iDreamPost
android-app
ios-app

నాని చేతుల మీదుగా మోసెస్ మాణిక్‌చంద్ పార్ట్-2 టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

  • Published Nov 15, 2024 | 3:42 PM Updated Updated Nov 15, 2024 | 3:42 PM

Moses Manikchand Part- 2 Movie: తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం యంగ్ హీరోల్లో సిద్దు జొన్నలగడ్డ స్టైలే వేరు. డీజే టిల్లు మూవీతో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజాగా సిద్దూ అన్న చైతూ జొన్నలగడ్డ ఓ సినిమాలో నటిస్తున్నాడు.

Moses Manikchand Part- 2 Movie: తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం యంగ్ హీరోల్లో సిద్దు జొన్నలగడ్డ స్టైలే వేరు. డీజే టిల్లు మూవీతో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజాగా సిద్దూ అన్న చైతూ జొన్నలగడ్డ ఓ సినిమాలో నటిస్తున్నాడు.

  • Published Nov 15, 2024 | 3:42 PMUpdated Nov 15, 2024 | 3:42 PM
నాని చేతుల మీదుగా మోసెస్ మాణిక్‌చంద్ పార్ట్-2 టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం యంగ్ హీరోల హవా నడుస్తుంది. డీజే టిల్లు మూవీతో యూత్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ.  తాజాగా సిద్ధు జొన్నలగడ్డ అన్న చైతు జొన్నలగడ్డ హీరోగా మోసెస్ మాణిక్‌చంద్ పార్ట్-2 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  ఆ మధ్య  #MM పార్ట్-2ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చైతూ జొన్నలగడ్డ మూవీ ప్రీ లుక్ రిలీజ్ చేసిన విషయం తెిసిందే. ఈ మూవీలో చైతు ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ను కూడా అందించారు. ఈ చిత్రానికి బొమ్మ బ్లాక్ బస్టర్ ఫేమ్ రాజ్ విరాట్ దర్శకత్వం వహించనున్నారు. గురువారం (నవంబర్ 14) నేచురల్ స్టార్ నాని సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించి, టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

మోసెస్ మాణిక్‌చంద్‌ పార్ట్‌-2 అనే టైటిల్‌తో రాబోతోన్న ఈ చిత్రం డిఫరెంట్‌గా ఉండబోతోందని పోస్టర్‌ను చూస్తేనే తెలుస్తోంది. ఈ పోస్టర్‌లో మద్యం బాటిల్, క్లాప్‌బోర్డ్, అమ్మాయి, వైన్ గ్లాస్ ఇలా అన్నీ కనిపిస్తున్నాయి. పైగా ఈ చిత్ర పోస్టర్‌ను చిల్డ్రన్స్ డే సందర్భంగా రిలీజ్ చేస్తూ.. హ్యాపీ ‘నో చిల్డ్రెన్స్’ డే అని పెట్టారు. దీంతో మరింత ఆసక్తికరంగా మారింది. చైతు జొన్నలగడ్డ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రాజకుర్చీపై రాజసం ఉట్టి పడేలా కూర్చుండగా.. భారీ ఆభరణాలు, స్టైలిష్ హెయిర్, లేత గడ్డం, సన్ గ్లాసెస్‌తో డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు.

ఒంటిపై ఆ టాటూలు పాత్ర తీరు, స్వభావాన్ని సూచించేలా ఉన్నాయి.  ఈ మూవీకి పెట్టిన ట్యాగ్‌లైన్ ‘ఎ రియల్ విలన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దేన్ ఎ ఫేక్ హీరో’ కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉంది. పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతోంది. ఈ ప్రాజెక్ట్‌కి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా, కృతి ప్రసాద్ క్రియేటివ్ ప్రొడ్యూసర్. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş