iDreamPost

వీడియో: బైకర్ పై ఆవు దాడి.. బస్సు కింద పడి వ్యక్తి మృతి!

ఓ రోడ్డు ప్రమాదా ఘటన ఆశ్చర్యంతో పాటు కన్నీళ్లు తెప్పిస్తుంది. ఓ వ్యక్తి..తన పని మీద బైక్ పై వెళ్తుండగా.. ఆవు రూపంలో మృత్యువు వచ్చింది. దీంతో బస్సు కింద పడి.. ఆ వ్యక్తి మృతి చెందాడు.

ఓ రోడ్డు ప్రమాదా ఘటన ఆశ్చర్యంతో పాటు కన్నీళ్లు తెప్పిస్తుంది. ఓ వ్యక్తి..తన పని మీద బైక్ పై వెళ్తుండగా.. ఆవు రూపంలో మృత్యువు వచ్చింది. దీంతో బస్సు కింద పడి.. ఆ వ్యక్తి మృతి చెందాడు.

వీడియో: బైకర్ పై ఆవు దాడి.. బస్సు కింద పడి వ్యక్తి మృతి!

ప్రమాదం అనేది ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవ్వరం చెప్పలేము. కొందరు వారి పాటికి వాళ్లు వెళ్తుంటే..మృత్యువు వచ్చి..హాయి చెబుతుంది. అలానే కొన్ని రోడ్డు ప్రమాదాలు చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. తాజాగా ఓ రోడ్డు ప్రమాదా ఘటన ఆశ్చర్యంతో పాటు కన్నీళ్లు తెప్పిస్తుంది. ఓ వ్యక్తి..తన పని మీద బైక్ పై వెళ్తుండగా.. ఆవు రూపంలో మృత్యువు వచ్చింది. దీంతో బస్సు కింద పడి.. ఆ వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

తమిళనాడులోని తిరునెల్వేలి ప్రాంతంలో ఘోరం చోటుచేసుకుంది. రెండు ఆవుల మధ్య జరిగిన ఘర్షణ ఓ వ్యక్తి మృతికి కారణమైంది. తిరునెల్వేలిలోని ఓ ప్రాంతంలో రోడ్డుకి ఇరువైపులా వాహనాలు తిరుగుతున్నాయి. ఎదురుగా బస్సు వస్తుండగా,  ఒక ద్విచక్ర వాహనం అటు ఇటు వెళ్తోంది. అదే సమయంలో కాస్తా దూరంలో రెండు ఆవులు పొట్లాడుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఒక ఆవు మరో ఆవును కుమ్మేసింది. దీంతో ఆ ఆవు బైక్ పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది.

దాంతో అతడు  కిందపడిపోవడంతోనే అంతలోనే అటుగా వచ్చిన బస్సు చక్రాలు అతనిపై నుంచి వెళ్లాయి. దీంతో  58 ఏళ్ల వేలాయ రాజ్ అనే ఆ బైక్ రైడర్ అక్కడికక్కడే మరణించాడు. మేజిస్ట్రేట్‌ కోర్టులో వేలాయుధరాజ్‌ విధులు నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగానే శనివారం ఉదయం కూడా  కోర్టులు బయలు దేరాడు. ఈ క్రమంలోనే  ఆవుల రూపంలో మృత్యవు అతడిని పలకరించింది. ఈ ఘటనతో వేలాయురాజు కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

గతంలో కూడా ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. అతివేగంగా వచ్చిన ఓ కారు..డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.  ఈఘటన కూడా తమిళనాడు రాష్ట్రంలోనే చోటుచేసుకుంది. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం తాగి వాహనం నడపడంతో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంది. ఇలా మూగజీవాల కారణంగా కూడా మరికొన్ని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.  మరి.. ఇలాంటి రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి