ఫ్యామిలీ మ్యాన్ గా కుటుంబ ప్రేక్షకులకు ఎక్కువ దగ్గరైన న్యాచురల్ స్టార్ నాని తన స్టయిల్ ని పూర్తిగా పక్కనపెట్టి చేసిన దసరా మార్చి 30న విడుదల కానుంది. నిన్న సాయంత్రం ఒక్కో భాషనుంచి ఒక్కో సెలబ్రిటీ టీజర్ లాంచ్ చేశారు. తెలుగు వెర్షన్ బాధ్యతను రాజమౌళి తీసుకున్నారు. బొగ్గు గనుల మధ్య ఉండే ఒక చిన్న ఊరిలో జరిగే సంఘటనలు, తమ జీవితాలను దెబ్బ కొట్టిన దుర్మార్గుల భరతం పట్టేందుకు పూనుకున్న ఆవేశభరితుడైన ఓ యువకుడి […]
గత ఏడాది హీరోగా ఒక యావరేజ్ నిర్మాతగా ఒక సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న న్యాచురల్ స్టార్ నాని తన కొత్త సినిమా దసరా చివరి దశ పనుల్లో ఉన్నాడు. కెరీర్ లో మొదటిసారి ఊరమస్ గెటప్ లో బొగ్గుగనుల నేపథ్యంలో చేస్తున్న డిఫరెంట్ స్టోరీగా ఇప్పటికే దీని మీద బోలెడు అంచనాలున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్. 2022లో ఎన్నో ఆశలు పెట్టుకున్న అంటే సుందరానికి ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఎంటర్ టైన్మెంట్ బాగానే ఉన్నప్పటికీ లెన్త్ […]
న్యాచురల్ స్టార్ నాని హీరోగా ఊర మాస్ గెటప్ లో రూపొందుతున్న దసరా షూటింగ్ కి బ్రేక్ పడినట్టు ఫిలిం నగర్ టాక్. బడ్జెట్ కంట్రోల్ తప్పిపోవడంతో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు నిర్మాతలు చిన్న విరామం ఇచ్చారట. కేవలం రెండు పాటలు ఒక యాక్షన్ ఎపిసోడ్ కే అయిదు కోట్ల దాకా ఖర్చయిపోవడంతో నెక్స్ట్ ఇంకెంత అవుతుందోననే టెన్షన్ మొదలైనట్టు సమాచారం. అధికారికంగా బయటికి చెప్పలేదు కానీ దసరా చిత్రీకరణ ఆగిన మాట వాస్తవం. అంటే సుందరానికి […]
నాని నటించిన “అంటే సుందరానికి” సినిమాపై అందరూ చెప్తున్న ప్రధాన కంప్లైంట్ ఒక్కటే.. అదే సినిమా రన్ టైమ్. సినిమాను సాగదీశారు అంటూ దాదాపు పదిమంది ప్రేక్షకుల్లో 7-8 మంది ప్రేక్షకులు చెప్తున్నారు. దీనిపై దర్శకుడు వివేక్ ఆత్రేయ తాజాగా స్పందించారు. సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ వేదికగా వివేక్ ఈ అంశంపై మాట్లాడారు. రన్ టైమ్ ను తగ్గించే ఆలోచనే లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను ఇంత నిడివిలోనే చెప్పాలని బృందమంతా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. […]
ఇటీవలే అంటే సుందరానికితో ప్రేక్షకులను పలకరించిన నాని నెక్స్ట్ ఊర మాస్ అవతారంతో దసరాలో అలరించబోతున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో నాని పుష్ప టైపు హెయిర్ స్టైల్ తో చాలా డిఫరెంట్ గా కనిపించనున్నాడు. అంటే ప్రమోషన్ల కోసం బ్రేక్ తీసుకున్న న్యాచురల్ స్టార్ త్వరలోనే దసరా కొనసాగించబోతున్నాడు. దీని తర్వాత ఏ సినిమాలు చేయబోతన్నాడన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. వి, టక్ జగదీశ్ లు ఓటిటి […]
నిన్న విడుదలైన అంటే సుందరానికి డీసెంట్ రిపోర్ట్స్ వచ్చాయి. ఓపెనింగ్స్ భీభత్సంగా రాలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాని మార్కెట్ కు తగ్గట్టే ఉన్నాయి. కాకపోతే చాలా చోట్ల ఎంసిఏని ఫస్ట్ డే దాటలేకపోవడం మైనస్సే. ఓవర్సీస్ లోనూ ప్రీమియర్ కలెక్షన్ మేజర్ కన్నా తక్కువే ఉంది. ఈ నేపథ్యంలో సుందరానికి మౌత్ టాక్ చాలా కీలకంగా మారనుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఇచ్చే రివ్యూలు రాబోయే రెండు మూడు రోజులను ప్రభావితం చేయబోతున్నాయి. బాగానే ఉందంటూనే […]
నేచురల్ స్టార్ నాని – మళయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ జంటగా వస్తోన్న సినిమా ‘అంటే సుందరానికీ’. నజ్రియా ఈ సినిమా ద్వారా డైరెక్ట్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంటే సుందరానికీ’ సినిమా రేపు (జూన్ 10) థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రం ప్రమోషన్స్ వేగం పెంచారు. అందులో భాగంగా.. సినిమా నుంచి ఒక సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఆ సాంగ్ కు నజ్రియా-నాని […]
https://youtu.be/
https://youtu.be/