iDreamPost
android-app
ios-app

ఆ ఇద్దరు దర్శకులతో నాని సినిమాలు

  • Published Jun 13, 2022 | 3:38 PM Updated Updated Jun 13, 2022 | 3:38 PM
  • Published Jun 13, 2022 | 3:38 PMUpdated Jun 13, 2022 | 3:38 PM
ఆ ఇద్దరు దర్శకులతో నాని సినిమాలు

ఇటీవలే అంటే సుందరానికితో ప్రేక్షకులను పలకరించిన నాని నెక్స్ట్ ఊర మాస్ అవతారంతో దసరాలో అలరించబోతున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో నాని పుష్ప టైపు హెయిర్ స్టైల్ తో చాలా డిఫరెంట్ గా కనిపించనున్నాడు. అంటే ప్రమోషన్ల కోసం బ్రేక్ తీసుకున్న న్యాచురల్ స్టార్ త్వరలోనే దసరా కొనసాగించబోతున్నాడు. దీని తర్వాత ఏ సినిమాలు చేయబోతన్నాడన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. వి, టక్ జగదీశ్ లు ఓటిటి డైరెక్ట్ రిలీజ్ లోనూ తీవ్రంగా నిరాశపరచగా గత డిసెంబర్ లో థియేటర్లలో విడుదలైన శ్యామ్ సింగ రాయ్ డీసెంట్ సక్సెస్ ఇచ్చింది. అందుకే ప్లానింగ్ లో జాగ్రత్తగా ఉంటున్నాడు.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం నాని ఇద్దరు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అందులో మొదటి పేరు మేర్లపాక గాంధీ. ఈ కాంబినేషన్ లో గతంలో వచ్చిన కృష్ణార్జున యుద్ధం ఎంత పెద్ద డిజాస్టరో గుర్తే. నాని డ్యూయల్ రోల్ చేసినా లాభం లేకపోయింది. ఇదయ్యాక కొంత గ్యాప్ తీసుకున్న గాంధీ ఏక్ మినీ కథ, నితిన్ మాస్ట్రోలతో మళ్ళీ కం బ్యాక్ అయ్యాడు. అవి ఓటిటిలోనే వచ్చినా పేరు తీసుకొచ్చాయి. ప్రస్తుతం సంతోష్ శోభన్ తో చేస్తున్న మరో మూవీ చివరి దశలో ఉంది. తనకు ఫ్లాప్ ఇచ్చినా సరే మేర్లపాకకు మరో అవకాశం అవకాశం ఇస్తున్నాడంటే అతను చెప్పిన సబ్జెక్టులో ఏదో బలమైన కంటెంట్ ఉండే ఉంటుంది. ఇదింకా ప్రకటించలేదు.

లిస్ట్ లో ఉన్న మరో పేరు వెంకటేష్ మహా. కేరాఫ్ కంచెరపాలంతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన ఈ యువ దర్శకుడు ఆ తర్వాత చేసిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య జస్ట్ పాస్ అయ్యింది. రీమేక్ కావడంతో పెద్దగా ఉపయోగపడలేదు. అంటే సుందరానికిలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించిన వెంకటేష్ మహాకు నాని ఆఫర్ ఇచ్చినట్టు వినికిడి. తను చెప్పిన లైన్ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అఫీషియల్ గా ప్రకటించలేదు కాబట్టి నిర్ధారించలేం కానీ ఆల్మోస్ట్ ఓకే అయినట్టేనని అంటున్నారు.మొత్తానికి సక్సెస్ ఉన్నవాళ్ళతో కాకుండా టాలెంట్ ఆధారంగా నాని తీసుకుంటున్న రిస్కీ నిర్ణయాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో వేచి చూడాలి మరి.

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet