iDreamPost
android-app
ios-app

నాని సరిపోదా శనివారానికి తలనొప్పిగా మారబోతున్న విజయ్ గోట్ మూవీ!

  • Published Aug 08, 2024 | 9:15 PM Updated Updated Aug 08, 2024 | 9:15 PM

Nani May Face Some Serious Fight From Vijay: న్యాచురల్ స్టార్ నాని- వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సరిపోదా శనివారం సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో విడుదలకాబోతోంది. అయితే ఇప్పుడు నానికి కాస్త తలనొప్పి వచ్చే ఆస్కారం ఉంది అంటున్నారు.

Nani May Face Some Serious Fight From Vijay: న్యాచురల్ స్టార్ నాని- వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సరిపోదా శనివారం సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో విడుదలకాబోతోంది. అయితే ఇప్పుడు నానికి కాస్త తలనొప్పి వచ్చే ఆస్కారం ఉంది అంటున్నారు.

  • Published Aug 08, 2024 | 9:15 PMUpdated Aug 08, 2024 | 9:15 PM
నాని సరిపోదా శనివారానికి తలనొప్పిగా మారబోతున్న విజయ్ గోట్ మూవీ!

న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్టు సరిపోదా శనివారం సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయిపోయాడు. ఈ మూవీ నుంచి వచ్చిన అన్ని అప్ డేట్స్ ప్రేక్షకుల్లో జోష్ నింపిన విషయం తెలిసిందే. పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అన్నీ మూవీపై అంచనాలను రెట్టింపు చేసేశాయి. పైగా వివేక్ ఆత్రేయ కంప్లీట్ మాస్ యాంగిల్ లో నానిని చూపించబోతున్నాడు అనే విషయం క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాకి ఒక్క తెలుగు స్టేట్స్ లోనే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో మంచి మార్కెట్ క్రియేట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అయితే ఇప్పుడు సరిపోదా శనివారం టీమ్ కు ఒక తలనొప్పి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు.

నాని స్టోరీ సెలక్షన్, యాక్షన్ కు తెలుగు రాష్ట్రాల్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. చాలా తక్కువ సమయంలోనే మినిమం గ్యారెంటీ హీరోగా మార్కులు కొట్టేశాడు. దసరాతో ఫుల్ ఆన్ మాస్, రగ్గుడ్ క్యారెక్టర్స్ అయినా కూడా ఈజీగా చేసేస్తాడు అనే సర్టిఫికేట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు సరిపోదా శనివారంలో క్లాస్ లుక్స్ తో ఫుల్ మాస్ క్యారెక్టర్ తో రాబోతున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించి దళపతి విజయ్ నుంచి కాస్త తలనొప్పి ఉండే పరిస్థితి కనిపిస్తోంది. విజయ్ తన గోట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ చెప్పిన సమయానికి రాదు అనే అంతా భావించారు. సీజీ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో కాస్త ఆలస్యం అవుతుందనే టాక్ వచ్చింది. కానీ, ఇప్పుడు చెప్పిన సమయానికి వచ్చేందుకు రెడీగా ఉన్నారంట.

నాని సరిపోదా శనివారం చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెప్టెంబర్ 5న దళపతి విజయ్ గోట్ చిత్రం విడుదలవుతుంది. ఈ నేపథ్యంలోనే నానికి కాస్త రిస్క్ పొంచి ఉంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రిస్క్ ఏంటంటే.. సరిపోదా శనివారం చిత్రానికి తమిళ్ లో కూడా మంచి మార్కెట్ ఏర్పడుతోంది. ఎస్జే సూర్య విలన్ పాత్రలో కనిపిస్తుండటంతో అక్కడ కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. మినిమం 2 వారాలకు ఢోకా లేదు అనుకున్నారు. కానీ, ఇప్పుడు విజయ్ గనుక చెప్పిన సమయానికి వస్తే.. నానికి డ్యామేజ్ అవ్వకమానదు అంటున్నారు. పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాలి అంటే కచ్చితంగా అన్ని భాషల్లో మంచి కలెక్షన్స్ వస్తేనే ఆ ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ కథ, టేకింగ్ మీద సరిపోదా శనివారం టీమ్ నమ్మకంగా ఉంది. కథలో దమ్ముంటే ఎన్ని చిత్రాలు పోటీకి వచ్చినా కూడా తట్టుకుని నిలబడచ్చు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş