iDreamPost
android-app
ios-app

“సరిపోదా శనివారం” OTT రైట్స్.. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ డీల్!

Saripoda Sanivaaram OTT Deal: న్యాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఈ ఓటీటీ డీల్ మరో ఎత్తుకు తీసుకెళ్లింది.

Saripoda Sanivaaram OTT Deal: న్యాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఈ ఓటీటీ డీల్ మరో ఎత్తుకు తీసుకెళ్లింది.

“సరిపోదా శనివారం” OTT రైట్స్.. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ డీల్!

న్యాచురల్ స్టార్ నాని నుంచి సినిమా వస్తోంది అంటే అంచనాలు నెక్ట్స్ లెవల్లో ఉంటాయి. నాని ఎంచుకునే కథలు ఎంతో కొత్తగా ఉంటాయి. మొదటి నుంచి ఆ డెసిషన్ మేకింగే నానినీ ఎంతో యునీక్ గా నిలబెడుతోంది. ఇటీవల హాయ్ నాన్నతో సూపర్ హిట్టు అందుకున్న నాని.. ఇప్పుడు సరిపోదా శనివారం అంటూ మరో హిట్టును తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అయిపోయాడు. ఈ సినిమా కూడా ఎంతో కొత్తగా ఉండబోతోందని టైటిల్ గ్లింప్స్ చూస్తేనే చెప్పేయచ్చు. టైటిల్ మాత్రమే కాకుండా కథ కూడా ఎంతో కొత్తగా ఉంటుందని గ్లింప్స్ తో ఓ క్లారిటీ ఇచ్చారు. అప్పటి నుంచే ఈ మూవీపై హైప్ పెరిగిపోయింది. ఇప్పుడు ఓటీటీ రైట్స్ ధర తెలిసిన తర్వాత అది ఆకాశాన్ని తాకుతోంది.

న్యాచురల్ స్టార్ నాని- వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన అంటే సుందరానికి ఎంతో మంచి హిట్టుగా నిలిచింది. అందుకే నాని తన 31వ సినిమా అవకాశాన్ని వివేక్ ఆత్రేయ చేతిలో పెట్టాడు. నాని అంచనాలకు తగ్గట్లుగానే ఈ సరిపోదా శనివారం సినిమా టైటిల్ రివీల్ చేసినప్పటి నుంచి ఎక్కడలేని హైప్ ని క్రియేట్ చేసింది. టైటిల్ గ్లింప్స్ చూసిన తర్వాత ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు చెందిన శ్రీవెంకేశ్వర క్రియేషన్స్ బ్యానర్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించి ఇటీవలే అధికారికంగా ప్రకటన కూడా చేశారు. అలాగే అంచనాలను మరింత పెంచుతూ.. సరిపోదా శనివారం చిత్రం ఓటీటీ హక్కులు రికార్డు ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

సరిపోదా శనివారం సినిమా ఓటీటీ రైట్స్ ని ప్రముఖ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఏకంగా రూ.45 కోట్లకు నెట్ ఫ్లిక్స్ నాని- వివేక్ సినిమా హక్కులు కొనుగోలు చేసినట్లు టాక్ నడుస్తోంది. అదే నిజమైతే.. నాని కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ ఓటీటీ డీల్ అవుతుందనే చెప్పాలి. ఇప్పటికే నాని- మృణాళ్ నటించిన హాయ్ నాన్న సినిమా నెట్ ఫ్లిక్స్ లోనే స్ట్రీమ్ అవుతోంది. ఆ మూవీకి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఆ మూవీ ప్రభావం కూడా ఈ సినిమాకి అంత ధర తెచ్చిపెట్టి ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు నాని రీజనల్ హీరో స్థాయి నుంచి నార్త్ లో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు. శ్యామ్ సింగరాయ్ సినిమాకి నానీ యాక్టింగ్ కి ఉత్తరాధిన పెద్దఎత్తున అభిమానులు అయ్యారు. ఇప్పుడు హాయ్ నాన్న సినిమాకి కూడా అదే స్థాయి స్పందన లభించింది. అందుకే నాని మార్కెట్ కూడా రాను రాను పెరుగుతూ పోతోంది. ఇప్పుడు సరిపోదా శనివారంతో అది మరో ఎత్తుకు వెళ్లినట్లు అయ్యింది.

ఇంక సరిపోదా శనివారం సినిమా విషయానికి వస్తే.. నాని సరసన ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా చేస్తోంది. గ్యాంగ్ లీడర్ తర్వాత మరోసారి వీళ్ల కాంబో రిపీట్ అవుతోంది. ఈ మూవీని డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. దీనిని తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేసేందుకు డిసైడ్ అయ్యారు. ఎస్ జే సూర్య ఈ మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ మూవీని ఆగస్టులో రిలీజ్ చేసే ఆలోచనల్లో మేకర్స్ ఉన్నారు. అయితే అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. మరి.. సరిపోదా శనివారం ఓటీటీ రైట్స్ విషయంలో వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.