iDreamPost
android-app
ios-app

ఇండియన్ ఐడల్ సీజన్ 3 తర్వాతి ఎపిసోడ్ కి న్యాచురల్ స్టార్ నాని..

  • Published Aug 09, 2024 | 6:41 PM Updated Updated Aug 09, 2024 | 6:41 PM

Nani As A Guest In Telugu Indian Idol season 3: న్యాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం సినిమాతో ఇంకా కొన్ని రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అందుకే నానీనే నేరుగా ప్రమోషన్స్ లోకి దిగిపోయాడు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి గెస్టుగా వచ్చేశాడు.

Nani As A Guest In Telugu Indian Idol season 3: న్యాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం సినిమాతో ఇంకా కొన్ని రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అందుకే నానీనే నేరుగా ప్రమోషన్స్ లోకి దిగిపోయాడు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి గెస్టుగా వచ్చేశాడు.

  • Published Aug 09, 2024 | 6:41 PMUpdated Aug 09, 2024 | 6:41 PM
ఇండియన్ ఐడల్ సీజన్ 3 తర్వాతి ఎపిసోడ్ కి న్యాచురల్ స్టార్ నాని..

ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లెక్కకు మించి వచ్చేశాయి. అన్నీ భాషలను కలిపేస్తూ.. రకానికో సినిమా విడుదల చేస్తూ కాస్త కన్ఫ్యూజ్ చేస్తూనే ఉన్నారు. కానీ, ప్రముఖ ఓటీటీ ఆహా మాత్రం తెలుగు ప్రేక్షకులను అలరించడంలో ఎక్కడా రాజీ పడటం లేదు. తెలుగు ఆడియన్స్ అభిరుచికి తగినట్లు సినిమాలను తీసుకురావడమే కాకుండా.. వారిని ఆకట్టుకునేలా బెస్ట్ కాన్సెప్ట్స్ తో షోలను కూడా తీసుకొస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇండియన్ ఐడల్ షోని తెలుగులోకి తీసుకురావడమే కాకుండా.. సక్సెస్ ఫుల్ గా మూడో సీజన్ ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ సీజన్ లో ఇంకో సర్ ప్రైజ్ కూడా ప్లాన్ చేశారు. మన న్యాచురల్ స్టార్ నాని ఇండియన్ ఐడల్ సీజన్ 3 షోకి ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నాడు.

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3ని నిర్వాహకులు చాలా యునీక్ గా ముందుకు తీసుకెళ్తున్నారు. టాలెంటెడ్ సింగర్స్ ని ఎంచుకోవడమే కాకుండా.. అంతే యునిక్ గెస్టులను తీసుకొస్తూ తెలుగు ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తున్నారు. ఇటీవలే నేషనల్ క్రష్ రష్మిక ఈ షోలో మెరిసిన విషయం తెలిసిందే. తర్వాత హరీష్ శంకర్- మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సో కూడా పాల్గొన్నారు. ఆ ఎపిసోడ్స్ ఆగస్ట్ 9, 10 తేదీల నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ షోకి గెస్టుగా న్యాచురల్ స్టార్ నాని వచ్చేశాడు. అందుకు సంబంధించి ప్రస్తుతానికి ఫొటోలు మాత్రమే బయటకు వచ్చాయి. త్వరలోనే ఈ ఎపిసోడ్స్ కూడా స్ట్రీమింగ్ కానున్నాయి.

Nani

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాతో తెలుగు ప్రేక్షకులనే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో ఉన్న సినిమా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిపోయాడు. వివేక్ ఆత్రేయతో కలిసి మంచి ఫుల్ ఆన్ మాస్ మూవీతో ఆగస్టు 29న వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్ధమైపోయాడు. ఇప్పటికే సాంగ్స్, టీజర్స్ పేరిట ప్రమోషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు నేరుగా నానీనే యాక్షన్ లోకి దిగేశాడు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి గెస్టుగా వచ్చేశాడు. అందుకు సంబంధించిన షూట్ కూడా జరిగింది. ఇండియన్ ఐడల్ సెట్స్ లో ఉన్న నాని పిక్స్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు.. ఆహాలాంటి మంచి ప్లాట్ ఫామ్ ఎంచుకున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్స్ వచ్చే వారం ప్రసారం అయ్యే అవకాశం ఉంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss