iDreamPost
android-app
ios-app

కేంద్ర మంత్రి కారుకు ప్రమాదం.. ఆయన ఎలా ఉన్నారంటే?

  • Published Jul 20, 2024 | 10:22 PMUpdated Jul 20, 2024 | 10:22 PM

Road Accident: దేశంలో నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరగుతూనే ఉన్నాయి. కేవలం డ్రైవర్లు చేసే తప్పిదాల వల్ల ఎంతోమంది అమాయకులు బలి అవుతున్నారు.

Road Accident: దేశంలో నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరగుతూనే ఉన్నాయి. కేవలం డ్రైవర్లు చేసే తప్పిదాల వల్ల ఎంతోమంది అమాయకులు బలి అవుతున్నారు.

  • Published Jul 20, 2024 | 10:22 PMUpdated Jul 20, 2024 | 10:22 PM
కేంద్ర మంత్రి కారుకు ప్రమాదం.. ఆయన ఎలా ఉన్నారంటే?

ఇటీవల దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సామాన్యులే కాదు సెలబ్రెటీలు, రాజకీయ నేతలు సైతం రోడ్డు ప్రమాదాల్లో గాయపడటం, చనిపోవడం జరుగుతుంది. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం, అతి వేగం ఇతర కారణాల వల్ల నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలు తెచ్చినప్పటికీ ఈ ప్రమాదాలను అరికట్టలేకపోతున్నారు. తాజాగా  కేంద్ర మంత్రి కారు ప్రమాదానికి గురైంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తర్ ప్రదేశ్‌లోని పిలిభిత్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ వాహనానికి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రసాద్ తో పాటు ఆయన కుక్, కేంద్ర మంత్రి జితిన్ కి స్వల్పంగా గాయాలు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన కాన్వాయ్ లోని మరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్యామేజ్ అయ్యింది.. ఆయన క్షేమంగా ఉన్నారు. ఘటన అనంతరం వాహనాన్ని అక్కడే వదిలేసి మరో వాహనంలో కేంద్రమంత్రి కార్యక్రమానికి బయలుదేరారు.

ఈ ఘటన పిలిభిత్ లోని మజోలా-విజ్తి రోడ్డులో బహ్రువా గ్రామంలో జరిగింది. మంత్రి కారుకు  ఎస్కార్ట్ గా ఉన్న కారు హఠాత్తుగా బ్రేకు వేశారు.. దాని వెంట వస్తున్న మంత్రి జితిన్ ప్రసాద్ కారు కూడా సడెన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి మరో కారు వచ్చి బలంగా ఢీ కొట్టింది. దీంతో మంత్రి ప్రయాణిస్తున్న కారు డ్యామేజ్ అయ్యింది. అయితే వెనుక వాహనం స్లోగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. జితిన్ ప్రసాద్ తన కారులో నుంచి బయటకు వచ్చి మరో వాహనంలో వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఆయనకు ప్రమాదం జరగలేదని సిబ్బంది తెలిపారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి