P Krishna
Mr Telangana Mohd Sohail: ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే.
Mr Telangana Mohd Sohail: ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే.
P Krishna
రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు కన్నుమూస్తున్నారు.నిర్లక్ష్యపు డ్రైవింగ్, అవగాహన లేకుండా వాహనాలు నడపడం, మద్యం మత్తులో డ్రైవ్ చేయడం, నిద్ర లేమి ఇలా ఎన్నో కారణాల వల్ల నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేస్తున్నా డ్రైవర్లలో మార్పు రావడం లేదని అధికారులు అంటున్నారు. తెలంగాణలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బాడీ బిల్డర్, మిస్టర్ తెలంగాణ విజేత కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో సిద్దిపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాడీ బిల్డర్, మిస్టర్ తెలంగాణ విజేత మహ్మద్ సోహైల్ (23) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మహ్మద్ సోహైల్ అతని స్నేహితుడితో కలిసి జూన్ 29వ తేదీ సిద్దిపేట నుంచి మిరిదొడ్డి వైపు బైక్ పై వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సొహైల్ తలకు తీవ్ర గాయం అయ్యింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఓ ప్రైవేల్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. అతన్ని బ్రతికించేందుకు వైద్యులు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ చికిత్స పొందుతూ కన్నుమూశాడు సోహైల్.
మహ్మద్ సోహైల్ తన కెరీర్ లో జిల్లా, రాష్ట్ర, సౌత్ ఇండియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ లను సొంతం చేసుకున్నాడు. ‘మిస్టర్ తెలంగాణ’ ఛాంపియన్ షిప్ లో విజేతగా నిలిచిన మహ్మద్ సోహైల్ కి ఎంతో బంగారు భవిష్యత్ ఉండగా.. అతి చిన్నవయసులోనే మరణించడం అందరినీ కన్నీటి పర్యంతం చేస్తుంది. సోహైల్ మరణించడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. స్థానికులు, సన్నిహితులు అతడి గురించి మాట్లడుతూ.. సోహైల్ అందరితో ఎంతో సంతోషంగా ఉండేవాడు.. ఎవరికి ఏ కష్టమొచ్చినా తాను ముందు ఉండేవాడు. బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు కైవసం చేసుకున్నాడు. బంగారం లాంటి భవిష్యత్ ఉన్న సొహైల్ ఇలా అర్థాంతరంగా కన్నుమూయడం తీరని లోటు’ అని కన్నీరు పెట్టుకున్నారు.