iDreamPost
android-app
ios-app

మంచి కలయికతో న్యాచురల్ స్టార్ 30

  • Published Jan 02, 2023 | 6:27 PM Updated Updated Jan 02, 2023 | 6:27 PM
  • Published Jan 02, 2023 | 6:27 PMUpdated Jan 02, 2023 | 6:27 PM
మంచి కలయికతో న్యాచురల్ స్టార్ 30

గత ఏడాది హీరోగా ఒక యావరేజ్ నిర్మాతగా ఒక సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న న్యాచురల్ స్టార్ నాని తన కొత్త సినిమా దసరా చివరి దశ పనుల్లో ఉన్నాడు. కెరీర్ లో మొదటిసారి ఊరమస్ గెటప్ లో బొగ్గుగనుల నేపథ్యంలో చేస్తున్న డిఫరెంట్ స్టోరీగా ఇప్పటికే దీని మీద బోలెడు అంచనాలున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్. 2022లో ఎన్నో ఆశలు పెట్టుకున్న అంటే సుందరానికి ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఎంటర్ టైన్మెంట్ బాగానే ఉన్నప్పటికీ లెన్త్ విషయంలో తలెత్తిన ఇబ్బంది వల్ల జనానికి అందులో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కాన్సెప్ట్ అంతగా కనెక్ట్ కాలేదు. ఓటిటిటిలో మాత్రం భారీగా చూశారు. ప్రొడ్యూసర్ గా హిట్ 2 ఇచ్చిన ఘనవిజయం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

ఇప్పుడు 30వ సినిమా కోసం మరో మంచి కాంబినేషన్ సెట్ చేసుకున్నాడు. శౌర్యున్ ని దర్శకుడిగా పరిచయం చేస్తున్న ఈ మూవీ తాలూకు అప్ డేట్ ని చిన్న వీడియో రూపంలో ఇచ్చాడు. పాప సెంటిమెంట్ ఉంటుందని స్పష్టంగా చెప్పేశారు. కూతురి విష్ లిస్ట్ లో కోరికలు తీర్చడానికి తండ్రి దేనికైనా సిద్ధపడే ఒక ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో ఈ ఎంటర్ టైనర్ ఉంటుందని సమాచారం. పాపతో నాని సంభాషణ ఆ కోణంలోనే సాగింది. సీతారామంలో అందరి దృష్టిలో మృణాల్ ఠాకూర్ చేస్తున్న సినిమా ఇదే. మలయాళంలో హృదయం ద్వారా పేరు తెచ్చుకున్న హేశం అబ్దుల్ వాహద్ సంగీతం అందిస్తున్నాడు. విజయ్ దేవరకొండ ఖుషి తర్వాత ఇది రెండో మూవీ

నాని 31గా హిట్ ది థర్డ్ కేస్ ఉంటుందా లేదా అనేది ఇప్పట్లో తేలడం కష్టమే. ఎందుకంటే దర్శకుడు శైలేష్ కొలను వెంకటేష్ కి కమిట్ అయ్యాడు. 75వ మూవీ కాబట్టి సురేష్ సంస్థ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించే ప్లాన్ లో ఉంది. పైగా విదేశాల్లో కొంత భాగం షూట్ చేయబోతున్నారు . ప్రస్తుతం స్క్రిప్ట్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఎంతలేదన్నా ఇది రిలీజవ్వడానికి ఏడాది దాకా టైం పట్టొచ్చు. సో హిట్ 3 చేయాలంటే 2024 రావాల్సిందే. అప్పటిదాకా నాని వెయిట్ చేయడం కష్టం కాబట్టి ఈలోగా రెండు మూడు సినిమాలు ఈజీగా పూర్తి చేయొచ్చు. జెర్సీ తర్వాత అంత హై ఎమోషన్ ఉన్న సినిమాగా ఈ నాని 30 గురించి ప్రచారం జరుగుతోంది.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş