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ నిజంగా మనుషుల్లో మానవత్వం పూర్తిగా నశించిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.