iDreamPost
android-app
ios-app

బస్‌లో డోర్ వద్ద నిల్చుంటున్నారా? ఈ వీడియో చూస్తే..ఆ పని చేయరు!

  • Published Jul 04, 2024 | 5:12 PM Updated Updated Jul 04, 2024 | 5:12 PM

ప్రయాణాలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బస్సులో జర్నీ చేసే మహిళలు డోర్ దగ్గర ఉన్న సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి లేకుంటే ప్రాణాలే పోతాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

ప్రయాణాలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బస్సులో జర్నీ చేసే మహిళలు డోర్ దగ్గర ఉన్న సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి లేకుంటే ప్రాణాలే పోతాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

  • Published Jul 04, 2024 | 5:12 PMUpdated Jul 04, 2024 | 5:12 PM
బస్‌లో డోర్ వద్ద నిల్చుంటున్నారా? ఈ వీడియో చూస్తే..ఆ పని చేయరు!

నిత్యం ఎంతో మంది బస్సులో ప్రయాణాలు చేస్తుంటారు. అయితే చాలా మంది లోపలకి వెళ్లి నిల్చుంటే..కొందరు మాత్రం బస్ డోర్ వద్దనే ఉంటారు. అంతేకాక మరికొందరు బస్సులో డోర్ కి సమీపంలో ఉన్న సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆ విషయాన్ని మర్చిపోయి కొందరు ఎంతో నిర్లక్ష్యంగా ఉంటారు. అలా బస్ లో డోర్ వద్ద నిల్చున్న ఓ మహిళ..బస్ టర్నింగ్ తీసుకోవడంతో ఒక్కసారిగా కిందపడిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రయాణాలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బస్సులో జర్నీ చేసే మహిళలు డోర్ దగ్గర ఉన్న సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి లేకుంటే.. ప్రమాదాల బారిన పడుతుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించి భీభత్సకరమైన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఓ వీడియోలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ..రోడ్డుపై పడిపోయి దారుణంగా గాయాలపాలైంది.

తమిళనాడులోని రాశిపురం ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  రాశిపురం ప్రాంతంలో ఓ బస్సులో చాలా మంది ప్రయాణిస్తున్నారు. అందులో ఓ మహిళ డోర్ కి సమీపంలో నిలబడింది. అయితే ఓ ప్రాంతం వద్దకు వచ్చిన తరువాత బస్సు వేగంగా టర్నింగ్ తీసుకుంటుండగా.. ఫుట్ మెట్ల నుంచి ఆ మహిళ కిందపడిపోయింది. బస్సు ముందుకు వెళ్లిపోగా.. ఆ మహిళ రోడ్డుపై పల్టీలు కొట్టింది. వెంటనే గమనించిన బస్సులోనే ప్రయాణికులు డ్రైవర్ కు సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. బస్సు అలానే చాలా దూరం పోయాక ఆగింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ ఘటనలో మహిళకు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. కొందరు డ్రైవర్ ను తిడుతుంటే, మరికొందరు మహిళ జాగ్రత్తగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా ఓసారి ఇలానే జరిగింది. పుట్ బోర్డు దగ్గర దిగేందుకు సిద్ధంగా ఉన్న ఓ యువతి బస్ బ్రేక్ వేయడంతోమెట్లు నుంచి కిందపడబోయింది. అయితే వెంటనే అప్రమత్తమైన కండెక్టర్ ఆ యువతిని కాపాడాడు. ఆ ఘటనకు  సంబంధించిన  వీడియో వైరల్ కావడంతో ఆ కండెక్టర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. మరి… తాజాగా జరిగిన ఈ బస్ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet